four lines
-
పల్లె టు పట్నం
నిజామాబాద్ సిటీ: జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. ప్రతి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన మేరకు జిల్లాలోని రోడ్ల రూపురేఖలు మారిపోతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని రోడ్లు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ రోడ్లు వాహనాల రద్దీతో ఇరుకుగా మారి ప్రయాణానికి ఇబ్బం దిగా మారాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండులైన్ల రహదారులు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామీణులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం సింగల్ లైన్ రోడ్డు ఉండటంతో గ్రామీణులు జిల్లా కేం ద్రానికి చేరుకోవాలంటే ఎంతో ప్రయాస పడా ల్సి వస్తోంది. రెండులైన్ల రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు తగ్గడమే కాకుండా ప్రయాణ భారం కూడా తగ్గిపోతుంది. జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్ర రహదారులను మెరుగుపరిచిన నేపథ్యంలో జిల్లాలోని భిక్కనూర్, కామారెడ్డి, సదాశివనగర్, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, బా ల్కొండ మండలాల కేంద్రాల రోడ్లు బాగుపడ్డాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మండల కేంద్రాలకే ఈ అవకాశం దక్కినట్లయ్యింది. కాగా జాతీయ, రాష్ట్ర రహ దారులకు దూరంగా ఉన్న మండలాలలో రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. దీంతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రోడ్లు నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సింగిల్ లైన్ రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా, డబుల్‌లైన్ ఉన్న రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆర్అండ్బీ అధికారులు హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యా ల యానికి ప్రతిపాదనలు పం పారు. నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు రూపొందించారు. రోడ్లతో పాటు కొత్తగా వంతెనల నిర్మాణాలు చేపట్టనున్నారు. నాగిరెడ్డిపేట్, తాడ్వాయి, దోమకొండ, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, బీర్కూర్, మద్నూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి, బోధన్, రెంజల్, నవీపేట్, నం దిపేట్, మాక్లూర్ మండలాలు జాతీయ రోడ్లకు దూరంగా ఉండటంతో ఇక్కడి రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మారుమూల రోడ్లు సైతం బాగుపడనున్నాయి. జిల్లాలో రోడ్లు అభివృద్ధి చేస్తే వాటిపై కొత్తగా 32 బ్రిడ్జి లు నిర్మించవలసి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. -
వీయూపీల వద్ద విస్తరణ పనులు ఆపాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : రామగుండంలోని రాజీవ్ రహదారి పై నిర్మించనున్న వెహికల్ అండర్ పాస్(వీయూపీ)ల వద్ద నా లుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను ఆపాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ రాజులు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం ఆ యన స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి గో దావరిఖని నుంచి రామగుండం వెళ్లే రోడ్డులో వీయూపీలు నిర్మించనున్న బస్టాండ్, ఇల్లందు గెస్ట్ హౌజ్ గేట్ ప్రాంతం, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ ప్రాంతాలను పరిశీ లించారు. వీయూపీలు నిర్మించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాజులు రోడ్డు పనులు పరిశీలించారు. వీయూపీలు నిర్మించకపోతే ర ద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు రోడ్డు దాటే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే రాజులుకు వివరించా రు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట 7.5 మీటర్ల సర్వీస్ రోడ్డు నిర్మించాలన్నారు. దీంతో చీఫ్ ఇంజినీర్ రోడ్డు కాంట్రాక్టు సంస్థకు చెందిన ఇంజినీర్‌ను పిలిపించి వీయూపీలు నిర్మించే చోట రోడ్డు విస్తరణ పనులు ఆపాలని ఆదేశించారు. వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమం జ్యోతినగర్ : రాజీవ్ రహదారి ఫోర్ వేలో వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమాలు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఎన్టీపీసీ ఆటోనగర్ రాజీవ్ రహదారిపై విలేకరులతో మాట్లాడారు. వీయూపీలు నిర్మించాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ రోడ్డు పనులను పరిశీలించారని తెలిపారు. ఆయనకు ఇక్కడి పరిస్థితులను వివరించి, వీయూపీలను నిర్మించాలని చెప్పామన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ప్రకాశ్, శ్రీనివాస్, ఓదెలు తదితరులున్నారు. -
విస్తరణ ఎప్పుడో?
గజ్వేల్, న్యూస్‌లైన్: మూడు జాతీయ, మరో మూడు రాష్ట్ర రహదారులను కలుపుతూ అంతర్ జిల్లా వ్యాపార, వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా ఉన్న భువనగిరి-గజ్వేల్-తూప్రాన్-సంగారెడ్డి లింక్ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి ఏడాది క్రితం జీఓ విడుదలైనా పనులు మొదలు కావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ రహదారిని అభివృద్ధి చేయడానికి సంకల్పించి ట్రాఫిక్ సర్వే పూర్తి చేశారు. అయితే మిగితా ప్రక్రియ ముం దుకు సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతూ రోడ్డు విస్తరణపై తాత్సారం చేస్తున్నారు. మరమ్మతు పనులు కూడా మొక్కుబడిగా సాగుతుండడంతో ప్రజాధనం వృధా అవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు 170 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లింక్ రోడ్డు 202, 44, 65వ జాతీయ రహదారులతోపాటు రాజీవ్ రహదారి, హైదరాబాద్-మెదక్, సంగారెడ్డి రూట్లలో మరో మూడు రాష్ట్ర రహదారులను కలుపుతుండటం వల్ల ఇది వ్యాపార, వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా మారింది. ఈ ప్రాంతం నుంచి నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్‌పల్లి మీదుగా చెన్నైకి నిత్యం వ్యాపార అవసరాల నిమిత్తం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాలు భారీగా తిరుగుతుండడం వల్ల ఈ రోడ్డు తరచూ పాడవుతుంది. వర్షాకాలం వస్తే చాలు పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ఎక్కడపడితే అక్కడ మోకాలు లోతు గుంతలు పడి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రహదారి పనుల స్వరూపమిది... నల్గొండ జిల్లా చిట్యాల నుంచి భువనగిరి-గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు 65వ నంబర్ జాతీయ రహదారిని తాకుతూ 170 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉంది. దీన్ని పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్), బీఓటీ(బిల్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్) విధానంలో నాలుగు లేన్లుగా మార్చాల్సి ఉంది. ఇందుదకుగాను కిలో మీటర్‌కు రూ.7 కోట్ల చొప్పున సుమారు రూ.1,190 కోట్ల అంచనాలతో నిర్మాణం పనులు జరనున్నట్లు సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలిసింది. ట్రాఫిక్ సర్వే పూర్తయినా... విస్తరణ ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్ సర్వే పూర్తి చేశారు. దీని తర్వాత టెండర్ ప్రక్రియకు సంబంధించిన పని మొదలుపెట్టాల్సి ఉండగా ఈ వ్యవహారంపై చడీచప్పుడు లేదు. ప్రస్తుతం రహదారిపై ఏర్పడుతున్న గుంతల నివారణకు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఈ రహదారిపై ప్రజ్ఞాపూర్-నర్సాపూర్ వరకు ఒక బిట్టుగా విభజించి 50 కిలోమీటర్ల పొడవునా గత ఐదేళ్లుగా రూ.26 కోట్ల వ్యయంతో ఏటా తాత్కాలికంగా మరమ్మతు పనులు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. రహదారిపై మిగితా చోట్ల కూడా తాత్కాలిక మరమ్మతులే చేపట్టి వదిలేస్తున్నారు.