ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి
నాగ్‌పూర్: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఏకాభిప్రాయం కష్టమని.. అయినా రామమందిర నిర్మాణం జరిగితీరుతుందని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి పేర్కొన్నారు. ఏకాభిప్రాయం ద్వారానే మందిర నిర్మాణం జరగాలని ఆరెస్సెస్ మొదటినుంచీ ఆశించిందని.. కానీ ఇదేమంత సులభం కాదని ఆయన స్పష్టం చేశారు.
నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్ణయించిన స్థలంలోనే రామమందిర నిర్మాణం జరిగితీరుతుంది. నిర్మాణానికి అనుకూలంగానే కోర్టు తీర్పు ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. కోర్టు నిర్ణయం తర్వాతే మందిర నిర్మాణం మొదలవుతుంది’ అని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రయత్నాల్ని స్వాగతిస్తున్నామన్నారు. కర్ణాటకలో లింగాయత్‌లకు మైనారిటీ హోదా డిమాండ్‌తో విభేదిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment