పవిత్ర జెరూసలెం యాత్రకు వెళ్లే జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలు ఆర్థిక సహాయం
జెరూసలెం యాత్రకు ఆర్థిక సహాయం
Jul 22 2016 12:38 AM | Updated on Sep 4 2017 5:41 AM
శ్రీకాకుళం: పవిత్ర జెరూసలెం యాత్రకు వెళ్లే జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలు ఆర్థిక సహాయం కోసం ఏపీ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వాహక సంచాలకులు కె.నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్ర మొత్తానికి రూ.89వేలు ఖర్చు అవుతుందని అంచనా కాగా, ప్రభుత్వం తరఫున రూ.20వేలు అందజేస్తామని చెప్పారు. దరఖాస్తులకు అన్ని పత్రాలు జతచేసి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి పంపించాలన్నారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1068, 040–23392243, 040–2391068, శ్రీ రాఘవేంద్ర 73962 84529, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 9849901160/08922–230250 లను సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement