క్త్రెస్తవుల ఆస్తులను పరిరక్షించండి
కర్నూలు (టౌన్) : నగరంలో క్రైస్తవుల ఆస్తులను పరిరక్షించాలని క్త్రెస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం స్థానిక కోల్స్ చర్చి నుంచి కోట్ల సర్కిల్ వరకు క్త్రెస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు హవిలన్ బాబు, కోల్స్ చర్చి సంఘం అధ్యక్షులు అనిల్‌నాథ్, పాస్టర్లు పాస్కల్ ప్రకాష్, డేవిడ్‌పాల్, కోల్స్ కళశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి మాట్లాడారు. రాజకీయ నేతల అండతో నగరంలో రూ.కోట్లు విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. గత వారం కోల్స్ కళశాల క్రీడా మైదానంలో రూ. కోటి విలువ చేసే 30 సెంట్ల స్థలం అమ్మేశారని చెప్పారు. స్థల యాజమానులతో కాకుండా థర్డ్ పార్టీ (మూడవ వ్యక్తి ) ద్వారా రూ. కోట్ల స్థలాన్ని ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. కోల్స్ స్థల రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా పక్కనే పరీక్షలు జరుగుతుండడంతో రాస్తారోకో చేయొద్దని రెండవ పట్టణ సీఐ చెప్పడంతో వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో అబ్రహాం లింకన్, కోల్స్ చర్చి కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.