సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో దఫా భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవంతమైంది. గత సర్కారు హయాంలో కేంద్రంలో భాగస్వామిగా కొనసాగి కూడా చంద్రబాబు జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.10,660 కోట్లను మాత్రమే తీసుకురాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019–23 ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ.25,490 కోట్లను సాధించడం విశేషం. 2022–23 వార్షిక ప్రణాళికలో ఏపీకి రూ.12,123 కోట్లు కేటాయిస్తూ జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతాలు, ఆర్థిక జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
ఇంత భారీగా ఇదే తొలిసారి..
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో కార్యాచరణ చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలు దఫాలు చర్చించారు. ఆర్థికాభివృద్ధికి రహదారుల అభివృద్ధే కీలకమని ఏకాభిప్రాయానికి రావడం రాష్ట్రానికి సానుకూలంగా మా రింది. 2019–20 వార్షిక ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం తొలుత రాష్ట్రానికి రూ.600 కోట్లే కేటా యించడంతో తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు.
ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే రాష్ట్రానికి నిధుల కేటాయింపును రూ.2,700 కోట్లకు పెం చింది. ఇక 2020–21 వార్షిక ప్రణాళికలో రూ.2,798 కోట్లు కేటాయించగా 2021–22లో ఏకంగా రూ.7,869 కోట్లు కేటాయించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తాజాగా 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,123 కోట్లు కేటాయించడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.
టీడీపీ హయాంలో అత్యల్పం..
టీడీపీ సర్కారు హయాంలో 2014–19 మధ్య జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్రానికి అతి తక్కువగా నిధులు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో రాబట్టింది కేవలం రూ.10,660 కోట్లే కావడం గమనార్హం. అందులో 2015–16లో అత్యధికంగా రూ.2,698 కోట్లు రాగా 2018–19లో కేవలం రూ.267 కోట్లనే సాధించగలిగారు.
అభివృద్ధి చేయనున్న 41 ప్రాజెక్టులు
► కొత్తగా నిర్మించే రహదారులు: 14
► నాలుగు లేన్లుగా విస్తరించే రహదారులు: 7
► బైపాస్ రహదారుల అభివృద్ధి : 6
► ఆర్వోబీల నిర్మాణం: 6
► 12 మీటర్ల వెడల్పుతో: 3
► వన్‌టైమ్ ఇంప్రూవ్‌మెంట్ కింద : 3
► నేషనల్ హైవేను అనుసంధానించే రహదారి: 1
► వంతెనల నిర్మాణం: 1
సీఎం స్పష్టమైన ప్రతిపాదనలతో..
‘జాతీయ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రతిపాదనలతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరపడంతోనే ఇది సాధ్యమైంది. 2022 – 23 వార్షిక ప్రణాళికలో కేటాయించిన రూ.12,123 కోట్లతో రహదారుల అభివృద్ధికి డీపీఆర్ రూపొందించడం, భూసేకరణ ప్రక్రియకు సన్నద్ధమవుతున్నాం’
– ఎం.టి.కృష్ణబాబు, ఆర్ అండ్‌బి శాఖ ముఖ్య కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment