విశాఖ–ఖరగ్‌పూర్‌ మధ్య హైవే | NHAI tenders for DPR: Visakhapatnam to Kharagpur highway in Andhra pradesh | Sakshi
Sakshi News home page

విశాఖ–ఖరగ్‌పూర్‌ మధ్య హైవే

Published Tue, Nov 26 2024 4:52 AM | Last Updated on Tue, Nov 26 2024 4:52 AM

 NHAI tenders for DPR: Visakhapatnam to Kharagpur highway in Andhra pradesh

783 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

డీపీఆర్‌ కోసం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు

ఏడాదిన్నరలో నిర్మాణం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. 

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రధాన అంశాలివీ
తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవా­ణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్‌ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. 
 విశాఖపట్నం– ఖరగ్‌పూర్‌ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.
నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.

వి­శాఖపట్నం, భావనపాడు, గోపాల్‌పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.
విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్‌ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్‌ నుంచి ఖరగ్‌పూర్‌ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్‌ చేపడతారు.

డీపీఆర్‌ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్‌ చివరి వారానికి ఎన్‌హెచ్‌ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. 
2025 జూన్‌ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.
 ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement