
శివాజీనగర: అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు పెద్దమొత్తంలో విరాళాలను అందజేశారు. బెంగళూరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీ.ఎన్.అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్‌ఆర్‌ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా అందరితో కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే బీజేపీ లక్ష్యమని అశ్వత్ధ నారాయణ తెలిపారు. సుమారు రూ.కోటి వరకూ విరాళాలను అందజేసినట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment