
సురేష్ కుమార్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్ ఇళ్లపై శుక్రవారం ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసింది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, కరీంనగర్ సహా ఏడుచోట్ల సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సురేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను గుర్తించామని అన్నారు. కరీంనగర్‌లో విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవనం, హైదరాబాద్‌లో మూడు అసార్ట్‌మెంట్లు, 10 ఇళ్ల స్థలాలు గుర్తించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment