
ఢిల్లీలోని రాష్ట్రపతి భవనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనం దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని నిర్మాణం 1912లో ప్రారంభమై, 1929లో పూర్తయింది. ప్రముఖ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ ఈ భవనానికి రూపకల్పన చేశారు.
రాష్ట్రపతి భవనంలో 340 గదులు ఉన్నాయి. ఈ గదులలో హిమాలయ బెడ్‌రూమ్ అద్భుతమైన లగ్జరీ బెడ్‌రూమ్‌గా గుర్తింపు పొందింది. లోపల ఒక పాఠశాల కూడా ఉంది. దీనిని తొలుత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ అని పిలిచేవారు. ఇది 1946లో నిర్మితమయ్యింది. 1962లో కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది.
2019లో ఢిల్లీ ప్రభుత్వం దీనిని కేంద్రీయ విద్యాలయంగా మార్చింది. నాటి నుండి దీనిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం అని పిలుస్తున్నారు. మిగిలిన కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రపతి భవనంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.