నిజామాబాద్ సిటీ: జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. ప్రతి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన మేరకు జిల్లాలోని రోడ్ల రూపురేఖలు మారిపోతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని రోడ్లు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు.
ప్రస్తుతం ఈ రోడ్లు వాహనాల రద్దీతో ఇరుకుగా మారి ప్రయాణానికి ఇబ్బం దిగా మారాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండులైన్ల రహదారులు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామీణులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం సింగల్ లైన్ రోడ్డు ఉండటంతో గ్రామీణులు జిల్లా కేం ద్రానికి చేరుకోవాలంటే ఎంతో ప్రయాస పడా ల్సి వస్తోంది. రెండులైన్ల రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు తగ్గడమే కాకుండా ప్రయాణ భారం కూడా తగ్గిపోతుంది.
జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్ర రహదారులను మెరుగుపరిచిన నేపథ్యంలో జిల్లాలోని భిక్కనూర్, కామారెడ్డి, సదాశివనగర్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, బా ల్కొండ మండలాల కేంద్రాల రోడ్లు బాగుపడ్డాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మండల కేంద్రాలకే ఈ అవకాశం దక్కినట్లయ్యింది. కాగా జాతీయ, రాష్ట్ర రహ దారులకు దూరంగా ఉన్న మండలాలలో రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి.
దీంతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రోడ్లు నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సింగిల్ లైన్ రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా, డబుల్‌లైన్ ఉన్న రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యా ల యానికి ప్రతిపాదనలు పం పారు. నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు రూపొందించారు. రోడ్లతో పాటు కొత్తగా వంతెనల నిర్మాణాలు చేపట్టనున్నారు.
నాగిరెడ్డిపేట్, తాడ్వాయి, దోమకొండ, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, బీర్కూర్, మద్నూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి, బోధన్, రెంజల్, నవీపేట్, నం దిపేట్, మాక్లూర్ మండలాలు జాతీయ రోడ్లకు దూరంగా ఉండటంతో ఇక్కడి రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మారుమూల రోడ్లు సైతం బాగుపడనున్నాయి. జిల్లాలో రోడ్లు అభివృద్ధి చేస్తే వాటిపై కొత్తగా 32 బ్రిడ్జి లు నిర్మించవలసి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు.
పల్లె టు పట్నం
Published Sat, Nov 8 2014 2:53 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement