గజ్వేల్, న్యూస్‌లైన్:
మూడు జాతీయ, మరో మూడు రాష్ట్ర రహదారులను కలుపుతూ అంతర్ జిల్లా వ్యాపార, వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా ఉన్న భువనగిరి-గజ్వేల్-తూప్రాన్-సంగారెడ్డి లింక్ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి ఏడాది క్రితం జీఓ విడుదలైనా పనులు మొదలు కావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ రహదారిని అభివృద్ధి చేయడానికి సంకల్పించి ట్రాఫిక్ సర్వే పూర్తి చేశారు. అయితే మిగితా ప్రక్రియ ముం దుకు సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతూ రోడ్డు విస్తరణపై తాత్సారం చేస్తున్నారు. మరమ్మతు పనులు కూడా మొక్కుబడిగా సాగుతుండడంతో ప్రజాధనం వృధా అవుతుంది.
నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు 170 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లింక్ రోడ్డు 202, 44, 65వ జాతీయ రహదారులతోపాటు రాజీవ్ రహదారి, హైదరాబాద్-మెదక్, సంగారెడ్డి రూట్లలో మరో మూడు రాష్ట్ర రహదారులను కలుపుతుండటం వల్ల ఇది వ్యాపార, వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా మారింది. ఈ ప్రాంతం నుంచి నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్‌పల్లి మీదుగా చెన్నైకి నిత్యం వ్యాపార అవసరాల నిమిత్తం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాలు భారీగా తిరుగుతుండడం వల్ల ఈ రోడ్డు తరచూ పాడవుతుంది. వర్షాకాలం వస్తే చాలు పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ఎక్కడపడితే అక్కడ మోకాలు లోతు గుంతలు పడి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
రహదారి పనుల స్వరూపమిది...
నల్గొండ జిల్లా చిట్యాల నుంచి భువనగిరి-గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు 65వ నంబర్ జాతీయ రహదారిని తాకుతూ 170 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉంది. దీన్ని పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్), బీఓటీ(బిల్ట్ ఆపరేషన్ ట్రాన్స్‌ఫర్) విధానంలో నాలుగు లేన్లుగా మార్చాల్సి ఉంది. ఇందుదకుగాను కిలో మీటర్‌కు రూ.7 కోట్ల చొప్పున సుమారు రూ.1,190 కోట్ల అంచనాలతో నిర్మాణం పనులు జరనున్నట్లు సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ట్రాఫిక్ సర్వే పూర్తయినా...
విస్తరణ ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్ సర్వే పూర్తి చేశారు. దీని తర్వాత టెండర్ ప్రక్రియకు సంబంధించిన పని మొదలుపెట్టాల్సి ఉండగా ఈ వ్యవహారంపై చడీచప్పుడు లేదు. ప్రస్తుతం రహదారిపై ఏర్పడుతున్న గుంతల నివారణకు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఈ రహదారిపై ప్రజ్ఞాపూర్-నర్సాపూర్ వరకు ఒక బిట్టుగా విభజించి 50 కిలోమీటర్ల పొడవునా గత ఐదేళ్లుగా రూ.26 కోట్ల వ్యయంతో ఏటా తాత్కాలికంగా మరమ్మతు పనులు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. రహదారిపై మిగితా చోట్ల కూడా తాత్కాలిక మరమ్మతులే చేపట్టి వదిలేస్తున్నారు.
విస్తరణ ఎప్పుడో?
Published Mon, Sep 16 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement
Advertisement