retiring rooms online booking
-
ఇంత తక్కువ ధరకు రైల్వే స్టేషన్లో రూమ్ లభిస్తుందని తెలుసా!
IRCTC Retiring Rooms: ఇండియన్ రైల్వే మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ప్రయాణికుల వల్ల మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్న రైల్వే శాఖ ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. సంస్థ అందించే చాలా సౌకర్యాలను గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఈ కథనంలో అతి తక్కువ ధరకే హోటల్ రూమ్ లాంటి గదులను ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలను తెలుసుకుందాం. నిజానికి రైలు ప్రయాణం చేసేవారు స్టేషన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినప్పుడు కొంత మంది ప్లాట్‌ఫామ్ మీదనే ఉండిపోతారు. కొంత మంది సమీపంలో ఉన్న హోటల్ రూమ్స్ కోసం వెళతారు. కానీ రైల్వే స్టేషన్లలోనే అలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. వాటిని రిటైరింగ్ రూమ్స్ అంటారు. రైల్వే స్టేషన్లలో ఏసీ, నాన్ ఏసీ గదులు (సింగిల్, డబుల్ బెడ్) అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి ధరలు రూ. 100 నుంచి రూ. 700 వరకు ఉంటాయి. చాలా వరకు కేవలం వందకే రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి. లేకుంటే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ సదుపాయం పెద్ద పెద్ద స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. రిటైరింగ్ రూమ్ ఇలా బుక్ చేసుకోండి.. టికెట్ కన్ఫర్మ్ అయిన ప్యాసింజర్లు ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత మై బుకింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్ళాలి, టికెట్ బుకింగ్ కింద రిటైరింగ్ రూమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే రూమ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా సర్చ్ చేసుకోవాలి. మీరు ఏ స్టేషన్లో ఉండాలనుకుంటున్నారు అనేది ఎంచుకోవాలి. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మషన్, జర్నీ టైమ్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ ఇన్, చెక్ అవుట్, బెడ్ టైప్, ఏసీ, నాన్ ఏసీ వంటివి ఎంపిక చేసుకుని, ఖాళీ ఎక్కడ ఉందో చూసుకుని బుక్ చేసుకోవాలి. రూమ్ నెంబర్, ఐడీ కార్డు టైప్ వంటి వాటిని సెలక్ట్ చేసుకున్న తరువాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత రూమ్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. (ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్ మీడియాలో వీడియో వైరల్) ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్స్ చార్జెస్ & రద్దు చేసుకునే విధానం ఐఆర్సీటీసీ సర్వీస్ ఛార్జ్ రిటైరింగ్ రూమ్‌కు 24 గంటల వరకు రూ.20, డార్మిటరీ బెడ్‌కు 24 గంటల వరకు రూ.10 ఉంటుంది. అదే సమయంలో రిటైరింగ్ రూమ్ 24 గంటల నుంచి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ధరలు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించడం జరుగుతుంది. బుక్ చేసుకున్న తరువాత 48 గంటల వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒక వేళా 48 గంటలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో రద్దు చేసుకుంటే 10 శాతం తగ్గింపు ఉంటుంది. రూమ్ తీసుకునే రోజు రద్దు చేసుకుంటే 50 శాతం తగ్గింపు ఉంటుంది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) గుర్తుంచుకోవలసిన విషయాలు ప్రయాణికులు రూమ్ బుక్ చేసుకుంటే రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. వెయిట్-లిస్ట్‌లో ఉన్నప్పుడు రూమ్‌లను బుక్ చేసుకోవడం కుదరదు. ఆన్లైన్లో బుకింగ్ చేస్తే, క్యాన్సిల్ కూడా ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒక వేళా ట్రైన్ రద్దు అయితే, నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన డబ్బు తిరిగి వాపసు పొందుతాడు. -
Retiring Rooms: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
సాక్షి, హైదరాబాద్: మీరు గంటల తరబడి ప్రయాణం చేసి అలసిపోయారా? ఓ రెండు గంటల పాటు విశ్రాంతి కోసం ఎదురుచూస్తున్నారా? మరేం ఫరవాలేదు. రైల్వేస్టేషన్లలోనే ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు. రెండు గంటలే కాదు. రెండు రోజులు కూడా ఉండిపోవచ్చు. చక్కటి సదుపాయాలతో విశ్రాంతి గదులు సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం నగరానికి వచ్చే ప్రయాణికులు, సిటీటూర్ కోసం వచ్చేవారు ఏ హోటల్లోనో బస చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలతో కూడిన రైల్వేస్టేషన్లలోనే ఉండేందుకు అనుగుణంగా దక్షిణమధ్య రైల్వే రిటైరింగ్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో సుమారు 30 విశాలమైన విశ్రాంతి గదులు, డార్మిటరీలను ప్రయాణికుల కోసం కేటాయించారు. వేసవి పర్యటనల కోసం నగరానికి వచ్చే పర్యాటకులతో ఈ గదులకు అనూహ్యమైన డిమాండ్ ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్టార్‌హోటళ్లు, లాడ్జీల కంటే తక్కువ ధరలకే లభించడంతో డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నారు. సిటీ టూర్.. సో బెటర్.. ►సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 2 లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన పర్యటనలు తిరిగి మొదలయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది పర్యటనకు వెళ్లేవారు హైదరాబాద్‌ను విడిదిగా ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా తిరుపతి తదితర పుణ్య క్షేత్రాలకు వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో సిటీటూర్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఇంటిల్లిపాదీ కలిసి పరిచయం లేని ప్రాంతాల్లో ఉండడం కంటే భద్రత దృష్ట్యా రైల్వేస్టేషన్లనే ఎంపిక చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ►24 నుంచి 48 గంటల వరకు బుకింగ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండు, మూడు గంటల పాటు విశ్రాంతి కోసం కూడా గదులను తీసుకోవచ్చు. వ్యాపార అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసే ఉద్యోగులు కూడా విధినిర్వహణలో భాగంగా రైళ్లలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటించవలసి వచ్చినప్పుడు రిటైరింగ్ రూమ్‌లను, డార్మిటరీలకు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. ►ఏసీ, నాన్ ఏసీ సదుపాయంతో కూడిన ఈ గదుల్లో పడకలు, స్నానాల గదులు, టీవీ, తాగునీరు వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఐఆర్టీసీ ఈ గదులను నిర్వహిస్తుంది. రైల్వేస్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ వంటి భద్రతా బలగాల పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు నిశ్చింతంగా ఉండవచ్చు. నిర్ధారిత టిక్కెట్ తప్పనిసరి.. ►విశ్రాంతి గదులను అద్దెకు తీసుకొనేందుకు ప్రయాణికులు నిర్ధారిత టికెట్‌ను కలిగి ఉండాలి. టికెట్ బుకింగ్ సమయంలోనే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా బుకింగ్ సదుపాయం ఉంటుంది. కానీ నిర్ధారిత టిక్కెట్ ఉండాలి. ప్రయాణ తేదీకి అనుగుణంగానే విశ్రాంతి గదుల సదుపాయం లభిస్తుంది. -
అలసట లేని ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: కాసేపు కునుకు తీసి బయలుదేరే సదుపాయాన్ని రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. అందుకోసం రిటైరింగ్ రూములను అందుబాటులోకి తెచ్చింది. రిటైరింగ్ రూములను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఘనత కాచిగూడ రైల్వేస్టేషన్‌దే. హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ శుక్రవారం ఈ రిటైరింగ్ రూములను ప్రారంభించి ప్రయాణికులకు అం దుబాటులోకి తెచ్చారు. ఈ రిటైరింగ్ రూముల్లో స్నానాల గదులు, తాగునీరు, మంచాలు, దుప్పట్లు, టీవీ, న్యూస్‌పేపర్లు, ఈజీ చైర్స్, తదితర అన్ని సదుపాయాలు ఉం టాయి. ప్రయాణికులు తమ అవసరాలు, ప్రయాణ సమయానికి అనుగుణంగా గంటల ప్రాతిపదికన చార్జీలు చెల్లించి ఈ విశ్రాంతి గదుల్లో బస చేయవచ్చు. ఇప్పటి వరకు ప్రతి 12 గంటలు, 24 గంటల చొప్పున చార్జీలు విధిస్తుండగా ఐఆర్సీటీసీ నిర్వహించే విశ్రాంతి గదుల్లో మాత్రం గంటల ప్రాతిపదికపై చార్జీలు వసూలు చేస్తారు. ప్రయాణికులు ప్రయాణంతోపాటే రిటైరింగ్ రూమ్‌ను బుక్ చేసుకోవచ్చు. కాచిగూడ స్టేషన్లో దిగిన తరువాత నేరుగా వెళ్లి బుక్ చేసుకోవచ్చు. రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకొనే వారు తమ ప్రయాణ టికెట్‌ను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. -
రైల్వే రిటైరింగ్ రూంలకూ ఆన్లైన్ బుకింగ్!
ఇన్నాళ్లూ రైలు టికెట్లు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇక మీదట రైల్వే స్టేషన్లలో ఉండే రిటైరింగ్ రూంలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే కృషిలో భాగంగా ఐఆర్సీటీసీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. టికెట్ కన్ఫర్మ్ అయినా లేదా ఆర్ఏసీలో ఉన్నా సరే.. రిటైరింగ్ రూంను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కౌంటర్లలో తీసుకున్నా లేదా ఈ టికెట్ తీసుకున్నా కూడా ఈ సదుపాయం ఉంటుంది. ప్రస్తుతానికి కేవలం ముంబైలోని సీఎస్టీ స్టేషన్లో ఉన్న రిటైరింగ్ రూంలకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఢిల్లీ, కోల్‌కతా లాంటి నగరాలతో పాటు దేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలన్నింటికీ ఈ సదుపాయాన్ని త్వరలోనే విస్తరిస్తారు. నేరుగా ఐఆర్సీటీసీ సైట్ నుంచి లేదా రైల్టూరిజంఇండియా.కామ్ అనే సైట్ నుంచి వీటిని బుక్ చేసుకోవచ్చు. రాత్రి 11.30 నుంచి 12.30 మధ్య మినహా రోజులో 23 గంటలూ రిటైరింగ్ రూంలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. సింగిల్ బెడ్ లేదా డబుల్ బెడ్ ఉన్న రిటైరింగ్ రూంలు.. లేదా చివరకు డార్మిటరీలో ఒక బెడ్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 12 గంటలు, గరిష్ఠంగా 48 గంటలకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.