లక్నో: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి భారీగా విరాళాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి భారీగా సొమ్ము మాయమైంది. సెప్టెంబర్ 1వ తేదీన లక్నోలోని బ్యాంకు నుంచి రూ.6 లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తరువాత మూడున్నర లక్షల రూపాయలను ట్రస్ట్ చెక్ పేరుతో విత్‌డ్రా చేసుకున్నారు. అయితే ముచ్చటగా మూడోసారి ఏకంగా 9.86 లక్షల రూపాయలకు టోకరా వేశారు. అయితే అంత పెద్ద మొత్తం డబ్బు కావడంతో బ్యాంకు అధికారులకు సందేహం వచ్చి ట్రస్ట్ వారికి ఫోన్ చేయగా విషయం బయటపడింది. (రాముడిపై సినిమాకు ఇదే సరైన సమయం: రాజమౌళి)
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయోధ్య పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మందిర నిర్మాణం కోసం ముంబై, హైదరాబాద్ సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని.. వారందరికీ ముందే కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు వెల్లడించారు. థర్మల్ స్రీనింగ్ తర్వాతే విధుల్లోకి అనుమతిస్తామని తెలిపారు. (అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు)
Comments
Please login to add a commentAdd a comment