
న్యూఢిల్లీ: దేశంలో కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే జడ్జీల సంఖ్య కంటే అక్కడ ఉన్న గదుల సంఖ్య తక్కువ ఉన్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. జిల్లా కోర్టులు, వాటి అధీనంలో పనిచేసే(సబ్ ఆర్డినేట్) కోర్టుల్లో జడ్జీలు, గదుల సంఖ్యలను సమం చేస్తే దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగవుతుందని అభిప్రాయపడింది. దేశంలో మొత్తం 17,576 కోర్టు రూమ్‌లు, 14,363 రెసిడెన్షియల్ యూనిట్లు ఉండగా.. జడ్జీల సంఖ్య 22,288 ఉందని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు నివేదిక ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment