కృష్ణాపుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై ఎన్‌ఎస్‌పీ చీఫ్ ఇంజనీర్ సునిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దామరచర్ల(నల్లగొండ): కృష్ణాపుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై ఎన్‌ఎస్‌పీ చీఫ్ ఇంజనీర్ సునిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల కృష్ణానది పుష్కర స్నానఘట్ట పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాలు జరగనుండటంతో.. జూలై నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.