IRCTC Retiring Rooms: ఇండియన్ రైల్వే మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ప్రయాణికుల వల్ల మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్న రైల్వే శాఖ ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. సంస్థ అందించే చాలా సౌకర్యాలను గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఈ కథనంలో అతి తక్కువ ధరకే హోటల్ రూమ్ లాంటి గదులను ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలను తెలుసుకుందాం.
నిజానికి రైలు ప్రయాణం చేసేవారు స్టేషన్‌లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినప్పుడు కొంత మంది ప్లాట్‌ఫామ్ మీదనే ఉండిపోతారు. కొంత మంది సమీపంలో ఉన్న హోటల్ రూమ్స్ కోసం వెళతారు. కానీ రైల్వే స్టేషన్లలోనే అలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. వాటిని రిటైరింగ్ రూమ్స్ అంటారు.
రైల్వే స్టేషన్లలో ఏసీ, నాన్ ఏసీ గదులు (సింగిల్, డబుల్ బెడ్) అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి ధరలు రూ. 100 నుంచి రూ. 700 వరకు ఉంటాయి. చాలా వరకు కేవలం వందకే రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి. లేకుంటే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ సదుపాయం పెద్ద పెద్ద స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి.
రిటైరింగ్ రూమ్ ఇలా బుక్ చేసుకోండి..
- టికెట్ కన్ఫర్మ్ అయిన ప్యాసింజర్లు ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తరువాత మై బుకింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్ళాలి, టికెట్ బుకింగ్ కింద రిటైరింగ్ రూమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపైన క్లిక్ చేయగానే రూమ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
- ఆ ఆప్షన్‍లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా సర్చ్ చేసుకోవాలి.
- మీరు ఏ స్టేషన్‌లో ఉండాలనుకుంటున్నారు అనేది ఎంచుకోవాలి.
- అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మషన్, జర్నీ టైమ్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
- చెక్ ఇన్, చెక్ అవుట్, బెడ్ టైప్, ఏసీ, నాన్ ఏసీ వంటివి ఎంపిక చేసుకుని, ఖాళీ ఎక్కడ ఉందో చూసుకుని బుక్ చేసుకోవాలి.
- రూమ్ నెంబర్, ఐడీ కార్డు టైప్ వంటి వాటిని సెలక్ట్ చేసుకున్న తరువాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత రూమ్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
(ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్ మీడియాలో వీడియో వైరల్)
ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్ చార్జెస్ & రద్దు చేసుకునే విధానం
ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జ్ రిటైరింగ్ రూమ్‌కు 24 గంటల వరకు రూ.20, డార్మిటరీ బెడ్‌కు 24 గంటల వరకు రూ.10 ఉంటుంది. అదే సమయంలో రిటైరింగ్ రూమ్ 24 గంటల నుంచి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ధరలు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించడం జరుగుతుంది.
- బుక్ చేసుకున్న తరువాత 48 గంటల వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు.
- ఒక వేళా 48 గంటలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో రద్దు చేసుకుంటే 10 శాతం తగ్గింపు ఉంటుంది.
- రూమ్ తీసుకునే రోజు రద్దు చేసుకుంటే 50 శాతం తగ్గింపు ఉంటుంది.
(ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!)
గుర్తుంచుకోవలసిన విషయాలు
- ప్రయాణికులు రూమ్ బుక్ చేసుకుంటే రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు.
- వెయిట్-లిస్ట్‌లో ఉన్నప్పుడు రూమ్‌లను బుక్ చేసుకోవడం కుదరదు.
- ఆన్‌లైన్‌లో బుకింగ్ చేస్తే, క్యాన్సిల్ కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
- ఒక వేళా ట్రైన్ రద్దు అయితే, నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన డబ్బు తిరిగి వాపసు పొందుతాడు.
Comments
Please login to add a commentAdd a comment