రహదారుల నిర్మాణ సమస్యలు తెలపండి | Minister Tummala orders to officers | Sakshi
Sakshi News home page

రహదారుల నిర్మాణ సమస్యలు తెలపండి

Published Sat, Jan 21 2017 4:17 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

రహదారుల నిర్మాణ సమస్యలు తెలపండి - Sakshi

రహదారుల నిర్మాణ సమస్యలు తెలపండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రహదారుల నిర్మాణంలో భూసేకరణ, అటవీ సంబంధిత సమస్యలు, పైపులు, విద్యుత్‌ తీగల తొలగింపు వంటి సమస్యలను తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణం గా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై శుక్రవారం ఆయన సమీక్షించారు.

కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించిన 2,132 కిలో మీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి పథకం కింద ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులను కాంట్రాక్టర్ల తో, ఇంజనీర్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement