
ఢాకా: రెండ దశాబ్దాల క్రితం ఇస్లామిక్ మిలిటెంట్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను హతమార్చేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తాజాగా బహిర్గతమైంది.. ఆమెను వారు తూటాలతో కాల్చేందుకు సిద్ధమయ్యారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ కోర్టు మంగళవారం తెలిపింది. 14 మంది మిలిటెంట్ల మరణ వాంగ్మూలంలో ఈ విషయం తెలిసినట్లు కోర్టు పేర్కొంది. ఆ మిలిటెంట్లను కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా ప్రధాని హత్యకు వేసిన ప్రణాళికను ఢాకా కోర్టు న్యాయవాది అబు జఫర్ ఎండీ కమ్రుజ్జమన్ వివరించారు.
గోపాల్‌గంజ్ నైరుతి నియోజకవర్గంలోని కోటాలిపార ప్రాంతంలో ఉన్న మైదానంలో జూలై 21, 2000లో 76 కిలోల భారీ బాంబు అమర్చేందుకు ప్లాన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని హసీనా ఆ మైదానానికి వస్తారని గుర్తించి బాంబు పెట్టేందుకు హర్కాతుల్ జిహాద్ బంగ్లాదేశ్ (హజీ బీ) సంస్థ ప్రయత్నాలు చేసింది. ఈ కుట్రలో మొత్తం 14 మంది పాత్ర ఉందని తెలిపింది. వారిని ఉరి తీసే క్రమంలో ఈ విషయాన్ని తెలిపారని న్యాయమూర్తి కమ్రుజ్జమన్ తెలిపారు.
చదవండి: పార్లమెంట్‌లో రాసలీలలు.. డెస్క్‌లు, టేబుళ్ల చాటుగా
చదవండి: నిజమైన భారతీయులను రక్షిస్తాం
Comments
Please login to add a commentAdd a comment