ULFA
-
అసోంలో ఇక శాంతి పవనాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు. ఏమిటీ ఉల్ఫా? ‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్‌తో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్‌ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్‌ఖోవా వర్గం 2011 సెపె్టంబర్ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురి మృతి
గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకువెళ్లిన దుండగులు... ఒకరి తర్వాత ఒకరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వారి శవాలను అక్కడే పడేశారు. అసోం వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా భావిస్తున్నారు. కాగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, ఈ విషయం గురించి అసోం సీఎంతో మాట్లాడానని పేర్కొన్నారు. ఎన్ఆర్సీ ప్రతిఫలమేనా? ‘ఇది చాలా భయాందోళన కలిగించే అంశం. ఈ పాశవిక హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్ఆర్సీ (భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) అభివృద్ధి ఫలితం ఇదేనా’ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా సిలిగురి, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. (చదవండి : అసోంలో ఏం జరుగుతోంది) Terrible news coming out of Assam. We strongly condemn the brutal attack in Tinsukia and the killing of Shyamlal Biswas, Ananta Biswas, Abhinash Biswas, Subodh Das. Is this the outcome of recent NRC development ? 1/2 — Mamata Banerjee (@MamataOfficial) November 1, 2018 -
'కోటి రూపాయల కోసం కిడ్నాప్ చేయలేదు'
గువాహటి: డబ్బు కోసం బీజేపీ నేత కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు వచ్చిన వార్తలను ఉల్ఫా తీవ్రవాద సంస్థ తోసిపుచ్చింది. తమ సమాచారం సైన్యానికి అందిస్తున్నందునే అతడిని కిడ్నాప్ చేశామని ఉల్ఫా చీఫ్ పరేశ్ బారువా వెల్లడించారు. టిన్సుకియా జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రత్నేశ్వర్ మోరన్ కొడుకు, బీజేపీ ఎమ్మెల్యే బొలిన్ చెటియా సమీప బంధువు అయిన కుల్దీప్ మోరన్ను ఈ నెల 1న ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిచిపెట్టేందుకు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాము డబ్బు డిమాండ్ చేయలేదని బారువా తెలిపారు. తమ గురించి సైన్యానికి కుల్దీప్ సమాచారం అందించడంతో తమ సంస్థకు చెందిన చాలా మందిని కోల్పోవలసి వచ్చిందని వెల్లడించారు. 'కుల్దీప్ క్షేమంగా ఉన్నాడు. ఆర్మీని ఇన్ఫార్మర్ అనే కారణంతో అతడిని కిడ్నాప్ చేశాం. మా కోర్టులో అతడిపై విచారణ జరుపుతాం. నిరపరాధి అని తేలితే అతడిని విడిచిపెడతామ'ని బారువా తెలిపారు. -
అసోం బీజేపీ నేత కొడుకు కిడ్నాప్
గువహాటి: అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు బీజేపీ నేత కొడుకుని కిడ్నాప్ చేశారు. బందీని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని, లేకుంటే హతమారుస్తామని హెచ్చరించారు. టిన్సుకియా జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రత్నేశ్వర్ మోరన్ కొడుకు, బీజేపీ ఎమ్మెల్యే బొలిన్ చెటియా సమీప బంధువు అయిన కుల్దీప్ మోరన్ను ఈ నెల 1న ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే బొలిన్ నుంచి డబ్బులు తీసుకుని తమకు చేర్చాల్సందిగా తీవ్రవాదులు రత్నేశ్వర్ను డిమాండ్ చేశారు. కుల్దీప్ బంధువులు తొలుత ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నా, ఉల్ఫా తీవ్రవాదులు ఇటీవల పంపిన మరో వీడియో చూసి భయపడిపోయారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తన ప్రాణాలను కాపాడాలని, తీవ్రవాదుల డిమాండ్ మేరకు డబ్బులు ఇచ్చి తనను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కుల్దీప్ కుటుంబ సభ్యులను, ముఖ్యమంత్రి సోనోవాల్‌ను కోరాడు. ఈ వీడియాలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సాయుధులు కుల్దీప్ చట్టూ నిల్చున్నారు. తీవ్రవాదుల చెర నుంచి కుల్దీప్ను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బొలిన్ చెప్పారు. కాగా కుల్దీప్ను విడిపించేందుకు అసోం పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బొలిన్తో ఎక్కువ సన్నిహితంగా ఉండే కుల్దీప్ ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బొలిన్ సాదియా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న బొలిన్, రత్నేశ్వర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. -
’ఉల్పా’నేత అనూప్ చెతియ విదుదల
-
ఉగ్రనేతను అప్పగించిన బంగ్లా ప్రధానికి ధన్యవాదాలు:మోదీ
న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్(ఉల్ఫా) అగ్రనేత అనుప్ చెతియాను భారత్‌కు అప్పగించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యావాదాలు తెలిపారు. ఉల్ఫా అగ్రనేత అనుప్ చెతియాను భారత్‌కు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజీజు నేటి ఉదయం వెల్లడించారు. ఈ విషయంపై స్పందించిన మోదీ... ఉగ్రనేతను విచారించి చాలా కేసులను పరిష్కరించడానికి అవకాశం లభించిందని పేర్కొన్నారు. కేంద్ర అధికారులు, అసోం పోలీసులు అతడి కేసులపై దర్యాప్తు కొనసాగిస్తారని మరిన్ని విషయాలను మోదీ, కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించాయి.భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలు, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి చెతియాపై కేసులు నమోదయ్యాయి. ఉల్ఫా వ్యవస్థాపకులలో ఒకడైన చెతియాను బంగ్లాదేశ్ పోలీసులు 1977లో అరెస్టు చేసిన విషయం విదితమే. -
ఉల్ఫా నేత పరేశ్ బారువాకు మరణశిక్ష!
2004 అయుధాల అక్రమ రవాణా కేసులో ఉల్ఫా ఫ్యాక్షన్ నేత పరేశ్ బారువాకు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ కేసులో మరో 13 మందికి మరణశిక్ష అమలు చేయాలని హైకోర్టు డివిజన్ అనుమతితో కోర్టు ఆదేశించింది. మరణ శిక్ష విధించిన వారిలో జమాత్ చీఫ్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మోతీర్ రాహ్మన్ నిజామీ, హోంమంత్రి లుత్పోజమాన్ బాబర్ కూడా ఉన్నారు. పది ట్రక్కుల ఆయుధాలను అక్రమంగా తరలిస్తుండగా కర్నఫులి నది వద్ద చిట్టగాంగ్ యూరియ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సమీపంలో పట్టుకుని 4930 అత్యాధునిక ఆయుధాలు, 840 రాకెట్ లాంచర్లు, 300 రాకెట్లను, 27020 గ్రెనేడ్స్, 2 వేల గ్రేనేడ్ లాంచిగ్ ట్యూబ్, 6392 మ్యాగజైన్స్, 11.41 మిలియన్ల బుల్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం బంగ్లాదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈకేసులో ప్రధాన నిందితులైన బారువా, మాజీ పరిశ్రమల కార్యదర్శి నురుల్ అమిన్ లు ఇప్పటి వరకు పోలీసులకు పట్టుపడకుండా అజ్గాతంలో ఉన్నారు.