న్యూఢిల్లీ: టికెట్ రిజర్వేషన్ల ఫారంలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ‘టీ’ ఆప్షన్‌ను రైల్వే బోర్డు అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం రిజర్వేషన్ ఫారాల్లో సవరణలు చేసి ‘ఎం’ (పురుషులు), ‘ఎఫ్’ (స్త్రీలు)తోపాటు ‘టీ’ (ట్రాన్స్‌జెండర్) ఆప్షన్‌ను చేర్చనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జోన్లకు రైల్వే బోర్డు లేఖ రాసింది. టికెట్ బుకింగ్, రద్దు ఫారాల్లో ట్రాన్స్‌జెండర్ ఆప్షన్‌ను పొందుపరచాలంది.
అంతేగాకుండా సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేయాలని ఆదేశించింది. అన్ని దరఖాస్తుల్లో ‘థర్డ్ జెండర్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేయాలని 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పాస్‌పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు ఫారాల్లో ‘టీజీ’ (థర్డ్ జెండర్), ‘టీ’ (ట్రాన్స్‌జెండర్) ఆప్షన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment