బంగ్లాదేశ్‌లో విద్యార్థుల రిజర్వేషన్ ఆందోళలను అదుపుచేసేందుకు ఆ దేశ ప్రధానిషేక్ హసీనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, కాలేజీ ప్రిన్సిపాళ్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అయితే విద్యార్థి ఉద్యమ నాయకులు ఈ చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించారు. పీఎం హసీనా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వ్ చేసే కోటా వ్యవస్థను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో ఇటీవల పోలీసులు- విద్యార్థి నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలను చోటుచేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రధాని సమావేశమయ్యారని పీఎంవో ప్రతినిధి తెలిపారు. శనివారం రాత్రి 8:15 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.
దీనిముందు పీఎం హసీనా వివిధ విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడుతూ ఈ విషయంలో చర్చల కోసం ఎవరైనా తన వద్దకు రావచ్చని, విద్యార్థులు తమ తల్లిండ్రులను కూడా తీసుకుని రావచ్చన్నారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని విద్యార్థి ఉద్యమ నేతలు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment