
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలోనే బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల హడావిడి ప్రారంభమైందని.. అన్ని జిల్లాలో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు.
నాటి దివంగత సీఎం వైఎస్సార్ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేశారో యాత్రలో వివరిస్తామన్నారు. అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కార్యాచరణను ప్రకటిస్తా మని చెప్పారు. మార్చి 13న పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కో–ఆర్డి నేటర్లతో బస్సు యాత్ర సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో రూట్ మ్యాపు ఖరా రుతో పాటు బస్సు యాత్ర కమిటీలను కూడా ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం..
ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బస్సు యాత్రలో ఎండగడతామని గట్టు చెప్పారు. కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. 31 జిల్లాల్లో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేరోజు పాదయాత్రలను నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, జి.మహేందర్‌రెడ్డి, బి.అనిల్ కుమా ర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, నాయకులు నాగదేశి రవికుమార్, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, వరం గల్, మెదక్ జిల్లాల ఇన్‌చార్జులు వి.శేఖర్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment