Double road
-
కేంద్రానికి రాష్ట్రం సహకారం
మల్యాల (చొప్పదండి): రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వా త అందరూ అభివృద్ధే ల క్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రానికి సహక రిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం క్రాస్‌రోడ్డు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం కాచారం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.రోడ్డు విస్తరణ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగానే రూ.25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సత్యం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించాలని కోరారు. గత ప్రభుత్వం పగ, ప్రతీకారాలతో ప్రొటోకాల్ పాటించలేదని, అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మీ విధ్వంసంతో చీకట్లోకి రాష్ట్రంసీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఉదయిస్తున్న సూర్యుడిలా పురోగమిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను పునరి్నరి్మంచే బదులు రేవంత్‌రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని చీకట్లలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉదయించట్లేదని.. కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల మాటున నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచి్చన అంతులేని నకిలీ హామీల చిట్టా ఈ జన్మకు నెరవేరదని ఎద్దేవా చేశారు.ఒకవేళ ఆరు గ్యారంటీలను నిజంగా అమలు చేశామని రేవంత్ నమ్మితే పాదయాత్ర చేపట్టి ప్రజల నుంచి నిజాలు తెలుసుకోవాలని మరోసారి సూచించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ఖాతాలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి బండి సంజయ్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి గారు... మీరు యావత్ తెలంగాణను మోసగించారు. మీరిచ్చిన గ్యారంటీ కార్డు మాటున షరతులు వర్తిస్తాయనే విషయాన్ని అమాయకులైన తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు.6 గ్యారంటీలను నెరవేర్చడానికి 100 రోజులు, 1,000 రోజులు కాదు కదా.. 10 వేల రోజులైనా సరిపోవు’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హామీల అమలును కాంగ్రెస్ బోగస్‌గా మార్చిందని దుయ్యబట్టారు. ‘6 గ్యారంటీల అమలుకు నిధుల్లేని మీవద్ద మూసీ ప్రాజెక్టు కోసం రూ. 1.50 లక్షల కోట్లు మాత్రం ఉన్నాయి. మూసీ ప్రాజెక్టును మరో కాళేశ్వరం తరహా ఏటీఎంగా మారుస్తున్నారు’అని బండి సంజయ్ ‘ఎక్స్’లో ఆరోపించారు. ఒవైసీపై ధ్వజం: టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలంటున్న ప్రధాని మోదీ సర్కార్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడం ఏమిటంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. -
యువజన సంఘాల మహాధర్నా ఉద్రిక్తం
గన్నేరువరం (మానకొండూర్)/తిమ్మాపూర్: డబుల్ రోడ్డు నిర్మాణం కోసం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఆదివారం యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. గుండ్లపల్లి నుంచి వయా గన్నేరువరం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. పోలీసులు గుండ్లపల్లికి చేరుకోవడంతో ఆందోళనకారులు రూటు మార్చి గుండ్లపల్లి దాబా వద్ద రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరినా.. ఆందోళనకారులు పట్టించుకోకపోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. యువజన సంఘాల నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విఫలమయ్యారని విమర్శించారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే రసమయి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసమర్థత ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి బెజ్జంకి వైపు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై ఆందోళనకారులు చెప్పులు విసురుతూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కవ్వంపల్లి, శ్రీనాథ్‌రెడ్డి, యువజన సంఘాల సభ్యులను అదుపులోకి తీసుకుని తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్, అనంతరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్‌రెడ్డి, బామండ్ల రవీందర్, నాయకులు పాల్గొన్నారు. ఎల్ఎండీ ఠాణాను ముట్టడించిన టీఆర్ఎస్ రసమయి బాలకిషన్‌పై దాడికి నిరసనగా టీఆర్ఎస్ నాయకులు భారీగా ఎల్ఎండీ ఠాణాకు చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న సీపీ, పోలీస్ అధికారులు టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి ఆందోళన విరమించాలని సూచించారు. గన్నేరువరంలో తనపై జరిగిన దాడి గురించి గన్నేరువరం జెడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి.. రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రసమయి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. వాహనంపై దాడి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్నా అంటే దాడులు చేయడమేనా? అని ప్రశ్నించారు. 40 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, 8 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాకు వచ్చిన సమయంలో రహదారులకు నిధులు ఎందుకు అడగలేదని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. -
గ్రహణం వీడేనా..?
సాక్షి, పాల్వంచ : కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో డబుల్ రోడ్డు నిర్మాణానికి వైల్డ్‌లైఫ్ శాఖాధికారులు అనుమతి నిరాకరించారు. అభయారణ్యాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రహదారుల కంటే ఒక్క ఇంచు కూడా ఎక్కువ విస్తీర్ణంలో వేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రెండేళ్ల క్రితం మంజూరైన డబుల్ రోడ్డు పనులకు మంగళం పాడారు. ఇక్కడ సింగిల్ రోడ్డు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నా.. అందులోనూ జాప్యం జరుగుతోంది. కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో పాల్వంచ మండలం రాజాపురం నుంచి ఉల్వనూరు, చండ్రాలగూడెం మీదుగా కొత్తగూడెం మండలంలోని మైలారం నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్డు వరకు రూ.62 కోట్ల వ్యయంతో 2016లో డబుల్ రోడ్డు మంజూరైంది. అయితే 51 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్ శాఖ ద్వారా అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అభయారణ్యంలో రోడ్డు విస్తరణకు ఆ శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రాజాపురం నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండగా గత ఏడాది మే లో వైల్డ్‌లైఫ్ శాఖా అధికారులు నిలిపివేశారు. ప్రమాదకరంగా కల్వర్టులు... రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రహదారి పొడవునా కల్వర్టులు కూడా నిర్మించారు. అయితే రోడ్డుకు కల్వర్టులు ఎత్తుగా ఉండడంతో వర్షాకాలంలో రాకపోకలకు ప్రమాదకరంగా మారాయని వాహనదారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉల్వనూరు గ్రామ సమీపంలో, మల్లారం క్రాస్ రోడ్డు నుంచి రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైంది. రోడ్డు నిర్మాణ పనులు గత జూలైలో నిలిచిపోగా.. విస్తరణ అనుమతులు కోసం ఆర్అండ్బీ అధికారులు కేంద్రం అనుమతి కోసం ఢిల్లీకి ప్రతిపాదనలు పంపారు. సంబంధిత అధికారులతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. అయినా విస్తరణ పనులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు వైల్డ్‌లైఫ్ పరిధిలో లేని ప్రాంతంలో 8 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్డు నిర్మించారు. 30 కిలోమీటర్ల మేర పనులు నిలిపివేశారు. అయితే పాత రోడ్డుకు కూడా తమ అనుమతులు లేవని వైల్డ్‌లైఫ్ శాఖ అధికారులు అంటున్నారు. మరి అప్పుడు అనుమతి లేకుండా రహదారి నిర్మాణం ఎలా చేపట్టారనేది చర్చనీయాంశంగా మారింది. సింగిల్ రోడ్డు నిర్మిస్తాం మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు, చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు 51కిలోమీటర్లు వైల్డ్‌లైఫ్ శాఖ పరిధిలో నిర్మించాల్సిన డబుల్ తారు రోడ్డు విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రెండు సంవత్సరాలుగా పనులు నిలిచిన మాట వాస్తవమే. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వైల్డ్‌లైఫ్ శాఖ అధికారులతో మాట్లాడినా, ప్రభు త్వం ద్వారా ప్రతిపాదనలు పంపినా వారు అనుమతి ఇవ్వడానికి నిరాక రించారు. చివరికి పాత సింగిల్ రోడ్డును పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నాం. అందుకోసం ఎస్ఈకి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక, వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. – రాజేశ్వరరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ -
పల్లె టు పట్నం
నిజామాబాద్ సిటీ: జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. ప్రతి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన మేరకు జిల్లాలోని రోడ్ల రూపురేఖలు మారిపోతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని రోడ్లు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ రోడ్లు వాహనాల రద్దీతో ఇరుకుగా మారి ప్రయాణానికి ఇబ్బం దిగా మారాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండులైన్ల రహదారులు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామీణులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం సింగల్ లైన్ రోడ్డు ఉండటంతో గ్రామీణులు జిల్లా కేం ద్రానికి చేరుకోవాలంటే ఎంతో ప్రయాస పడా ల్సి వస్తోంది. రెండులైన్ల రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు తగ్గడమే కాకుండా ప్రయాణ భారం కూడా తగ్గిపోతుంది. జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్ర రహదారులను మెరుగుపరిచిన నేపథ్యంలో జిల్లాలోని భిక్కనూర్, కామారెడ్డి, సదాశివనగర్, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, బా ల్కొండ మండలాల కేంద్రాల రోడ్లు బాగుపడ్డాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మండల కేంద్రాలకే ఈ అవకాశం దక్కినట్లయ్యింది. కాగా జాతీయ, రాష్ట్ర రహ దారులకు దూరంగా ఉన్న మండలాలలో రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. దీంతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రోడ్లు నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సింగిల్ లైన్ రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా, డబుల్‌లైన్ ఉన్న రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆర్అండ్బీ అధికారులు హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యా ల యానికి ప్రతిపాదనలు పం పారు. నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు రూపొందించారు. రోడ్లతో పాటు కొత్తగా వంతెనల నిర్మాణాలు చేపట్టనున్నారు. నాగిరెడ్డిపేట్, తాడ్వాయి, దోమకొండ, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, బీర్కూర్, మద్నూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి, బోధన్, రెంజల్, నవీపేట్, నం దిపేట్, మాక్లూర్ మండలాలు జాతీయ రోడ్లకు దూరంగా ఉండటంతో ఇక్కడి రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మారుమూల రోడ్లు సైతం బాగుపడనున్నాయి. జిల్లాలో రోడ్లు అభివృద్ధి చేస్తే వాటిపై కొత్తగా 32 బ్రిడ్జి లు నిర్మించవలసి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. -
రెండు నెలల్లో రోడ్లు పూర్తి
=నిధులకు లోటు లేదు =మేడారం జాతర దారివెంట గ్రామాలన్నింటా డబుల్ రోడ్డు =జంపన్నవాగుపై మరో బ్రిడ్జి =ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్‌నాయక్ వెల్లడి వరంగల్, న్యూస్‌లైన్: ‘జాతర నిధులకు ఎలాంటి లోటు లేదు. మరింత పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్లను గుర్తించాం. వాటి పనులను ప్రారంభించాం. జాతర రూట్లో ఉన్న గ్రామాల్లో కూడా రోడ్లను వెడల్పు చేస్తున్నాం. గత జాతర సందర్భంగా కొన్ని గ్రామాల్లో వాహనాలు నిలిచిపోవడంతో క్రేన్ పెట్టి క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి గ్రామాలను, రోడ్లను గుర్తించి విస్తరిస్తున్నాం. జనవరి 30 వరకు రోడ్లన్నీ పూర్తి చేసి జాతరకు సిద్ధంగా ఉంటాం..’ అని ఆర్అండ్బీ ఎస్ఈ జె.మోహన్ నాయక్ అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్ల మరమ్మతులకు రూ.19 కోట్లు, ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో రూ. 19 కోట్ల విలువైన పనులకు టెండర్లు ముగిశాయని, రూ. 21 కోట్ల విలువైన పనులకు వచ్చే నెల 2న టెండర్లు పూర్తి చేస్తామన్నారు. జాతర పనులు, కొత్త రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మేడారం చుట్టూ కొత్త రోడ్లు గత జాతర సమయంలో ఏయే రోడ్ల వెంట, ఎక్కడ నుంచి ఎంత మంది వస్తారనే విషయాలను గుర్తించాం. పస్రా-గుండాల రోడ్లను డబుల్ లేన్‌గా విస్తరిస్తున్నాం. పస్రా నుంచి నార్లపూర్ వెంట మొత్తం 6 కిలోమీటర్లు, బయ్యక్కపేట వరకు 11.6 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మధ్యలో తెగిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నాం. తాడ్వాయి, నార్లపూర్ వరకు 11 కిలోమీటర్ల రోడ్డును పెద్దగా చేస్తున్నాం. ఇక ఊరట్టం నుంచి మల్యాల వరకు 10 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నం. దీనికి మొదట అటవీ శాఖ అభ్యంతరం తెలిపినా తర్వాత క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. ఇక ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం ఈసారి నేరుగా మేడారం వచ్చేందుకు ప్రధాన రోడ్డును గుర్తించాం. కరీంనగర్ నుంచి భూపాపల్లి మీద గా బయ్యక్కపేట నుంచి నేరుగా మేడారం వచ్చేందుకు రోడ్డును నిర్మిస్తున్నాం. రూ. 4 కోట్లు కేటాయించాం. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే... పరకాల, జంగాలపల్లి, ములుగు ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రావు. గ్రామాల రోడ్లు..రెండింతలు ప్రధానంగా గ్రామాల్లో ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోనే ట్రాఫిక్ ఆగిపోతోంది. దీంతో ఈసారి చుట్టూ ఉన్న గ్రామాల్లోని రోడ్లను రెండింతలు చేసే ప్రయత్నం చేస్తునా. నార్లపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్ల బుద్దారం, రాంపూర్ గ్రామాల్లో రోడ్లను వెడల్పు చేస్తున్నాం. వట్టివా గు, తుమ్మలవాగుల నుంచి ఇప్పటి వరకు రాకపోకలకు చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పు డు వాటిపై రూ. 8 కోట్లతో రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. పనులు మొదలుపెట్టాం. జంపన్నవాగుపై మరో బ్రిడ్జి జంపన్నవాగుపై మరో 100 మీటర్ల పొడవుగా కొత్త బ్రిడ్జిని ప్రతిపాదించాం. దీనికి రూ. 3 కోట్లు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడున్న బ్రిడ్జి పక్కనే దీనిని నిర్మాణం చేస్తాం. ఇక్కడ భూ సేకరణ సమస్య కూడా లేదు. గతంలో సేకరించిన భూమి ఉంది. జనవరి 30 నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి తోడు సమ్మక్క గద్దెల నుంచి జంపన్నవాగు వరకు ఇప్పుడు డబుల్ రోడ్డును 10 మీటర్ల వరకు వెడల్పు చేస్తున్నాం. దీనికి కూడా నిధుల కేటాయింపు జరిగింది. దీంతో స్నాన ఘట్టాలకు వెళ్లేందుకు చాలా తేలికవుతుంది. ఇవన్నీ పూర్తి చేసి జాతర వరకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. ఇప్పటికే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను వేరే చోట్ల పనులు చేయనీయకుండా... మేడారం పనులనే కట్టబెట్టాం. వచ్చేనెల 2న మరో రూ. 21 కోట్ల పనులకు టెండర్లు పూర్తి కాగానే... త్వరగా అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. జాతర రూట్లోనే కాకుండా లింక్ రోడ్లన్నీ ప్రత్యేకంగా మరమ్మతులు చేస్తున్నాం. వాటన్నింటినీ జనవరి 30 వరకు పూర్తి చే స్తాం.