న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసం వద్ద క్రైస్తవులు గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో చర్చిలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సుమారు 200 మంది ఆందోళనకు దిగారు. 'వుయ్ వాంట్ జస్టిస్, స్టాప్ ఎటాకింగ్ యుజ్' అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడులపై ప్రభుత్వం సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు వీరంతా ర్యాలీగా బయల్దేరి రాజ్నాథ్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాటో చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో వారిని అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఢిల్లీ నగరంలో గత నవంబర్ నుంచి చర్చిలపై అయిదుసార్లు దాడులు జరిగాయి.
రాజ్నాథ్ నివాసం వద్ద క్రైస్తవుల ఆందోళన
Published Thu, Feb 5 2015 12:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement