యువకుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు (కర్టెసీ : న్యూస్18)
గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకువెళ్లిన దుండగులు... ఒకరి తర్వాత ఒకరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వారి శవాలను అక్కడే పడేశారు. అసోం వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా భావిస్తున్నారు.
కాగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, ఈ విషయం గురించి అసోం సీఎంతో మాట్లాడానని పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌సీ ప్రతిఫలమేనా?
‘ఇది చాలా భయాందోళన కలిగించే అంశం. ఈ పాశవిక హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్‌ఆర్‌సీ (భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) అభివృద్ధి ఫలితం ఇదేనా’ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా సిలిగురి, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. (చదవండి : అసోంలో ఏం జరుగుతోంది)
Terrible news coming out of Assam. We strongly condemn the brutal attack in Tinsukia and the killing of Shyamlal Biswas, Ananta Biswas, Abhinash Biswas, Subodh Das. Is this the outcome of recent NRC development ? 1/2
— Mamata Banerjee (@MamataOfficial) November 1, 2018
Comments
Please login to add a commentAdd a comment