ఇన్నాళ్లూ రైలు టికెట్లు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇక మీదట రైల్వే స్టేషన్లలో ఉండే రిటైరింగ్ రూంలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే కృషిలో భాగంగా ఐఆర్సీటీసీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. టికెట్ కన్ఫర్మ్ అయినా లేదా ఆర్ఏసీలో ఉన్నా సరే.. రిటైరింగ్ రూంను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కౌంటర్లలో తీసుకున్నా లేదా ఈ టికెట్ తీసుకున్నా కూడా ఈ సదుపాయం ఉంటుంది.
ప్రస్తుతానికి కేవలం ముంబైలోని సీఎస్టీ స్టేషన్లో ఉన్న రిటైరింగ్ రూంలకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాలతో పాటు దేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలన్నింటికీ ఈ సదుపాయాన్ని త్వరలోనే విస్తరిస్తారు. నేరుగా ఐఆర్సీటీసీ సైట్ నుంచి లేదా రైల్టూరిజంఇండియా.కామ్ అనే సైట్ నుంచి వీటిని బుక్ చేసుకోవచ్చు. రాత్రి 11.30 నుంచి 12.30 మధ్య మినహా రోజులో 23 గంటలూ రిటైరింగ్ రూంలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. సింగిల్ బెడ్ లేదా డబుల్ బెడ్ ఉన్న రిటైరింగ్ రూంలు.. లేదా చివరకు డార్మిటరీలో ఒక బెడ్ను కూడా బుక్ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 12 గంటలు, గరిష్ఠంగా 48 గంటలకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రైల్వే రిటైరింగ్ రూంలకూ ఆన్లైన్ బుకింగ్!
Published Fri, Jan 17 2014 7:06 PM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement