గోదావరిఖని, న్యూస్‌లైన్ : రామగుండంలోని రాజీవ్ రహదారి పై నిర్మించనున్న వెహికల్ అండర్ పాస్(వీయూపీ)ల వద్ద నా లుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను ఆపాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ రాజులు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం ఆ యన స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి గో దావరిఖని నుంచి రామగుండం వెళ్లే రోడ్డులో వీయూపీలు నిర్మించనున్న బస్టాండ్, ఇల్లందు గెస్ట్ హౌజ్ గేట్ ప్రాంతం, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ ప్రాంతాలను పరిశీ లించారు. వీయూపీలు నిర్మించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో రాజులు రోడ్డు పనులు పరిశీలించారు. వీయూపీలు నిర్మించకపోతే ర ద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు రోడ్డు దాటే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే రాజులుకు వివరించా రు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట 7.5 మీటర్ల సర్వీస్ రోడ్డు నిర్మించాలన్నారు. దీంతో చీఫ్ ఇంజినీర్ రోడ్డు కాంట్రాక్టు సంస్థకు చెందిన ఇంజినీర్‌ను పిలిపించి వీయూపీలు నిర్మించే చోట రోడ్డు విస్తరణ పనులు ఆపాలని ఆదేశించారు.
వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమం
జ్యోతినగర్ : రాజీవ్ రహదారి ఫోర్ వేలో వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమాలు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఎన్టీపీసీ ఆటోనగర్ రాజీవ్ రహదారిపై విలేకరులతో మాట్లాడారు. వీయూపీలు నిర్మించాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ రోడ్డు పనులను పరిశీలించారని తెలిపారు. ఆయనకు ఇక్కడి పరిస్థితులను వివరించి, వీయూపీలను నిర్మించాలని చెప్పామన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ప్రకాశ్, శ్రీనివాస్, ఓదెలు తదితరులున్నారు.
వీయూపీల వద్ద విస్తరణ పనులు ఆపాలి
Published Mon, Oct 21 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement