National Highways Development
-
విశాఖ–ఖరగ్‌పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్‌పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరిన్ని జాతీయ రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. రాష్ట్రంలో కొత్తగా 9 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. వీటికి ఏకంగా రూ.9,009 కోట్లు కేటాయించింది. మొత్తం 411 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించింది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులను ప్రతిపాదించింది. పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని పోర్టు ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో రెండుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై జాతీయ రహదారులపై ప్రతిపాదనలను సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదించింది. తొలి దశలో గత ఏడాది కేంద్ర మంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.15 వేల కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారులకు విజయవాడలో భూమి పూజ చేశారు. రెండో దశ కింద రాయలసీమలో జాతీయ రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు కొత్తగా 9 రహదారులతో పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 28న తిరుపతిలో భూమిపూజ చేయనున్నారు. ఇప్పటికే రూ.204 కోట్లతో 19 కిలోమీటర్ల మేర నిర్మించిన రెండు జాతీయ రహదారులను ఆయన ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన ఇలా... కేంద్ర మంత్రి గడ్కరీ ఈ నెల 27, 28 తేదీల్లో తిరుపతిలో పర్యటిస్తారు. ఆయన 27వ తేదీ రాత్రికి తిరుమల చేరుకుని తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. అనంతరం 28న తిరుపతిలో నిర్వహించే కార్యక్రమంలో, జాతీయ రహదారుల భూమిపూజలో పాల్గొంటారు. -
ఏపీలో రూ.5లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో రూ.3,000 కోట్లతో 129 కిలోమీటర్ల 3 రహదారులు, 5 ఫ్లై ఓవర్ల పనులకు గురువారం వర్చువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు. దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో రహదారులకు ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు మంజూరు చేశామని, లక్ష కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. నౌకాయానంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాష్ట్రమన్నారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, సముద్ర ఉత్పత్తులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గోదావరి జిల్లాల ఎంపీల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 27 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వీటిలో భాగంగా విశాఖపట్నం పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రోడ్డు నిరి్మంచనున్నట్లు చెప్పారు. రూ. 215 కోట్లతో మోరంపూడి, జొన్నాడ, కైకారం, ఉండ్రాజవరం, తేతలి ఫ్లై ఓవర్లకు అనుమతిచ్చామన్నారు. గుంటూరు – బాపట్ల, బెంగళూరు – విజయవాడ, వినుకొండ – గుంటూరు, వేమగిరి – సామర్లకోట కెనాల్ రోడ్డు, రాజమండ్రి – కాకినాడ, హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్, మాచర్ల, అమరావతి మీదుగా విజయవాడ ఇబ్రహీంపట్నం వరకు రోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు – విజయవాడ, బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే, రాయ్‌పూర్ – విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్ – ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకు 6 వరుసల హైవే నిరి్మంచనున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు మంజూరు చేస్తామన్నారు. వీటి ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్, విశాఖ నుంచి కాకినాడ సెజ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్, కాకినాడ యాంకరేజ్ పోర్టులకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ కనెక్టివిటీ వస్తుందని చెప్పారు. దీనివల్ల బియ్యం, సీ ఫుడ్, ఆయిల్, ఐరన్ ఎగుమతులు ఎక్కువ జరుగుతాయన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఖనిజం, జీవ ఇంధనం, గ్రానైట్ రవాణా సులభమవుతుందని అన్నారు. రహదారులు, ఫ్లై ఓవర్లకు శంకుస్థాపన చేస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే అని గడ్కరీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్, బయోఇథనాల్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వీటిని స్వయంగా తయారు చేసుకునే వనరులు రాష్ట్రంలో అపారంగా ఉన్నాయన్నారు. గోదావరి నీళ్ల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం పెద్ద కష్టం కాదన్నారు. జాతీయ రహదారుల వెంట కడియం నర్సరీల నుంచి 80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. శంకుస్థాపన అనంతరం గడ్కరీ కడియంలో నర్సరీలను పరిశీలించారు. మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ రామ్, వంగా గీత, అనూరాధ, మాధవి, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
22 రోడ్ల విస్తరణకు రూ.540 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. కేంద్ర రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి నిధి (సీఆర్ఐఎఫ్) నుంచి రాష్ట్రంలో 22 రహదారులను విస్తరించి.. కొత్త రోడ్లు నిర్మించే ప్రణాళికను ఆమోదించారు. ఇందులో భాగంగా మొత్తం 319 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిలో జిల్లా ప్రధాన రహదారులు 13, రాష్ట్ర హైవేలు 7, ఇతర రహదారులు 2 ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, జాతీయ రహదారిని అనుసంధానించే ప్రధాన రహదారులను సీఆర్ఐఎఫ్ నిధులతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 9 రహదారులు, మలి దశలో 13 రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపింది. కాగా, ఈ ప్రణాళికపై సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ఒకే దశ కింద మొత్తం 22 రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఏకంగా రూ.540 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను ఆర్ అండ్ బీ శాఖ చేపడుతుంది. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిలో ఈ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
రహదారికి రాచబాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో దఫా భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయవంతమైంది. గత సర్కారు హయాంలో కేంద్రంలో భాగస్వామిగా కొనసాగి కూడా చంద్రబాబు జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.10,660 కోట్లను మాత్రమే తీసుకురాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019–23 ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ.25,490 కోట్లను సాధించడం విశేషం. 2022–23 వార్షిక ప్రణాళికలో ఏపీకి రూ.12,123 కోట్లు కేటాయిస్తూ జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతాలు, ఆర్థిక జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఇంత భారీగా ఇదే తొలిసారి.. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో కార్యాచరణ చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలు దఫాలు చర్చించారు. ఆర్థికాభివృద్ధికి రహదారుల అభివృద్ధే కీలకమని ఏకాభిప్రాయానికి రావడం రాష్ట్రానికి సానుకూలంగా మా రింది. 2019–20 వార్షిక ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం తొలుత రాష్ట్రానికి రూ.600 కోట్లే కేటా యించడంతో తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే రాష్ట్రానికి నిధుల కేటాయింపును రూ.2,700 కోట్లకు పెం చింది. ఇక 2020–21 వార్షిక ప్రణాళికలో రూ.2,798 కోట్లు కేటాయించగా 2021–22లో ఏకంగా రూ.7,869 కోట్లు కేటాయించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తాజాగా 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,123 కోట్లు కేటాయించడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. టీడీపీ హయాంలో అత్యల్పం.. టీడీపీ సర్కారు హయాంలో 2014–19 మధ్య జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్రానికి అతి తక్కువగా నిధులు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో రాబట్టింది కేవలం రూ.10,660 కోట్లే కావడం గమనార్హం. అందులో 2015–16లో అత్యధికంగా రూ.2,698 కోట్లు రాగా 2018–19లో కేవలం రూ.267 కోట్లనే సాధించగలిగారు. అభివృద్ధి చేయనున్న 41 ప్రాజెక్టులు ► కొత్తగా నిర్మించే రహదారులు: 14 ► నాలుగు లేన్లుగా విస్తరించే రహదారులు: 7 ► బైపాస్ రహదారుల అభివృద్ధి : 6 ► ఆర్వోబీల నిర్మాణం: 6 ► 12 మీటర్ల వెడల్పుతో: 3 ► వన్‌టైమ్ ఇంప్రూవ్మెంట్ కింద : 3 ► నేషనల్ హైవేను అనుసంధానించే రహదారి: 1 ► వంతెనల నిర్మాణం: 1 సీఎం స్పష్టమైన ప్రతిపాదనలతో.. ‘జాతీయ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రతిపాదనలతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరపడంతోనే ఇది సాధ్యమైంది. 2022 – 23 వార్షిక ప్రణాళికలో కేటాయించిన రూ.12,123 కోట్లతో రహదారుల అభివృద్ధికి డీపీఆర్ రూపొందించడం, భూసేకరణ ప్రక్రియకు సన్నద్ధమవుతున్నాం’ – ఎం.టి.కృష్ణబాబు, ఆర్ అండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి -
రాష్ట్రంలో ఎన్‌హెచ్‌లకు నిధుల వరద
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల వరద పారుతోంది. దేశంలో అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్‌కే మరోసారి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక సత్ఫలితాలనిచ్చింది. ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన పలు దఫాలుగా జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. 2022–23 వార్షిక ప్రణాళిక కింద కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రాష్ట్రానికి రూ. 12 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు కొత్తగా జాతీయ రహదారుల అభివృద్ధికి ఆర్అండ్బీ శాఖ సమాయత్తమవుతోంది. చరిత్రలో అత్యధికంగా... రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రాష్ట్రానికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా ఏడాదికి రూ. 2,400 కోట్లే మంజూరు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019–20లో రూ. 2,700 కోట్లు కేటాయించిన కేంద్రం ఏటా పెంచుకుంటూపోతోంది. 2020–21 వార్షిక ప్రణాళిక కింద రాష్ట్రానికి అత్యధికంగా రూ. 7,869 కోట్లు కేటాయించిన విషయం విదితమే. ఆ నిధులతో రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికను ఆమోదించింది. కాగా ఆ రికార్డును అధిగమిస్తూ 2022–23 వార్షిక ప్రణాళిక కింద నిధుల మంజూరుకు సమ్మతించింది. ఈమేరకు ఆర్అండ్బీ శాఖ ఇటీవల సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆ నిధులతో అభివృద్ధి చేసే రహదారుల ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. 2022–23 వార్షిక ప్రణాళిక నిధులతో రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించి కేంద్రానికి పంపుతామని ఆర్అండ్బీ శాఖ చీఫ్ ఇంజినీర్ (జాతీయ రహదారుల విభాగం) వి.రామచంద్ర ‘సాక్షి’కి తెలిపారు. -
రూ.10 వేల కోట్లతో హైవేల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. మరో 1,586 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. రాబోయే మూడేళ్లలో దశలవారీగా మొత్తం రూ.10 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈమేరకు ప్రతిపాదనలను జాతీయ రహదారులశాఖ ఖరారు చేసింది. గత వార్షిక ప్రణాళికలో మిగులు పనులతోపాటు రాష్ట్రంలో పోర్టులు, ప్రధాన పారిశ్రామిక పట్టణాలను అనుసంధానించే రహదారులను 12 మీటర్ల వెడల్పుతో (టూ లేన్స్ విత్ పావ్డ్ సోల్టర్స్)గా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. సూత్రప్రాయంగా ఆమోదించిన ఈ ప్రణాళికలకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఖరారు చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి మూడేళ్లలో పనులు పూర్తిచేయనున్నారు. అభివృద్ధి చేయనున్న కొన్ని ప్రధాన రోడ్లు కల్వకుర్తి–నంద్యాల 250 కిలోమీటర్లు, నంద్యాల–జమ్మలమడుగు 82 కి.మీ., డోన్–సోమయాజులపల్లి 78 కి.మీ., గోరంట్ల–హిందూపురం 50 కి.మీ., పెడన–హనుమాన్‌జంక్షన్ 51 కి.మీ., అమలాపురం–బొబ్బర్లంక 55 కి.మీ., ఆకివీడు–దిగుమర్రు 45 కి.మీ., నరసాపురం రింగ్‌రోడ్డు 40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేయనున్నారు. ఇవేగాక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానించే పలు రోడ్లను 12 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్నారు. -
రహదారుల అభివృద్ధిలో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా–మండల కేంద్రాలను అనుసంధానించే రహదారులను వేగంగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణకు అవసరమైన అన్ని చర్యలకు చొరవ చూపిస్తున్నామని చెప్పారు. భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. రహదారుల నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర రహదారులు, జిల్లా కేంద్రాలు–మండల కేంద్రాలను అనుసంధానించే రహదారుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,400 కోట్లతో పనులు చేపట్టిందని తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ రాష్ట్రంలో 1,380 కిలోమీటర్ల మేర చేపట్టిన 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులలో 20 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 31 ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిమోట్ కంట్రోల్ ద్వారా సంయుక్తంగా ప్రారంభోత్సవం, భూమిపూజ చేశారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అనంతపురంలలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఐఐసీ పరస్పరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. లాజిస్టిక్ పార్క్‌ల ఏర్పాటు కోసం చేసుకున్న ఒప్పంద పత్రాలతో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి శంకరనారాయణ తదితరులు జాతీయ రహదారుల అభివృద్ధిలో ముందడుగు ► కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దార్శనికతతో దేశంలో సాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కూడా చోటు దక్కించుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్స్ కార్యక్రమం నితిన్ గడ్కరీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా చేరింది. ► 2014 నాటికి దేశంలో రోజుకు 12 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించగా, గడ్కరీ హయాంలో ప్రస్తుతం రోజుకు 37 కిలోమీటర్ల మేర నిర్మించే స్థాయికి చేరుకుంది. ► ఆంధ్రప్రదేశ్‌లో 4,193 కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ రహదారులు 95 శాతం పెరుగుదలతో ప్రస్తుతం 8,163 కిలోమీటర్లకు చేరాయి. ప్రస్తుతం 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ముందడుగు పడుతోంది. అందులో రూ.10,400 కోట్లతో నిర్మించనున్న 741 కిలోమీటర్ల పొడవైన 31 రహదారులకు శంకుస్థాపన చేస్తున్నాం. ► ఇప్పటికే రూ.11,159 కోట్లతో నిర్మించిన మరో 20 రహదారులను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లై ఓవర్ నిర్మించాలని 2019 ఆగస్టులో నేను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వయంగా విజ్ఞప్తి చేశాను. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ఫ్లై ఓవర్ మంజూరు చేశారు. ► 2020లోనే ఫ్లై ఓవర్ మంజూరు చేసి, వేగంగా నిర్మించి ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. మేము అధికారంలోకి వచ్చే నాటికి విజయవాడలో బెంజ్ సర్కిల్ తూర్పు ఫ్లై ఓవర్, కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాలేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో వాయు వేగంతో పూర్తి చేయగలిగాం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టవిటీ ► రాష్ట్రంలో జాతీయ రహదారులు కాకుండా మిగిలిన రహదారుల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం రూ.10,600 కోట్లు కేటాయించాం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు రెండు లేన్ల రోడ్లు వేస్తున్నాం. అందుకు రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసమే మరో రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ప్రతి రోడ్డు పూర్తి చేసేందుకు మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తూ.. ఇతరత్రా మొత్తం కలిపి రూ.10,600 కోట్లతో రహదారి పనులకు శ్రీకారం చుట్టాం. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ► రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికీ ఎటువంటి సంకోచం, రాజకీయాలు లేకుండా ప్రజల ముందు మా సంతోషం, కృతజ్ఞతలూ తెలుపుతున్నాం. కేంద్రానికి మరికొన్ని ప్రతిపాదనలు ► మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని విజ్ఞప్తి చేస్తూ ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాను. ► విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మించాలి. ప్రకృతి అందాలతో కూడిన రుషికొండ, భీమిలి కొండలు, సముద్ర తీరాన్ని తాకుతూ పర్యాటక రంగానికే వన్నె తెచ్చే విధంగా.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవే 60ని కలుçపుతూ 6 లేన్ల రహదారి నిర్మాణం చాలా అవసరం. ► విజయవాడ తూర్పు బైపాస్.. కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అవసరం. విజయవాడలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఈ బైపాస్ నిర్మాణం చాలా అవసరం. మీరు వెస్ట్రన్ బైపాస్ మంజూరు చేశారు. ఈస్ట్రన్ బైపాస్ కూడా మంజూరు చేయాలని కోరుతున్నా. జాతీయ రహదారులు నగరం మీదుగా వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ ఈ రెండు బైపాస్‌ల నిర్మాణమే పరిష్కారం. వీటిని జాతీయ రహదారులుగా ప్రకటించాలి ► వైఎస్సార్ జిల్లా భాకరాపేట – బద్వేలు ► వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల – ప్రకాశం జిల్లా బెస్తవారిపేట ► చిత్తూరు జిల్లా పుంగనూరు – పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు ► విశాఖపట్నం జిల్లా సబ్బవరం – చోడవరం ► విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం – తుని ► విశాఖపట్నం – నర్సీపట్నం – చింతపల్లి – చింతూరు – భద్రాచలం ► ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖకు పంపించాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాటన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. ► జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర రహదారులపై ఆర్వోబీల నిర్మాణాల కోసం ఇటీవల కేంద్రం అడిగిన 20 ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం. మంచి చేస్తున్న మంచి వారికి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మన రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తున్న తెలుగు వారైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ దిశగా మరింత చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నా. -
కొత్త చరిత్రకు 'దారులు'
ఆంధ్రప్రదేశ్ రహదారుల చరిత్రలో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒకే రోజు జరిగాయి. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమాలలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని గడ్కరీ ప్రకటించడమే కాదు దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మూంజూరు చేశామని వెల్లడించారు. ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని, గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా అడుగులు వేస్తున్న రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి వచ్చి బెంజి సర్కిల్ రెండో ఫై్లఓవర్ను ప్రారంభించారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. తన గౌరవార్థం సీఎం ఇచ్చిన విందును స్వీకరించారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి విషయాల గురించి అక్కడ ఆయన రివ్యూ నిర్వహించారు. సీఎం జగన్ ప్రతిపాదనలన్నిటినీ ఆమోదిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో పోర్టులు, రోడ్లు, రైలు కనెక్టివిటీ అభివృద్ధి పరచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏకకాలంలో నిర్వహించడం ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఇందులో భాగంగా విద్యుత్, నీరు, రవాణా, కమ్యూనికేషన్ రంగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. తాను మహారాష్ట్ర మంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సూచనల మేరకు రూపొందించిన ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన’ పథకంతో దేశంలో రూ.1.10 లక్షల కోట్ల జీడీపీ పెరిగిందని చెప్పారు. దేశ అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన ఎంతటి కీలకమనడానికి ఈ పథకమే తార్కాణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పోర్టుల ఆధారంగా ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని సూచించారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంపొందించడం ద్వారానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయడంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రం పట్లా వివక్ష లేదన్నారు. దేశం అంటే అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖకు ఏనాడూ నిధుల కొరత లేదన్నారు. గడ్కరీ ఇంకా ఏమన్నారంటే.. ఏపీకి ఆరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు ► దేశంలో నిర్మిస్తోన్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఆరు ఉన్నాయి. విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సరుకు రవాణాలో అత్యంత ముఖ్యమైనది. ఛత్తీస్గడ్, ఒడిశా, ఏపీలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 465 కి.మీ మేర రూ.16,102 కోట్లతో నిర్మిస్తున్నాం. 2024 చివరి నాటికి పూర్తి చేస్తాం. ► నాగ్‌పూర్ నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో ఉంది. నా నియోజకవర్గం నాగ్‌పూర్ నుంచి మొదలవుతోంది కాబట్టి ఈ రహదారిపై నాకు ప్రత్యేక ఆసక్తి ఉంది. రూ.15 వేల కోట్లతో 405 కి.మీ మేర నిర్మిస్తున్న ఈ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం. ► చిత్తూరు నుంచి తమిళనాడులోని తాచ్చూర్ వరకు 116 కి.మీ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టును 2024లో పూర్తి చేస్తాం. ► రూ.6 వేల కోట్లతో నిర్మిస్తున్న హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం. ► బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 262 కి.మీ మేర రూ.17 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీ పరిధిలో రూ.5 వేల కోట్ల మేరకు రహదారి నిర్మిస్తాం. తద్వారా ఏపీకి తమిళనాడు, కర్ణాటకలతో మరింత మెరుగైన అనుసంధానం సాధ్యమవుతుంది. ► కర్నూలు–సోలాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 318 కిలోమీటర్ల మేర రూ.420 కోట్లతో నిర్మిస్తాం. 2025 మార్చి నాటికి పూర్తి అవుతుంది. సరుకు రవాణా వ్యయం తగ్గించాలి ► దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని బాగా తగ్గించాలి. వస్తువు ధరలో సరుకు రవాణా వ్యయం చైనాలో 8 శాతం నుంచి 10 శాతం, అమెరికా, యూరోపియన్ దేశాల్లో 12 శాతం ఉండగా, మన దేశంలో 16 శాతం నుంచి 18 శాతం వరకు ఉంది. ► దాంతో మన దేశంలో వస్తువుల ధరలు అధికంగా ఉంటుండటంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అందుకే దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని 8 శాతానికి తగ్గించాలని మా మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఆరు శాతానికి కూడా తగ్గించేందుకు యత్నిస్తాం. ► దేశంలో యాక్సిస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ హైవేలతో ఇంధన వ్యయం తగ్గుతుంది. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం పూర్తి అయితే రహదారులపై వాహనాల వేగ పరిమితి పెంచుతాం. బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి ► దేశంలో బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. డీజిల్ ట్రక్కుల స్థానంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు ప్రారంభించాలని నిర్ణయించాం. డీజిల్ స్థానంలో ఎల్ఎన్జీని ప్రోత్సహించాలి. డీజిల్ రూ.100 వ్యయం అయితే ఎల్ఎన్జీ రూ.40కు, సీఎన్జీ రూ.60కు వస్తోంది. ► గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై కసరత్తు చేస్తున్నాం. మురుగు నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించాలి. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మురుగు నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి విక్రయం ద్వారా ఏటా రూ.325 కోట్లు ఆదాయం ఆర్జిస్తోంది. ► రూఫ్‌టాప్ సోలార్, విండ్ మిల్లులతో విద్యుత్ వ్యయం చాలా తగ్గుతుంది. ఎలక్ట్రోలైజర్లను గ్రీన్ హైడ్రోజన్‌గా పరిగణించవచ్చు. బియ్యం, చెరకు రసం, మోలాసిస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగాన్ని ఇంధన, విద్యుత్ రంగాల దిశగా మళ్లించాలి. పెట్రోల్, డీజిల్ రెండింటితోనూ పనిచేసే ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలను ప్రోత్సహించాలి. గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా ఏపీ ► దేశానికి ఉపయోగపడేలా తక్కువ వ్యయం, కాలుష్య రహిత దేశీయ ఇంధనంగా ఇథనాల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. మిగులు బియ్యం నిల్వలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అందుకు గ్రోత్ సెంటర్‌గా మారాలి. బయో ఇంధనం, గ్రీన్ ఇంధనం దేశానికి తక్షణ అవసరం. ► ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. రోప్‌వే, కేబుల్ వే వంటివి హిమాచల్‌ప్రదేశ్‌లో 16 ప్రాజెక్టులు, ఉత్తరాఖండ్‌లో 15 ప్రాజెక్టులు ఇచ్చాం. ఆంధ్ర ప్రదేశ్‌లో ఏమైనా ఈ తరహా ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే ఆమోదిస్తాం. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్–2 ప్రారంభం సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి గురువారం జాతికి అంకితం చేశారు. సాయంత్రం 3.40 గంటలకు వారు బెంజ్‌సర్కిల్ రెండో ఫ్లైఓవర్ వద్దకు వచ్చారు. ఈ ఫ్లైఓవర్‌పై శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. కాగా, బెంజ్ సర్కిల్‌కు తూర్పు వైపున ఇదివరకే మొదటి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇప్పుడు పడమర వైపున రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఈ వంతెనను జ్యోతిమహల్ జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2.47 కిలోమీటర్ల మేర మూడు వరసల్లో ఏడాదిలోనే (గడువుకు ఆరు నెలల ముందే) నిర్మించారు. ఇందుకోసం రూ.96 కోట్లు వెచ్చించారు. గడువుకు ముందే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, నిర్మాణ సంస్థను కేంద్ర మంత్రి గడ్కరీ అభినందించారు. దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శంకరనారాయణలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రులు మహా గణపతి ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామని చెప్పారు. కొన్ని పనులకు ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చిందని, ఆయా పనులకు అంచనాలు తయారు చేస్తున్నారన్నారు. మరికొన్ని పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లన్నింటికీ రోడ్లను అనుసంధానం చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. విశాఖపట్నంకు కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. ముంబైలో నిర్మిస్తున్న కోస్టల్ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాక, వైజాగ్ కారిడార్‌కు ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. అంతకు ముందు వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కేశినేని నాని, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో దుర్గగుడి ఘాట్‌రోడ్డు పై నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రులు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రులు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దేశ వ్యాప్తంగా కేంద్రం చేపడుతున్న పలు అభివృద్ధి అంశాలను పార్టీ శ్రేణులకు వివరించారు. పలువురు పార్టీ కార్యకర్తలు గడ్కరీకి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రహదారుల అభివృద్ధికి రూ.6,421 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మార్గం సుగమమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి రూ.6,421 కోట్లు కేటాయించింది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్రంలో 609 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులు కూడా సమకూర్చనుంది. రాష్ట్రాల్లో జాతీయ రహదారులను రెండు విధాలుగా అభివృద్ధి చేస్తారు. కొన్ని హైవేల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నేరుగా చేపడుతుంది. మరికొన్ని పనులను ఆర్ అండ్ బీ జాతీయ రహదారుల విభాగం కేంద్ర నిధులతో చేపడుతుంది. కాగా, ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం అరకొర నిధులే కేటాయిస్తూ వస్తోంది. దాంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలు కార్యరూపం దాల్చడం లేదు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ ఈ అంశంపై దృష్టి సారించారు. వాస్తవానికి 2019–20లో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేవలం రూ.269 కోట్లే కేటాయించింది. కానీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆ కేటాయింపులను రూ.269 కోట్ల నుంచి ఏకంగా రూ.1,830 కోట్లకు పెంచింది. అంతకంటే ఎక్కువగా 2020–21లో రాష్ట్రానికి రూ.2,702 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.6,421 కోట్లు కేటాయించడం విశేషం. కేంద్రం ప్రకటించిన వార్షిక నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన ప్రణాళిక మేరకు త్వరలో పనులు చేపడతామని ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ‘సాక్షి’కి తెలిపారు. -
ఏపీలో ఎన్‌హెచ్ అభివృద్ధి నిధుల పెంపు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) అభివృద్ధి కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పెంచుతూ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వార్షిక ప్రణాళిక కేటాయింపు కింద ఇస్తున్న రూ.1,408 కోట్ల నుంచి రూ.2,707.92 కోట్లకు పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏపీలో ఎన్‌హెచ్‌ల అభివృద్ధి పరుగులు తీయనుంది. రాష్ట్ర రోడ్డులుగా ఉన్న పలు రోడ్లను హైవేలుగా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే 3 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నెంబర్లను కేటాయించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్‌హెచ్–67 జంక్షన్ వద్ద నాగర్ కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు (ఎన్‌హెచ్–40 సమీపంలో) ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్‌హెచ్–167కే’ గుర్తించింది. అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ (ఎన్‌హెచ్–42) వయా పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కి.మీ. రాష్ట్ర రహదారికి ఎన్‌హెచ్–342 కేటాయించారు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోనూ రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130.50 కి.మీ. రోడ్డును తాజాగా ఎన్‌హెచ్‌గా గుర్తించారు. దీనికి ఎన్‌హెచ్–440 నంబరు కేటాయించారు. గతం కంటే ఎక్కువగా నిధులు మంజూరు రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈ ఏడాది కేంద్ర రోడ్డు నిధి కింద కేటాయింపులు పెరిగాయి. ఈ ఆర్ధిక ఏడాదిలో 616.36 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు 43 పనులకు గాను రూ.880.70 కోట్ల్లను కేటాయించారు. మరో 289.94 కి.మీ. రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాదిలోనే రూ.441.90 కోట్లతో అదనపు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 2017–18లో 50.52 కి.మీ. రోడ్ల అభివృద్ధికి రూ.72.90 కోట్లే కేటాయించగా ఇప్పుడు రూ.880.70 కోట్లను కేటాయించడం గమనార్హం. -
రహదారుల నిర్మాణ సమస్యలు తెలపండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: రహదారుల నిర్మాణంలో భూసేకరణ, అటవీ సంబంధిత సమస్యలు, పైపులు, విద్యుత్ తీగల తొలగింపు వంటి సమస్యలను తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణం గా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించిన 2,132 కిలో మీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి పథకం కింద ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులను కాంట్రాక్టర్ల తో, ఇంజనీర్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.