Ram Mandirs construction
-
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు ‘మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’గా నామకరణం చేసే వీలుంది. సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా 10 లక్షల మంది విమానప్రయాణికుల రాకపోకలకు అనువుగా రూ.1,450 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్పోర్ట్, పూర్తయిన అయోధ్య ధామ్ జంక్షన్ తొలి దఫా, అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, పౌర వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. కొత్తగా రెండు అమృత్ భారత్, ఆరు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. సువిశాలంగా కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, బక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు. అధునాతన సదుపాయాలతోపాటు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వాననీటి సంరక్షణ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సౌరవిద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు. -
శ్రీరాముడే స్ఫూర్తి: మోదీ
అయోధ్య: ప్రభుత్వ నినాదం ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’కు శ్రీరాముడి పాలన, ఆయన అందించిన విలువలే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలు వెలిగించిన 15.76 లక్షల దీపాలతో సరయూ తీరం వెలుగులతో కనువిందు చేసింది. ఈ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను, మ్యూజిక్ షోను మోదీ తిలకించారు. భవ్య రామమందిర నిర్మాణానికి ఆయన 2020 ఆగస్టు 5న భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అయోధ్యకు రావడం ఇదే తొలిసారి. తొలుత రామజన్మభూమి స్థలంలోని తాత్కాలిక ఆలయంలో రామ్‌లల్లాను మోదీ దర్శించుకున్నారు. దీపం వెలిగించారు. ప్రత్యేక పూజలు చేశారు. హారతి అందుకున్నారు. అనంతరం రామ మందిర నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రామకథా పార్కులో శ్రీరాముడు, సీతల ప్రతీకాత్మక పట్టాభిషేక కార్యక్రమంలో మోదీ పాలుపంచుకున్నారు. పుష్పక విమానం(హెలికాప్టర్) నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రధారులు దిగడం అందరినీ అకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. రాముడి ఆశయాలు, విలువలు రాబోయే 25 ఏళ్లలో మన లక్ష్యాల సాధనకు దిక్సూచి అని చెప్పారు. మన రాజ్యాంగ ఒరిజినల్ కాపీపై రాముడు, లక్ష్మణుడు, సీతామాత చిత్రాలు ఉన్నాయని గుర్తుచేశారు. మన రాజ్యాంగ హక్కులకు అది మరో గ్యారంటీ అని అభివర్ణించారు. -
రాముడు లేనిదే అయోధ్య లేదు
లక్నో/అయోధ్య: రాముడు లేనిదే అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రాంతం రామ్ లల్లాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య తాత్కాలిక మందిరం దగ్గర పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటిన కోవింద్ అక్కడ పురోహితులతో కాసేపు మాట్లాడారు. 2019లో సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వీలుగా చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన తర్వాత కోవింద్ అయోధ్యకు రావడం ఇదే మొదటిసారి. యూపీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజు కోవింద్ లక్నో నుంచి అయోధ్యకి రైలులో వచ్చారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రామాయణ ఘట్టాలతో కూడిన పోస్టల్ కవర్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడు లేని అయోధ్య అయోధ్యే కాదన్నారు. ‘‘రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంటుంది. ఈ నగరంలోని రాముడు శాశ్వతంగా ఉంటాడు’’అని కోవింద్ వ్యాఖ్యానించారు. రాముడు ఎప్పుడూ గిరిజనులపై వల్లమాలిన ప్రేమాభిమానాలు కురిపించారని రాష్ట్రపతి అన్నారు. -
రామమందిరానికి క్రైస్తవుల భారీ విరాళం
శివాజీనగర: అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు పెద్దమొత్తంలో విరాళాలను అందజేశారు. బెంగళూరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీ.ఎన్.అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్ఆర్ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా అందరితో కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే బీజేపీ లక్ష్యమని అశ్వత్ధ నారాయణ తెలిపారు. సుమారు రూ.కోటి వరకూ విరాళాలను అందజేసినట్లు ఆయన చెప్పారు. -
1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో ఆ రోజు అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మన్మోహన్ సింగ్ లిబర్హాన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది. 1992 డిసెంబర్ 5 నుంచే అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యూపీలో నాటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. 35 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మీడ్ కాన్‌స్టబ్యులరీ (పీఏసీ), 195 కంపెనీల పారామిలటరీ బలగాలు, నాలుగు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 15 బాష్ప వాయు స్క్వాడ్స్, 15 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించారు. ఉదయం 10:30 గంటలకి అడ్వాణీ, జోషి వంటి బీజేపీ అగ్రనాయకులు కరసేవ ప్రారంభం చూడడం కోసం వచ్చారు. ఒక 20 నిమిషాల సేపు అక్కడే గడిపిన వారు రామ్‌కథ కుంజ్‌లో మతాధికారులు ఇచ్చే ప్రసంగాలు వినడానికి వెళ్లారు. పలుగు పారలతో మసీదుపై దాడి మసీదు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక టీనేజీ యువకుడు 12 గంటల సమయంలో మసీదు గుమ్మటంపైకి నెమ్మదిగా ఎక్కాడు. అతని వెంట మరో 150 మంది వరకు పైకి ఎక్కి గునపాలు, ఇనుప రాడ్లు, పలుగులు, పారలతో మసీదుని కూల్చడం మొదలుపెట్టారు. మరో పావు గంట గడిచేసరికి 5 వేల మంది వరకు కరసేవకులు మసీదుపైకి ఎక్కేశారు. చేతికి దొరికిన ఆయుధాలతో కూల్చే పని కొనసాగించారు. అడ్వాణీ, జోషి, అశోక్ సింఘాల్, విజయ్‌రాజె సింథియా వంటి నేతలు వారిని వెనక్కి వచ్చేయమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కరసేవకులు వినిపించుకోలేదు. భద్రతా బలగాలు, మీడియా ప్రతినిధులపైకి ఇటుకలు విసురుతూ ఉద్రిక్తతలకు తెర తీశారు. పోలీసు బలగాలు అడ్డుకోలేకపోయాయి జిల్లా మెజిస్ట్రేట్ పారామిలటరీ బలగాల్ని మోహరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్లెవరూ కాల్పులకు దిగకూడదన్న షరతు మీద ఆ నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ బలగాలకు అనుమతించారు. కానీ వారు వివాదాస్పద కట్టడం దగ్గరకి వెళ్లడంలో విఫలమయ్యారు. మార్గం మధ్యలోనే వారిని కరసేవకులు అడ్డుకున్నారు. ఇక రాష్ట పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్ట కుండా మిన్నకుండిపోయారు. మసీదులో ఒక భాగం కూలిపోగానే డీజీపీ కాల్పులకు అనుమతి అడిగితే కళ్యాణ్‌సింగ్ నిరాకరిం చారు. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి. సాయంత్రమ య్యేసరికి మసీదు అంతా నేలమట్టమైంది. కేంద్ర కేబినెట్ యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టుగా ప్రకటించింది. -
‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే
లక్నో: దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విచారణకు తెరపడింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారిలో బీజేపీ అగ్రనేత, నాటి రామ మందిర నిర్మాణ ఉద్యమ రథ సారథి ఎల్కే అడ్వాణీ(92), బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతి, మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్, సాధ్వి రితంబర, ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. తదితరులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. లాస్ట్ వర్కింగ్ డే దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో సీబీఐ కోర్టు ఉన్న ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మధ్యాహ్నం 12:10 గంటలకు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ న్యాయస్థానంలోకి వచ్చారు. ఆ తరువాత, 10 నిమిషాల్లోనే నిందితులంతా నిర్దోషులేనని పేర్కొంటూ తీర్పు ఆపరేటివ్ భాగాన్ని వెలువరించారు. న్యాయమూర్తి ఎస్కే యాదవ్‌కు బుధవారం చివరి పని దినం కావడం గమనార్హం. 26 మంది హాజరు తీర్పురోజు నిందితులంతా కోర్టుకు హాజరు కావాలని జడ్జి గతంలో ఆదేశించారు. కానీ, కరోనా, తదితర కారణాలతో పలువురు హాజరు కాలేదు. జీవించి ఉన్న 32 మంది నిందితుల్లో 26 మంది హాజరయ్యారు. తీర్పు ప్రకటిస్తున్న సమయంలో కోర్టుహాళ్లో ఉన్న కొందరు నిందితులు జడ్జి ముందే గట్టిగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. నిందితుల్లో వృద్ధాప్య కారణాలు చూపుతూ అద్వానీ, ఎంఎం జోషి, మహంత్ నృత్యగోపాల్‌దాస్ కోర్టుకు హాజరు కాలేదు. కళ్యాణ్ సింగ్, ఉమాభారతిలకు కరోనా సోకడంతో రాలేదు. విచారణ ఇలా.. విచారణ సమయంలో 351 మంది సాక్ష్యులను, 600 పత్రాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. 49 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో విచారణ సాగుతుండగా వీహెచ్‌పీ అగ్రనేత అశోక్ సింఘాల్, శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే, విజయరాజె సింధియా తదితర 17 మంది చనిపోయారు. రోజువారీ విచారణ జరపాలని, రెండు సంవత్సరాల్లోగా విచారణ ముగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. నిందితులు మసీదు కూల్చివేతకు కుట్ర పన్నడంతోపాటు కరసేవకులను రెచ్చగొట్టారని సీబీఐ వాదించింది. విగ్రహాలను పూజారి కాపాడారు: మసీదును దుండగులు కూల్చివేస్తున్న సమయంలో గర్భాలయంలో ఉన్న రామ్‌లల్లా విగ్రహం, ఇతర విగ్రహాలను అక్కడి పూజారి సత్యేంద్ర దాస్ బయటకు తీసుకువెళ్లారని, దీనిబట్టి, మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని అర్థమవుతుందని నిందితుల తరఫు న్యాయవాది విమల్ శ్రీవాస్తవ వాదించారు. వివాదాస్పద ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోని రామకథ కుంజ్ వద్ద వేదికపై నుంచి కూల్చివేత వద్దంటూ వీహెచ్‌పీ నేతలు, ఇతర నాయకులు ఇస్తున్న సూచనలను దుండగులు పట్టించుకోలేదన్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు అశోక్ సింఘాల్ ప్రయత్నించారన్నారు. మతపరమైన విశ్వాసంతో లాంఛనప్రాయంగా కరసేవ చేయాలనేదే నాయకుల ఉద్దేశమని, కాని కొందరు దురుద్దేశపూరితంగా దీన్ని భగ్నం చేసి, కూల్చివేతకు పాల్పడ్డారని వివరించారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన వీడియోలు సీల్ అయి లేవని, అవి నిజమైనవా? కాదా? అని లాబ్‌లో పరీక్షించలేదని పేర్కొన్నారు. ముందు నుంచీ చెబుతున్నాం.. మసీదును కూల్చేందుకు కుట్ర పన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఎల్కే అద్వానీ, ఎంఎం జోషి, కళ్యాణ్ సింగ్, ఉమాభారతి తదితర నిందితులపై తప్పుడు కేసు పెట్టారని ముందు నుంచీ చెబుతున్నామని డిఫెన్స్ లాయర్ విమల్ కుమార్ శ్రీవాస్తవ తీర్పు అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో ఆ కేసు పెట్టారని, ఈ తాజా తీర్పు న్యాయానికి లభించిన విజయమని ఆయన పేర్కొన్నారు. అప్పీల్‌కు వెళ్లడంపై.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ పై కోర్టులో అప్పీల్ చేస్తుందా? అన్న ప్రశ్నకు సీబీఐ న్యాయవాది లలిత్ సింగ్ జవాబిస్తూ.. ఈ తీర్పు కాపీని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని, తీర్పును సీబీఐ న్యాయ విభాగం అధ్యయనం చేసిన తరువాత అప్పీల్‌కు వెళ్లడంపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. మంచిదే: అన్సారీ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమన్య హక్కు కేసులో ప్రధాన కక్షిదారు అయిన ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. ‘అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. మంచిదే. జరగాల్సిందంతా గత సంవత్సరం నవంబర్ 9ననే జరిగింది. అదే రోజు ఈ కేసు కూడా ముగిస్తే ఇంకా బావుండేది’ అని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో రామజన్మభూమికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. మా విశ్వాసం నిలబెట్టింది తీర్పువినగానే జై శ్రీరాం అని అడ్వాణీ నినదించారు. ‘రామ జన్మభూమి ఉద్యమంపై నా నమ్మకాన్ని, బీజేపీ విశ్వాసాన్ని, మా నిబద్ధతను ఈ తీర్పు సమర్థించింది’ అని అన్నారు. ‘అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం నా చిరకాల స్వప్నం. అందుకు వీలు కల్పించే గత నవంబర్ 29 నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. అదే స్ఫూర్తితో ఈ తీర్పు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణం పూర్తి కావడం కోసం లక్షలాది భక్తులతో పాటు నేను ఎదురు చూస్తున్నా’ అన్నారు. అయోధ్య ఉద్యమ సమయంలో తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వామీజీలు, అందరికీ అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు తరువాత తన ఇంటి నుంచి బయటకు వచ్చి, అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను, అభిమానులను ఆయన జైశ్రీరాం అంటూ పలకరించారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. తీర్పు వెలువడ్డాక వారణాసిలో మిఠాయిలు తినిపించుకుంటున్న ముస్లిం మహిళా ఫౌండేషన్ సభ్యులు -
రామమందిర ట్రస్ట్ నుంచి భారీగా సొమ్ము మాయం
లక్నో: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి భారీగా విరాళాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి భారీగా సొమ్ము మాయమైంది. సెప్టెంబర్ 1వ తేదీన లక్నోలోని బ్యాంకు నుంచి రూ.6 లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తరువాత మూడున్నర లక్షల రూపాయలను ట్రస్ట్ చెక్ పేరుతో విత్‌డ్రా చేసుకున్నారు. అయితే ముచ్చటగా మూడోసారి ఏకంగా 9.86 లక్షల రూపాయలకు టోకరా వేశారు. అయితే అంత పెద్ద మొత్తం డబ్బు కావడంతో బ్యాంకు అధికారులకు సందేహం వచ్చి ట్రస్ట్ వారికి ఫోన్ చేయగా విషయం బయటపడింది. (రాముడిపై సినిమాకు ఇదే సరైన సమయం: రాజమౌళి) ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయోధ్య పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మందిర నిర్మాణం కోసం ముంబై, హైదరాబాద్ సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని.. వారందరికీ ముందే కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు వెల్లడించారు. థర్మల్ స్రీనింగ్ తర్వాతే విధుల్లోకి అనుమతిస్తామని తెలిపారు. (అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు) -
అయోధ్య: ప్రారంభమైన రామమందిర నిర్మాణం
-
ప్రారంభమైన రామమందిర నిర్మాణం
లక్నో: దేశప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసిన రామ మందిర నిర్మణానికి సంబంధించి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టిని పరీక్షిస్తున్నారు. 36 నుంచి 40 నెలల కాలంలో ఆలయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ ట్వీట్ చేసింది. ‘మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాము. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదు’ అంటూ ట్వీట్ చేసింది. The construction of Shri Ram Janmbhoomi Mandir has begun. Engineers from CBRI Roorkee, IIT Madras along with L&T are now testing the soil at the mandir site. The construction work is expected to finish in 36-40 months. — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 20, 2020 -
భూమి పూజకు శ్రీకారం
అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఈ బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం జరిగే రామ జన్మభూమి వద్ద సోమవారం 12 మంది పూజారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి పూజ జరిపారు. అయోధ్యలోని హనుమాన్ గఢి ఆలయంలో మంగళవారం పూజాకార్యక్రమం నిర్వహిస్తారు. భూమి పూజ కార్యక్రమ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాలదాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఆహ్వానితులు మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి రావాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాలు పంపిన 175 మందిలో 135 మంది పలు సంప్రదాయ మఠ, ఆధ్యాత్మిక గురువులేనని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకురాలు ఉమా భారతి.. భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఉద్ధవ్ ఠాక్రే వెళ్లకపోవచ్చు అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరు కాకపోవచ్చని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘అయోధ్యలో కరోనా పరిస్థితి సీరియస్‌గా ఉంది. కోవిడ్–19తో ఒక యూపీ మంత్రి కూడా చనిపోయారు. మరో ముగ్గురు మంత్రులకు సోకింది. ఈ పరిస్థితుల్లో భూమి పూజ కార్యక్రమానికి ఎంత తక్కువ మంది వెళ్తే అంత మంచిది’ అన్నారు. రత్నాలు పొదిగిన దుస్తులు భూమి పూజ రోజు ‘రామ్‌లల్లా’కు అలంకరించే వస్త్రాలను శంకర్‌లాల్, భగవత్ లాల్ సోదరులు రూపొందిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా వారు బాల రాముడికి వ స్త్రాలను రూపొందిస్తున్నారు. ‘1985లో మా నాన్న బాబూలాల్ బాల రాముడికి వ స్త్రాలు రూపొందించడం ప్రారంభించారు. కుట్టుమిషన్‌తో పాటు రామజన్మభూమికి వెళ్లి, అక్కడే రామ్‌లల్లా విగ్రహం ముందే దుస్తులు కుట్టేవారు. మా ఇద్దరిని కూడా వెంట తీసుకువెళ్లేవారు’ అని శంకర్‌లాల్ తెలిపారు. ‘5న రామ్‌లల్లాకు అలంకరించడం కోసం రెండు జతల దుస్తులను రూపొందిస్తున్నాం. మఖ్మల్ వస్త్రంతో బంగారు దారంతో నవ రత్నాలు పొదిగి ఒకటి ఆకుపచ్చ వర్ణంలో, మరొకటి నారింజ రంగులో సిద్ధం చేస్తున్నాం’ అని తలిపారు. కాగా, భూమి పూజ పనులను యూపీ సీఎం ఆదిత్య నాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అది శ్రీరాముడి కోరిక భూమి పూజ కార్యక్రమానికి తాను హాజరుకావడం శ్రీరామ చంద్రుడి కోరిక కావచ్చని అయోధ్య భూ వివాదంలో కక్షిదారు అయిన ఇఖ్బాల్ అన్సారీ వ్యాఖ్యానించారు. ఆలయ ట్రస్ట్ నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు. భూమిపూజ రోజు ప్రధాని మోదీకి రాముడి పేరు ఉన్న శాలువాను, రామచరిత మానస్ పుస్తకాన్ని బహూకరించాలనుకుంటున్నా అని అన్నారు. రామ్ లల్లా ఫొటోతో ముద్రితమైన ఆహ్వాన ప్రతి -
‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’
లక్నో: అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో మతసామరస్యం వెల్లివిరిసే చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. అయోధ్య భూమిపూజకు సంబంధించిన తొలి ఆహ్వానాన్ని అధికారులు ఓ ముస్లింకు అందించారు. అది కూడా అయోధ్యలోని వివాదాస్పద స్థలం ముస్లింలకే దక్కాలని పోరాడిన ఇక్బాల్ అన్సారీకి. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..) ఈ ఆహ్వానంపై అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందడం ఆ శ్రీరాముడి కోరిక అనుకుంటాను. దీన్ని మనసారా స్వీకరిస్తున్నాను. ఆలయం నిర్మాణం పూర్తయతే.. అయోధ్య చరిత్ర కూడా మారుతుంది. ఎంతో అందంగా తయారవుతుంది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. కాబట్టి స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అన్నారు. అయోధ్య ప్రజలు గంగా-జముని నాగరికతను అనుసరిస్తున్నారని, ఎవరిలోనూ చెడు భావన లేదని తెలిపాడు అన్సారీ. ‘ఈ ప్రపంచం నమ్మకం మీదనే నడుస్తోంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిస్తే.. వస్తాను అని నేను ముందే చెప్పాను. అయోధ్యలో ప్రతి మతానికి, వర్గానికి చెందిన దేవతలు ఉన్నారు. ఇది సాధువుల భూమి. రామ మందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నాడు అన్సారీ. (150 నదుల జలాలతో అయోధ్యకు..) భూమిపూజకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అడ్వాణీతోపాటు పలువురు నేతలకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల రద్దీకి చోటు లేకుండా కేవలం 180 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
‘అయోధ్యలో భూమి పూజ ఆపండి’
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని తెలిపారు. బుధవారం జరగాలల్సిన ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రధాని నరేంద్రమోదీని దిగ్విజయ్ కోరారు. మోదీ రామ మందిర నిర్మాణ ‘భూమి పూజ’ ఆచారాలతో ఎంత మందిని ఆస్పత్రులకు పంపాలనుకుంటున్నారని తీవ్రంగా ప్రశ్నించారు.(అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను) ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా ప్రధానితో చర్చించి భూమి పూజను ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పూజారులు, యూపీ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కూడా కరోనా సోకిందన్నారు. ఇటువంటి సంక్లిష్టమైన సమయంలో సీఎం యోగి, ప్రధాని మోదీ కూడా 14రోజుల పాటు హోం కార్వటైన్‌కు పరిమితం కావాలన్నారు. ‘భూమి పూజ’ కార్యక్రమానికి ఏమాత్రం అనుకూలం కాని తేదీని నిర్ణయించారని మండిపడ్డారు. వేల ఏళ్లనాటి హిందువుల విశ్వాసం కంటే మోదీకి సౌకర్యమైన రోజు నిర్ణయించడం గొప్పదా అని ట్విటర్లో మండిపడ్డారు. -
అయోధ్య పూజారికి కరోనా
అయోధ్య: ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న రామమందిర భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పూజారికి, పదహారు మంది భద్రతా సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన పూజారి ప్రదీప్ దాస్, ఆలయంలో పూజలు నిర్వహించే నలుగురు ప్రధాన పూజారుల్లో ఒకరైన ఆచార్య సత్యేంద్ర దాస్ శిష్యుడు. ప్రదీప్ దాస్‌ని ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉంచారు. అయోధ్యలో ప్రధాని మోదీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు వాటర్ ప్రూఫ్ మండపాలూ, దానిలో ఒక చిన్న వేదికను ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్‌లో భారీ స్క్రీన్లపై.. భూమిపూజ ఘట్టాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయులు సైతం వీక్షించనున్నారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య రామమందిరం త్రీడీ చిత్రాలను ప్రపంచంలోనే అతిపెద్ద 17వేల చదరపుటడుగుల భారీ నాస్డాక్ స్క్రీన్‌పై దీన్ని ప్రదర్శించనున్నట్టు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫెయిర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ షెహానీ వెల్లడించారు. ఇది జీవిత కాలంలో చూడలేని ఒక అద్భుతమైన కార్యక్రమం అని, ఈ చారిత్రక సందర్భంలో అమెరికాలోని భారతీయులంతా అక్కడ సమావేశమౌతారని షెహానీ అన్నారు. -
రామ మందిరం: మొఘల్ వారసుడి కానుక
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ప్రకటించారు. కిలో బరువున్న ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీకి అందిస్తానని, దీన్ని ఆలయ నిర్మాణంలో వాడవచ్చని ఆయన ప్రకటించారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగబోతుంది. ఇది మనందరికి ఎంతో సంతోషకరమైన విషయం. నేను మాట ఇచ్చినట్లుగానే రామమందిర నిర్మాణానికి మొఘల్ వంశం తరపున కేజీ బంగారపు ఇటుకను ఇస్తున్నాను’ అని యాకుబ్ పేర్కొన్నారు. ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరానని ఆయన దగ్గర నుంచి పిలుపు రావాల్సి ఉందని చెప్పారు. చదవండి: మందిరానికి విరాళాలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం మొఘలుల వారసుడిగా చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరం తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని డిమాండ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆగస్టు 5వతేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు అయోధ్య రామాలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. కరోనా మహమ్మరి నేపథ్యంలో దీని కోసం కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానిస్తున్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఆకాశాన్నంటే రామ మందిరం -
మందిరానికి విరాళాలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం
న్యూఢిల్లీ/బెంగళూరు: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపారు. రామునిపై విశ్వాసం ఉన్న ఏ మతం వారైనా ఎంతైనా విరాళంగా ఇవ్వవచ్చునన్నారు. ఆగస్టు 5న జరిగే భూమిపూజకు.. అత్యంత సీనియర్ బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, ఎం.ఎం.జోషి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర 200 మందిని ఆహ్వానిస్తామని ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా, కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో చేపట్టే రామాలయ భూమిపూజ కార్యక్రమం దూరదర్శన్‌తోపాటు ఇతర చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వారన్నారు. దేశంలోని ప్రముఖ యాత్రాస్థలాల మట్టితోపాటు ప్రముఖ సిక్కు, బౌద్ధ, జైన మతాలయాల వద్ద మట్టిని కూడా సేకరించి, అయోధ్యకు పంపుతామన్నారు. -
అమోధ్య ట్రస్ట్ ఏర్పాటు
-
రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరో ముందడుగు పడింది. మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం.. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ‘ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక అంశంపై మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఇది లక్షలాది ప్రజలలాగే నా హృదయానికి కూడా చాలా దగ్గరైన విషయం. దీనిపై ప్రకటన చేసే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటూ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిర అభివృద్ధి కోసం ఒక విస్తృత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. శ్రీరాముడి జన్మస్థలంలో అద్భుతమైన రామాలయ నిర్మాణానికి భారతీయులంతా సహకరించాలని మోదీ కోరారు. ప్రధాని ప్రకటన సందర్భంగా అధికార పక్ష సభ్యులు జై శ్రీరాం నినాదాలతో సభను హోరెత్తించారు. అయోధ్య తీర్పు అనంతరం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్య విధివిధానాలపై గొప్ప విశ్వాసాన్ని చూపారని, అందుకు 130 కోట్ల భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ తెలిపారు. భారత్‌లో అన్ని మతాల వారు ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటారన్నారు. మన సంస్కృతిలోనే ఆ వసుధైక కుటుంబ భావన ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఒక దళితుడు సహా 15 మంది ట్రస్టీలు రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ‘లక్షలాది భక్తుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నా. రాముడు జన్మించిన పుణ్యక్షేత్రంలో భక్తులు పూజలు చేసుకునే అవకాశం త్వరలోనే లభించనుంది’ అన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, రామ మందిర నిర్మాణం గతంలో ‘రామజన్మభూమి న్యాస్’ ప్రతిపాదించిన నమూనాలో ఉంటుందని ఆశిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ పేర్కొన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా, రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడానికి తన అనుమతి అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
ఆకాశాన్నంటే రామ మందిరం
పకూర్ (జార్ఖండ్): అయోధ్యలో ఆకాశాన్నంటే భవ్యమైన రామమందిర నిర్మాణం నాలుగు నెలల్లో మొదలుకానుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరి వందేళ్ల స్వప్నం సాకారం కానుందని తెలిపారు. జార్ఖండ్‌లోని పకూర్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రామ జన్మభూమి అంశం కేసు కోర్టుల్లోనే నలిగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఎందుకు ప్రయత్నించారో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ దేశ సరిహద్దులను కాపాడలేకపోయింది, దేశాన్ని అభివృద్ధి చేయలేకపోయింది, ప్రజల మనోభావాలను గుర్తించడంలో విఫలమైంది’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బ్రిటిష్ పాలకులపై పోరాడిన గిరిజన నాయకులకు నివాళులర్పిస్తూ ఆయన.. ‘మిర్ జాఫర్ వంటి దేశ ద్రోహులు పరాయి పాలనకు వంతపాడారు. అలాంటి వారు మీ ప్రతినిధులు కారాదు. దేశాన్ని అభివృద్ధి చేసి రక్షించే మోదీని, బీజేపీని గెలిపించండి’ అని కోరారు. ‘కాంగ్రెస్ ఒడిలో కూర్చుని ముఖ్యమంత్రి కావాలని జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కలలు కంటున్నారు. జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమంలో యువకులపై కాల్పులు జరిపిందెవరో చెప్పాలి’ అని ప్రశ్నించారు. ఒకప్పుడు కాంగ్రెస్/ఆర్జేడీ కూటమి యువకుల బలిదానానికి కారణమైతే నేడు హేమంత్ పదవి కోసం కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నందుకు సిగ్గుపడాలన్నారు. -
అయోధ్య తీర్పు : సోంపురా డిజైన్లోనే ఆలయం?
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రకాంత్ సోంపురా.. అయోధ్య తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ఈయన పేరు పతాక శీర్షికల్లో చేరిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్ రూపొందించిన శిల్పి ఈయనే. గుజరాత్ వాసి అయిన చంద్రకాంత్ సోంపురా(78) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్ చీఫ్ అశోక్ సింఘాల్ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్ గీశారు. 1990లో అలహాబాద్‌లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి సమ్మతించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన రాతి స్తంభాలను మలిచేందుకు ప్రత్యేక కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ డిజైన్‌లో పేర్కొన్న విధంగా శిల్పులు శిల్పాలు, స్తంభాల్లో 40 శాతం వరకు ఇప్పటికే చెక్కారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని చంద్రకాంత్ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రస్ట్ ఏర్పాటు, వనరుల సమీకరణకు కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణ నినాదానికి తోడుగా ఈ నమూనానే ఇంటింటికీ చేరింది. అందుకే ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నమూనా రూపొందించి, మళ్లీ దానికి తగిన రీతిలో రాయి సమకూర్చుకోవడం వంటి అంశాలు ఇమిడి ఉన్నందున తగు సమయం పట్టే అవకాశం ఉంది. పైగా చంద్రకాంత్ సోంపురా కుటుంబమే దేశ విదేశాల్లోని వందలాది ఆలయాలకు నమూనాలను అందించింది. చంద్రకాంత్ సోంపురా తండ్రి ప్రభాకర్ సోంపురా గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయానికి, మథురలోని శ్రీకృష్ణ ఆలయానికి డిజైన్ అందించారు. చంద్రకాంత్ సోంపురా స్వయంగా 100 ఆలయాలకు శిల్పిగా వ్యవహరించారు. ఇందులో గుజరాత్‌లోని స్వామి నారాయణ్ మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఆలయ పనులు ప్రారంభమవుతాయని, వచ్చే శ్రీరామనవమికి ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీహెచ్‌పీ నేతలు అంటున్నారు. సోంపురా రూపొందించిన నమూనా ఇలా ► ఆలయ నిర్మాణానికి ఆరున్నర ఎకరాల స్థలం అవసరం. ► ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నగర’ శైలిలో ఆలయం ఉంటుంది. ► గర్భ గృహం, అంత్రల్, మహా మండపం, రంగ మండపం, ప్రవేశ మండపం.. ఇలా ఐదు భాగాలుగా ఉంటుంది. వీటి గుండానే రాముడి దర్శనం ఉంటుంది. ► గర్భ గృహానికి ఒక ద్వారం, మహా మండపానికి 7 ద్వారాలు ఉంటాయి. ► ఈ ఆకృతిలో ఆలయ నిర్మాణానికి 2.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం. ఇప్పటికే 1.25 లక్షల ఘనపుటడుగుల రాయిని చెక్కారు. ► ఈ నమూనా ప్రకారం 270 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయ కట్టడం ఉంటుంది. ఇందులో 81 అడుగుల మేర గోపుర శిఖరం ఉంటుంది. ► 212 స్తంభాలతో నిర్మాణం ఉంటుంది. ► ప్రధాన ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో బాల రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉంటుంది. ఆ పైన ఆలయ శిఖరం ఉంటుంది. ► ప్రధాన ఆలయానికి ఒకవైపు కథా కుంజ్ ఉంటుంది. ► రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లా బన్సి పహార్పూర్ నుంచి తెచ్చిన గులాబీ రంగు రాయితో ఇప్పటికే దాదాపు 40 శాతం మేర శిల్పాల పనులు పూర్తయ్యాయి. ► ఆలయ నిర్మాణంలో స్టీలు అవసరం లేదు. -
‘డిసెంబర్ 6 నుంచి రామ మందిర నిర్మాణం’
లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వెల్లడించారు. రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుదవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడుతూ..1992 డిసెంబర్ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైందని ఆయన అన్నారు. రామ మందిర్ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. బాబర్ వారి పూర్వీకుడు కాదని, ఒక ఆక్రమణ దారుడని.. ఈ విషయాన్ని సున్నీ వక్స్ బోర్డు అంగీకరించాలన్నారు .మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ..తన పిటిషన్ తర్వాతే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని ఆయన తెలిపారు. -
రామాలయ నిర్మాణానికి 21న శ్రీకారం: స్వరూపానంద
అలహాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వచ్చే నెల 21న శ్రీకారం చుడతామని ఆధ్యాత్మిక నాయకుడు స్వామి స్వరూపానంద సరస్వతి బుధవారం చెప్పారు. బుల్లెట్లను ఎదుర్కోడానికైనా సరే తాము సిద్ధమేనన్నారు. మూడు రోజుల కుంభమేళా ముగింపు సందర్భంగా ఈ నిర్ణయాన్ని అలహాబాద్ (ప్రయాగ్ రాజ్)లో స్వరూపానంద ప్రకటించారు. అయోధ్యలో గతంలో సేకరించిన, వివాదరహిత భూమి ని తిరిగి వాస్తవ యజమానులకు అప్పగిం చేందుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ వేసిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. అలహాబాద్‌లో ధర్మ సభ అనంతరం ద్వారాకా పీఠానికి చెందిన శంకరాచార్య ఓ ప్రకటన విడుదల చేస్తూ హిందువులంతా ఒక్కొక్కరు నాలుగు ఇటుకలు పట్టుకుని ఫిబ్రవరి 21న అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు. సాధువులంతా వసంతపంచమి రోజైన ఫిబ్రవరి 10న అలహాబాద్ నుంచి అయోధ్యకు తమ యాత్రను ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు అంటే తమకు గౌరవం ఉందనీ, అయితే ఇప్పుడు తాము రామాలయ నిర్మాణం ప్రారంభించకపోతే ఇంకెప్పటికీ కుదరకపోవచ్చని పేర్కొన్నారు. -
2025లోపు రామమందిరం: భయ్యాజీ
ప్రయాగ్‌రాజ్: అయోధ్యలో రామమందిర నిర్మాణం 2025లోపు పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మందిర నిర్మాణం ప్రారంభించాలన్నారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లుగానే మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాక భయ్యాజీ పైవిధంగా స్పందించారు. -
మందిర నిర్మాణం మరవొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్‌పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు. కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్ వద్దు. టెంపుల్ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్‌ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు. ‘మోదీని వదిలిపెట్టం’ హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు. హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్‌పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు -
‘అభిశంసన’తో జడ్జీలనే బెదిరించారు
ఆల్వార్/విదిశ: అయోధ్య కేసును ఈ ఏడాది తొలి నాళ్లలో విచారించాలనుకున్న సుప్రీంకోర్టు జడ్జీలను అభిశంసన పేరిట కాంగ్రెస్ బెదిరించిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. లాయర్లు కూడా అయిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కొందరు..ఈ కేసును 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా సాగదీసేందుకు ఈ ఎత్తుగడ వేశారని విమర్శించారు. రాజస్తాన్‌లోని ఆల్వార్, మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఆదివారం జరిగిన ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తన తల్లిదండ్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే ధైర్యం లేకే తన కులం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కులతత్వం, పేదలు, అణగారిన వర్గాలపై ద్వేషాన్ని కాంగ్రెస్ నరనరాల్లో నింపుకుందని ధ్వజమెత్తారు. అది ప్రమాదకర క్రీడ.. ఆల్వార్ సభలో మోదీ మాట్లాడుతూ రాజ్యసభలో తనకున్న సంఖ్యాబలం చూసుకుని కాంగ్రెస్ సుప్రీంకోర్టు జడ్జీలను బెదిరిస్తోందని ఆరోపించారు. ‘ పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగిలే కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త ప్రమాదకర క్రీడను ప్రారంభించింది. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి కేసుల విచారణ టైం టేబుల్‌ను తయారుచేయకుంటే, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, లాయర్లు అయిన కొందరు వ్యక్తులు అభిశంసన పేరిట ఆ జడ్జిని బెదిరిస్తారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా మేధావులు ఈ ప్రమాదకర ధోరణిని ఎండగట్టాలి. మోదీ కులం ఆధారంగా ఓట్లు పడతా యా? మోదీ జన్మస్థలం ఆధారంగా రాజస్తాన్ భవిష్యత్ నిర్మితమవుతుందా?’ అని ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ప్రధాని ప్రశ్నించారు. మోదీ దిగువ కులానికి చెందిన వాడని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు. నా తల్లిదండ్రులు పదవులు చేపట్టలేదు.. తన తల్లిదండ్రుల్ని కాంగ్రెస్ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల్లోకి లాగడంపై విదిశలో జరిగిన సభలో మోదీ మండిపడ్డారు. గాంధీ– నెహ్రూ కుటుంబంపై చేసిన విమర్శల్ని సమర్థించుకున్న మోదీ..తన తల్లిదండ్రులు వారిలా రాజకీయాలు, ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తించలేదని పేర్కొన్నారు. ‘నామ్‌దార్ (రాహుల్‌ను ఉద్దేశించి) అండ చూసుకునే కాంగ్రెస్ నాయకులు 30 ఏళ్ల క్రితం చనిపోయిన నా తండ్రికి రాజకీయాల్లోకి లాగుతున్నారు. లేవనెత్తడానికి వారికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదు. అందుకే నా తల్లిదండ్రులు లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా తల్లి ఇంటికే పరిమితమై పూజలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతోంది. రాజ్నీతిలోని ‘ఆర్’ అనే పదం కూడా ఆమెకు తెలియదు’ అని మోదీ అన్నారు. మోదీ 50వ ‘మన్‌కీ బాత్’ న్యూఢిల్లీ: మాసాంతపు ‘మన్‌కీ బాత్’ ప్రసంగ కార్యక్రమాన్ని రాజకీయాలకు దూరంగా ఉం చి, ప్రజల ఆకాంక్షలకు వేదికగా చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన వ్యక్తిగత, ప్రభు త్వ విజయాల్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదన్నారు. 2014 అక్టోబర్‌లో ప్రారంభమైన ‘మన్‌కీ బాత్’ ఆదివారం 50వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో రేడియో అత్యంత శక్తిమంతమైన సాధనమని, అందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు మోదీ చెప్పారు. కుటుంబాల్లో యువత, పెద్దల మధ్య కమ్యూనికేషన్ అంతరం ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి చర్చిస్తే భావవ్యక్తీకరణ ప్రభావవంతంగా ఉంటుందన్నారు. చదువు, అలవా ట్లు, జీవన శైలి గురించి మాత్రమే యువతరం తో చర్చిస్తున్నామని, అలాకాకుండా ఎలాంటి హద్దుల్లేకుండా, ఏమీ ఆశించకుండా జరిపే చర్చలతోనే ఫలితం ఉంటుందన్నారు. -
కుంభమేళాలో మందిర నిర్మాణ తేదీలు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్‌తో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. వీహెచ్‌పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్‌ను నేను కోరుతున్నా’ అని గోపాల్‌దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు. పండుగ వాతావరణం ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్‌పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు. హరిద్వార్, ఛత్తీస్‌గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్‌దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు. చట్టం తేవాలి: భాగవత్ మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లో అన్నారు. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు కట్టకుంటే అంతే... అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన వీహెచ్‌పీ కార్యకర్తలు