సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నిర్బంధం
నాగార్జునసాగర్ :నాగార్జునప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్ ఎల్లారెడ్డిని ఎన్నెస్పీ ఉద్యోగులు ఆయన కార్యాలయంలో మంగళవారం నిర్బంధించారు. గతనెల వేతనాలందక ఉద్యోగులు వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే అన్ని కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయాలకు తాళాలు వేస్తూ సీఈ కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులను,అధికారులను బయటకు పంపి సీఈ చాంబర్‌కు వెళ్లారు అక్కడ సీఈ ఉండటంతో మాకువేతనాలు ఇప్పించేంత వరకు కార్యాలయంలోనే ఉండాలని సాయంత్రం వరకు కూర్చున్నారు. పీఏఓతో చెప్పి వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు మహిళా ఉద్యోగులు పీఏఓ రమణారావు వద్దకు వెళ్లి వేతనాల విషయంపై వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆయనపై చేయిచేసుకునే వరకు వెళ్లారు.
మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో..
పేఅండ్‌అకౌంట్ జేడీతో చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తే వేతనాలు ఇవ్వడానికి ఇబ్బందు లేమీ లేవన్నారు. ఫైళ్లు ప్రభుత్వం వద్దనే ఉన్నట్లుగా సీఈ తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శికి ఫోన్‌చేయగా సంబంధిత ఫైల్ చూడాల్సిన అధికారి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. చివరకు అడ్వాన్సు రూపేణా చెల్లిం చేందుకు గాను అధికారులతో మాట్లాడారు. మూడు రో జుల్లో వేతనాలు ఇప్పించడానికి కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. కార్యక్రమం లో ఉద్యోగ సం ఘాల నాయకులు పాల్గొన్నారు.