chief engineer
-
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్‌తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్‌కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్‌లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్‌లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్‌ప్లే వంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్‌కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్‌లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్‌లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్‌గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్‌ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్‌ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్‌వేర్‌కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్‌ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్ ఇళ్లపై శుక్రవారం ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసింది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, కరీంనగర్ సహా ఏడుచోట్ల సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సురేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను గుర్తించామని అన్నారు. కరీంనగర్లో విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవనం, హైదరాబాద్‌లో మూడు అసార్ట్‌మెంట్లు, 10 ఇళ్ల స్థలాలు గుర్తించినట్లు వెల్లడించారు. -
తెలుగు గంగ సీఈగా బి. సుధాకర్‌బాబు
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం సూపరిండెంట్ ఇంజనీర్ బి.సుధాకర్‌బాబుకు ప్రభుత్వం తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల తెలుగు గంగ సీఈ సుధాకర్ పదవీ విరమణ చేశారు. అనంతపురం జిల్లా సీఈ జలంధర్ ఇప్పటివరకూ తెలుగుగంగ సీఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుగంగకు పూర్తిస్థాయి సీఈ నియమించాలని భావించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలను బి.సుధాకర్‌బాబుకు అప్పగించింది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగంలో సీఈగా పనిచేస్తోన్న నారాయణరెడ్డిని కర్నూల్ సీఈగా నియమించింది. క్వాలిటీ కంట్రోల్(రాయలసీమ) విభాగం సీఈగా కె.వరదరాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల విభాగం సంయుక్త కార్యదర్శి బి.వేదవ్యాసకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగం సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
పుష్కర పనులపై చీఫ్ ఇంజనీర్ ఆగ్రహం
దామరచర్ల(నల్లగొండ): కృష్ణాపుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై ఎన్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ సునిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల కృష్ణానది పుష్కర స్నానఘట్ట పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాలు జరగనుండటంతో.. జూలై నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. -
పనులు పూర్తి చేయకుంటే చర్యలు
కర్నూలు సిటీ: శ్రీశైలం కుడి గట్టు కాల్వ పెండింగ్ ప్యాకేజీల పనులు సకాలంలో పూర్తి చేయకుంటే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ చిట్టిబాబు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. శుక్రవారం సీఈ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల పురోగతి, ఈ ఏడాది ఎంత మేరకు నీరు ఇస్తారు అనే అంశాలపై ఈఈలు, ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ఈ ఏడాది గాలేరు నగరి సుజల స్రవంతి పథకం ద్వారా గండికోటకు నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 24వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యుసెక్కుల నీరును తరలించేలా ఉండే అడ్డంకులను తొలగించాలన్నారు. పనులు పూర్తవుతున్నాయని, 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకునేలా హెడ్ రెగ్యులేటర్ గేట్లు, వాటి నియంత్రణ పనులు పూర్తికావోచ్చాయని అధికారులు సీఈకి తెలిపారు. 25వ ప్యాకేజీలో 60 కి.మీ దగ్గర నిర్మించాల్సి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 26 ప్యాకేజీలో సైడ్ వాల్స్‌కు పడ్డ రంధ్రాలను పూడ్చి వేసేందుకు కాంట్రాక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పనికి తగ్గ యంత్రాలను ఏర్పాటు చేసుకోని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 27 ప్యాకేజీలో కాంక్రిట్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కొ సబ్ డివిజన్లో 16 మంది జేఈలకుగానీ ఇద్దరు, ముగ్గురుకి మించి లేరని, ఏఈలు, డీఏఓలు, సూపరింటెండెంట్ల కొరత తీవ్రంగా ఉందని, సిబ్బందిని నియమిస్తేనే పనుల్లో పురోగతి వేగవంతం అవుతుందని అధికారులు వివరించారు. సమావేశంలో ఎస్ఆర్బీసీ ఎస్ఈ శ్రీనివాసరావు, తెలుగుగంగా ఎస్ఈ రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నిర్బంధం
నాగార్జునసాగర్ :నాగార్జునప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్ ఎల్లారెడ్డిని ఎన్నెస్పీ ఉద్యోగులు ఆయన కార్యాలయంలో మంగళవారం నిర్బంధించారు. గతనెల వేతనాలందక ఉద్యోగులు వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే అన్ని కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయాలకు తాళాలు వేస్తూ సీఈ కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులను,అధికారులను బయటకు పంపి సీఈ చాంబర్‌కు వెళ్లారు అక్కడ సీఈ ఉండటంతో మాకువేతనాలు ఇప్పించేంత వరకు కార్యాలయంలోనే ఉండాలని సాయంత్రం వరకు కూర్చున్నారు. పీఏఓతో చెప్పి వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు మహిళా ఉద్యోగులు పీఏఓ రమణారావు వద్దకు వెళ్లి వేతనాల విషయంపై వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆయనపై చేయిచేసుకునే వరకు వెళ్లారు. మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో.. పేఅండ్‌అకౌంట్ జేడీతో చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి ఫోన్లో మాట్లాడారు. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తే వేతనాలు ఇవ్వడానికి ఇబ్బందు లేమీ లేవన్నారు. ఫైళ్లు ప్రభుత్వం వద్దనే ఉన్నట్లుగా సీఈ తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శికి ఫోన్‌చేయగా సంబంధిత ఫైల్ చూడాల్సిన అధికారి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. చివరకు అడ్వాన్సు రూపేణా చెల్లిం చేందుకు గాను అధికారులతో మాట్లాడారు. మూడు రో జుల్లో వేతనాలు ఇప్పించడానికి కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. కార్యక్రమం లో ఉద్యోగ సం ఘాల నాయకులు పాల్గొన్నారు. -
వీయూపీల వద్ద విస్తరణ పనులు ఆపాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : రామగుండంలోని రాజీవ్ రహదారి పై నిర్మించనున్న వెహికల్ అండర్ పాస్(వీయూపీ)ల వద్ద నా లుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను ఆపాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ రాజులు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం ఆ యన స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి గో దావరిఖని నుంచి రామగుండం వెళ్లే రోడ్డులో వీయూపీలు నిర్మించనున్న బస్టాండ్, ఇల్లందు గెస్ట్ హౌజ్ గేట్ ప్రాంతం, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ ప్రాంతాలను పరిశీ లించారు. వీయూపీలు నిర్మించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాజులు రోడ్డు పనులు పరిశీలించారు. వీయూపీలు నిర్మించకపోతే ర ద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు రోడ్డు దాటే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే రాజులుకు వివరించా రు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట 7.5 మీటర్ల సర్వీస్ రోడ్డు నిర్మించాలన్నారు. దీంతో చీఫ్ ఇంజినీర్ రోడ్డు కాంట్రాక్టు సంస్థకు చెందిన ఇంజినీర్‌ను పిలిపించి వీయూపీలు నిర్మించే చోట రోడ్డు విస్తరణ పనులు ఆపాలని ఆదేశించారు. వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమం జ్యోతినగర్ : రాజీవ్ రహదారి ఫోర్ వేలో వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమాలు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఎన్టీపీసీ ఆటోనగర్ రాజీవ్ రహదారిపై విలేకరులతో మాట్లాడారు. వీయూపీలు నిర్మించాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ రోడ్డు పనులను పరిశీలించారని తెలిపారు. ఆయనకు ఇక్కడి పరిస్థితులను వివరించి, వీయూపీలను నిర్మించాలని చెప్పామన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ప్రకాశ్, శ్రీనివాస్, ఓదెలు తదితరులున్నారు. -
ఎన్టీటీపీఎస్లో భద్రత కట్టుదిట్టం
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీటీపీఎస్)లో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఆది వారం నుంచి థర్మల్ కేంద్రం మూడు గేట్ల వద్ద స్పెషల్ ప్రొటెక్ష న్ ఫోర్స్ (ప్రత్యేక పోలీసు దళం)ను నియమించారు. ఎన్టీటీపీఎస్లో నిఘా వ్యవస్థను ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని నగర పోలీసు కమిషనర్ గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీంతో ఇక్కడ భద్రత కోసం ఈ దళాన్ని ప్రభుత్వం నియమించింది. ఎన్టీటీపీఎస్కు నియమితులైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఆదివారం విద్యుత్ కేంద్రానికి వచ్చారు. వీరికోసం సెక్యూరిటీ విభాగంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య ప్రారంభించారు. అంతకు ముందు ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్కు ప్రత్యేక రక్షణ కోసం మొత్తం 207 మంది సిబ్బంది నియమితులయ్యారన్నారు. అధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఈ థర్మల్ కేంద్రానికి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి, నిఘాను పెంచినట్లు చెప్పారు. డీఎస్పీ స్థాయి అధికారులు కమాండెంట్లుగా, సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఇందులో విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎన్టీటీపీఎస్లోని మూడు గేట్ల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లో కోల్ విభాగంలో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్టీటీపీఎస్లో 3500 మంది ఉద్యోగులు, రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరి వద్ద గేట్ పాస్‌లు, ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించాలని సూచిం చారు. ప్రస్తుతం నియమితులైన 207 మంది సిబ్బందిలో కొందరికి మాత్రమే క్వార్టర్ సౌకర్యం కల్పించామని, మిగిలిన వారికి కూడా త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఎస్పీలు మాధవరావు, నాగమల్లేశ్వరరావు, పరిపాలనా విభాగం ఎస్ఈ రమేష్, ఎస్ఈ సుబ్రహ్మణ్యరాజు, ఫ్యాక్టరీ మేనేజర్ జీవకుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.