తెలుగు గంగ సీఈగా బి. సుధాకర్‌బాబు | B. Sudhakar Babu appointed as Telugu Ganga CE | Sakshi
Sakshi News home page

తెలుగు గంగ సీఈగా బి. సుధాకర్‌బాబు

Published Fri, Aug 5 2016 8:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

B. Sudhakar Babu appointed as Telugu Ganga CE

హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం సూపరిండెంట్ ఇంజనీర్ బి.సుధాకర్‌బాబుకు ప్రభుత్వం తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల తెలుగు గంగ సీఈ సుధాకర్ పదవీ విరమణ చేశారు. అనంతపురం జిల్లా సీఈ జలంధర్ ఇప్పటివరకూ తెలుగుగంగ సీఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

తెలుగుగంగకు పూర్తిస్థాయి సీఈ నియమించాలని భావించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలను బి.సుధాకర్‌బాబుకు అప్పగించింది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగంలో సీఈగా పనిచేస్తోన్న నారాయణరెడ్డిని కర్నూల్ సీఈగా నియమించింది. క్వాలిటీ కంట్రోల్(రాయలసీమ) విభాగం సీఈగా కె.వరదరాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల విభాగం సంయుక్త కార్యదర్శి బి.వేదవ్యాసకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగం సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement