కర్నూలు సిటీ: శ్రీశైలం కుడి గట్టు కాల్వ పెండింగ్ ప్యాకేజీల పనులు సకాలంలో పూర్తి చేయకుంటే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ చిట్టిబాబు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. శుక్రవారం సీఈ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల పురోగతి, ఈ ఏడాది ఎంత మేరకు నీరు ఇస్తారు అనే అంశాలపై ఈఈలు, ఏజెన్సీలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ఈ ఏడాది గాలేరు నగరి సుజల స్రవంతి పథకం ద్వారా గండికోటకు నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 24వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యుసెక్కుల నీరును తరలించేలా ఉండే అడ్డంకులను తొలగించాలన్నారు. పనులు పూర్తవుతున్నాయని, 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకునేలా హెడ్ రెగ్యులేటర్ గేట్లు, వాటి నియంత్రణ పనులు పూర్తికావోచ్చాయని అధికారులు సీఈకి తెలిపారు. 25వ ప్యాకేజీలో 60 కి.మీ దగ్గర నిర్మించాల్సి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
26 ప్యాకేజీలో సైడ్ వాల్స్‌కు పడ్డ రంధ్రాలను పూడ్చి వేసేందుకు కాంట్రాక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పనికి తగ్గ యంత్రాలను ఏర్పాటు చేసుకోని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 27 ప్యాకేజీలో కాంక్రిట్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కొ సబ్ డివిజన్‌లో 16 మంది జేఈలకుగానీ ఇద్దరు, ముగ్గురుకి మించి లేరని, ఏఈలు, డీఏఓలు, సూపరింటెండెంట్‌ల కొరత తీవ్రంగా ఉందని, సిబ్బందిని నియమిస్తేనే పనుల్లో పురోగతి వేగవంతం అవుతుందని అధికారులు వివరించారు. సమావేశంలో ఎస్‌ఆర్‌బీసీ ఎస్‌ఈ శ్రీనివాసరావు, తెలుగుగంగా ఎస్‌ఈ రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
పనులు పూర్తి చేయకుంటే చర్యలు
Published Sat, Jul 18 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement