
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలుపుతున్న ఆర్కేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ ఓఫిర్ తదితరులు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): క్రైస్తవులు, హిందువుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ (ఆర్కేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ ఓఫిర్ హెచ్చరించారు. క్రైస్తవులపై ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్కేపీ, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ (సీఆర్పీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు.
రంజిత్ ఓఫిర్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టడం ఒక ఎంపీగా రఘురామకృష్ణరాజుకు తగదన్నారు. కార్యక్రమంలో సీఆరీ్పఎస్ జాతీయ అధ్యక్షుడు అప్పికట్ల జీవరత్నం, రాష్ట్ర అధ్యక్షుడు వై.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment