అసోం బీజేపీ నేత కొడుకు కిడ్నాప్ | ULFA abducts Assam BJP leader's son, demands Rs 1 crore | Sakshi
Sakshi News home page

అసోం బీజేపీ నేత కొడుకు కిడ్నాప్

Published Mon, Aug 22 2016 4:19 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

అసోం బీజేపీ నేత కొడుకు కిడ్నాప్ - Sakshi

అసోం బీజేపీ నేత కొడుకు కిడ్నాప్

గువహాటి: అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు బీజేపీ నేత కొడుకుని కిడ్నాప్ చేశారు. బందీని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని, లేకుంటే హతమారుస్తామని హెచ్చరించారు.

టిన్​సుకియా జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రత్నేశ్వర్ మోరన్ కొడుకు, బీజేపీ ఎమ్మెల్యే బొలిన్ చెటియా సమీప బంధువు అయిన కుల్దీప్ మోరన్​ను ఈ నెల 1న ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే బొలిన్ నుంచి డబ్బులు తీసుకుని తమకు చేర్చాల్సందిగా తీవ్రవాదులు రత్నేశ్వర్​ను డిమాండ్ చేశారు. కుల్దీప్ బంధువులు తొలుత ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నా, ఉల్ఫా తీవ్రవాదులు ఇటీవల పంపిన మరో వీడియో చూసి భయపడిపోయారు. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుని తన ప్రాణాలను కాపాడాలని, తీవ్రవాదుల డిమాండ్ మేరకు డబ్బులు ఇచ్చి తనను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కుల్దీప్ కుటుంబ సభ్యులను, ముఖ్యమంత్రి సోనోవాల్​ను కోరాడు. ఈ వీడియాలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సాయుధులు  కుల్దీప్ చట్టూ నిల్చున్నారు. తీవ్రవాదుల చెర నుంచి కుల్దీప్​ను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బొలిన్ చెప్పారు. కాగా కుల్దీప్​ను విడిపించేందుకు అసోం పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు.


బొలిన్​తో ఎక్కువ సన్నిహితంగా ఉండే కుల్దీప్ ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బొలిన్ సాదియా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్​లో ఉన్న బొలిన్, రత్నేశ్వర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement