ఉగ్రనేతను అప్పగించిన బంగ్లా ప్రధానికి ధన్యవాదాలు:మోదీ
న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్(ఉల్ఫా) అగ్రనేత అనుప్ చెతియాను భారత్కు అప్పగించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యావాదాలు తెలిపారు. ఉల్ఫా అగ్రనేత అనుప్ చెతియాను భారత్కు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజీజు నేటి ఉదయం వెల్లడించారు.
ఈ విషయంపై స్పందించిన మోదీ... ఉగ్రనేతను విచారించి చాలా కేసులను పరిష్కరించడానికి అవకాశం లభించిందని పేర్కొన్నారు. కేంద్ర అధికారులు, అసోం పోలీసులు అతడి కేసులపై దర్యాప్తు కొనసాగిస్తారని మరిన్ని విషయాలను మోదీ, కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించాయి.భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలు, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి చెతియాపై కేసులు నమోదయ్యాయి. ఉల్ఫా వ్యవస్థాపకులలో ఒకడైన చెతియాను బంగ్లాదేశ్ పోలీసులు 1977లో అరెస్టు చేసిన విషయం విదితమే.