
న్యూఢిల్లీ: ఉల్లిపాయల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు సెగ తగులుతోంది. వంటలో ఉల్లిపాయ వేయవద్దంటూ తన వంటమనిషికి సూచించానంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్–బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో ఆమె పాల్గొన్నారు. ‘మీరు (భారత్) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది.
భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి’ అంటూ హసీనా వ్యాఖ్యానించారు. భారత్, చైనా వంటి దేశాల మధ్య ఉండటం వల్ల తమ దేశంలో పెట్టుబ డులు లాభదాయకమని తెలిపారు. అనంతరం వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యా పారం జరిగే పలు ఉమ్మడి అంశాలు ఉన్నాయని తెలిపారు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment