Onion exports
-
ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ ఏడాది మే నెలలో ఆ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అదే సమయంలో టన్ను ఉల్లి ఎగుమతికి 550 డాలర్లు(రూ.46 వేలు) కనీస ధరను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు ఉల్లిని విదేశాలకు అమ్మకూడదు. దాంతో ఎగుమతులు తగ్గి దేశీయంగా ధరలు పెరగకుండా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జూన్‌లో ఉల్లి ఎగుమతులు 50 శాతానికి పైగా పడిపోయాయి. 2024-25 ఏడాదికిగాను జులై 31, 2024 వరకు 2.60 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 17.17 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు.ఇదీ చదవండి: వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదంమహారాష్ట్రలోని నాసిక్‌లో దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఉంది. ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి స్థానికంగా ఓట్లు తగ్గిపోవడం కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్న ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఎలక్షన్ ఎఫెక్ట్.. ఉల్లి ఎగుమతులకు మళ్ళీ బ్రేక్
2023 డిసెంబర్లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ 'ఉల్లి' ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని మరింత పొడిగించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎగుమతి ఆంక్షలు అమలులోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పైగా తగ్గాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చినా ఎగుమతులు నిషేదించడం సమంజసం కాదని వెల్లడించారు. అతిపెద్ద ఉల్లి ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో 100 కేజీల ఉల్లి ధరలు 2023 డిసెంబర్లో రూ.4,500 వద్ద ఉండేవి. నేడు ఆ ధరలు 1200 రూపాయలకు పడిపోయాయని వ్యాపార సంఘాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉల్లి కోసం భారతదేశంపై ఆధారపడి ఉన్నాయి. భారత్ ఉల్లి ఎగుమతులను నిషేధించడం వల్ల ఆ దేశాల్లో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆసియా దేశాల మొత్తం ఉల్లిపాయల దిగుమతుల్లో సగానికి పైగా వాటా భారతదేశానిదే కావడం గమనార్హం. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసినట్లు సమాచారం. -
ఉల్లి ఘాటు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మళ్లీ ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. నెల రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లి సాగు గణనీయంగా చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో పంటలు దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే నెల రోజుల కిందటితో పోలిస్తే ధర రెట్టింపయ్యింది. కిలో రూ.40 మేర పలుకుతోంది. పొరుగు నుంచి రావాల్సిన సరఫరా సగానికి తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో విదేశాలకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఉల్లి ధరల నియంత్రణకు అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. పంట నష్టంతో పెరిగిన ధరలు.. రాష్ట్రంలో ఉల్లి పంటల సాగు తక్కువే. ఆలంపూర్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోనే సాగు ఎక్కువ. ఇవి రాష్ట్ర అవసరాలు తీర్చే అవకాశం లేకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి దిగుమతి అయ్యే ఉల్లిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటోంది. గత ఏడాది వర్షాలకు పంట దెబ్బతినడంతో దేశ వ్యాప్తంగా కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. తెలంగాణలో గరిష్టంగా రూ.170కి విక్రయాలు జరిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడం, యాసంగిలో ఉల్లి సాగు గణనీయంగా పెరగడంతో ధరల నియంత్రణ సాధ్యమైంది. దేశంలో లాక్డౌన్ విధించే నాటికి కిలో ఉల్లి ధర రూ.10–15కి మధ్యకి చేరింది. లాక్డౌన్ సమయంలోనూ కూరగాయల ధరలు పెరిగినా ఉల్లి ధర మాత్రం కిలో రూ.20 దాటలేదు. అయితే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో.. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలు మళ్లీ దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్లో కిలో రూ.15–20 పలికిన ధర ప్రస్తుతం రూ.35–40కి చేరింది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా క్రమంగా తగ్గుతోంది. ఈ నెల 7న పొరుగు నుంచి 5,479 క్వింటాళ్ల గ్రేడ్–1 ఉల్లి్ల బోయిన్ పల్లి మార్కెట్‌కు రాగా, అది 12వ తేదీ నాటికి 3,424 క్వింటాళ్లు, 14న 2,835 క్వింటాళ్లు, 15న మంగళవారం 2,400 క్వింటాళ్లకు తగ్గింది. ఇక, రాష్ట్రీయంగా వచ్చే గ్రేడ్–2 ఉల్లి సైతం ఈ నెల 7న 8,719 క్వింటాళ్ల మేర రాగా, అది 12న 5,136, 14 నాటికి 4,252, 15న 1,600 క్వింటాళ్లకు పడిపోయింది. 15 రోజుల కిందట గ్రేడ్–1 ఉల్లి ధర హోల్‌సేల్‌లో క్వింటాల్‌కు రూ.1300–1500 ఉండగా, అది ఇప్పుడు రూ.30వేలకు చేరింది. మంగళవారం బోయిన్ పల్లిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మేలు రకం ఉల్లి ఏకంగా క్వింటాకు రూ.3,600 పలికింది. రాష్ట్రీయంగా వస్తున్న ఉల్లి సైతం ఈ నెల ఒకటిన హోల్‌సేల్‌లో క్వింటాకు రూ.700–800 ఉండగా, అది ఇప్పుడు రూ.2000కు చేరింది. ఈ ధరలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో ధర కిలో రూ.20 నుంచి రూ.40కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రానికి సరఫరా తగ్గుతున్న క్రమంలో ధరల్లో పెరుగుదల ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎగుమతులపై నిషేధం.. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం గత ఏడాది మాదిరి ధరలు పెరగకుండా నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్టీ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్, శ్రీలంకలకు ఉల్లి ఎగుమతులు తక్షణమే నిలిచిపోతున్నాయి. ఇక ధరల పెరుగుదలను బట్టి ఉల్లి నిల్వలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ధరలు భారీగా పెరిగితే వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు 50 వేల టన్నుల బఫర్ స్టాక్‌ను కేంద్రం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచే అవకాశాలను పరిశీలిస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. -
ఉల్లి రైతులకు ఊరట
సాక్షి, అమరావతి: కేపీ ఉల్లి ఎగుమతుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై తీసుకువచ్చిన వత్తిడి ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల ఉల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చుతోంది. కేవలం విదేశాలకు ఎగుమతి చేయడానికి వైఎస్సార్ జిల్లాలోని రైతులు చిన్నసైజు రకం ఉల్లిని సాగు చేస్తే.. అప్పట్లో కేంద్రం ఎగుమతులపై విధించిన నిషేధం ఈ రైతుల పాలిట శాపంగా మారింది. వారి కష్టాలను వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను పలుమార్లు కలిసి వివరించారు. ఒక్క కేపీ ఉల్లి గురించే కాకుండా ఎగుమతుల నిషేధం వలన ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించారు. తొలుత కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతి ఇచ్చిన కేంద్ర మంత్రి ఈ నెల 15న దేశంలోని అన్ని రకాల ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి రైతుల సమస్య ఇలా... - గత నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశంలో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగాయి. - కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసి, నాఫెడ్ ద్వారా రాష్ట్రాలకు సరఫరా చేసింది. - స్ధానిక అవసరాలకు మించి దిగుబడులు రావడంతో ధరలు పడిపోయాయి. హోల్‌సేల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.15 నుంచి రూ.18 మించి పలకడంలేదు. - కొన్ని నగరాల్లో కిలో రూ.150 నుంచి రూ.170 వరకు దర పలికింది. - ధరల తీరును గమనించిన రైతులు రబీలో భారీగా ఉల్లి సాగు చేశారు. - ఈ ధర మరింత పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్ధితులు ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ గుర్తించి నివేదిక ఇచ్చింది. - ఇదే విషయాలతో పాటు ఐదేళ్లుగా నష్టపోతున్న కేపీ ఉల్లి రైతుల విషయాలను వైఎస్సార్సీపీ ఎంపీలు పలుమార్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. - తక్షణం ఎగుమతులకు అనుమతి ఇస్తే ధరలు పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. - ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొదట కేపీ ఉల్లి ఎగుమతులకు అంగీకరించింది. ఆ తర్వాత మిగిలిన ఉల్లి విషయంలోనూ సానుకూలంగా స్పందించింది. - మహారాష్ట్ర, కర్ణాటక ఉల్లి ప్రధానంగా ఎగుమతులకు వెళుతుంది. దాని వల్ల మన రాష్ట్రంలోని ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. -
కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ/ఒంగోలు సిటీ/పట్నంబజారు(గుంటూరు): కృష్ణాపురం (కేపీ) రకం ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఒకటి, రెండు రోజుల్లో తొలగిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల్లో రైతులు కేపీ రకం ఉల్లిపాయలను దాదాపు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నారు. హాంకాంగ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలు కేపీ ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. దురదృష్టవశాత్తు గత ఏడాది సెప్టెంబర్‌లో కేపీ రకం ఉల్లితో సహా ఉల్లిపాయల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించడం వల్ల కేపీ ఉల్లి సాగుచేస్తున్న వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు ఈ రకం ఉల్లిని దేశీయ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. కేపీ ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి పనికి రాదు. అందువల్ల చేతికొచ్చిన పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కేపీ ఉల్లి పండించే రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రోజ్ ఆనియన్ పేరుతో ఇదే రకం ఉల్లిని కర్ణాటక రైతులు సాగుచేస్తున్నారు. ఆ ఉల్లిని ఎగుమతి చేయడానికి అనుమతించిన కేంద్రం కేపీ ఉల్లి ఎగుమతులకు మాత్రం అనుమతించకపోవడం న్యాయం కాదు. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తక్షణమే తొలగించాలి..’ అని వాణిజ్య శాఖ మంత్రి గోయల్‌ను అభ్యర్థించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇది చాలా ప్రధానమైన సమస్య అని అంగీకరించారు. ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటుందని సభా ముఖంగా హామీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇవ్వలేం: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారినపడి డయాలసిస్ చేయించుకుంటున్న నిరుపేదలకు ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే అవకాశం లేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. అలాంటి పేషెంట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నెలకు రూ. 10 వేల చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని అన్నారు. వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. నిరుపేదలైన దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని 13 జిల్లాల్లో 35 కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. వి.విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న అడుగుతూ.. ‘ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడ పరిశోధనా కేంద్రంతోపాటు 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆరోగ్య మంత్రికి తెలుసు. కాబట్టి ఉద్దానం ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజీతోపాటు పలాసలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టే అంశాన్ని కేంద్రం పరిశీలించాలి..’ అని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రూ. 2,527 కోట్ల మేర జీఎస్టీ ఎగవేత జూలైలో జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 2019 వరకు వ్యాపారుల నుంచి వినియోగదారులకు జరిగిన సరఫరాల్లో రూ. 2,527 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఎంపీ గల్లా నేరప్రవృత్తి ఉన్న ముఠాతో వచ్చారు తన మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని, తన ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లిందంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు నేర ప్రవృత్తి ఉన్న ముఠాతో పాటు గల్లా జయదేవ్ అసెంబ్లీ ప్రాంతానికి వచ్చారని ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ గల్లా జయదేవ్ అసెంబ్లీ ఏరియాలోకి వెళ్లాలని భావించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుందన్నారు. అసెంబ్లీ సభ్యుల భద్రత కోసం మాత్రమే పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అంతకుముందు గల్లా జయదేవ్ మాట్లాడుతూ తన మానవ హక్కులకు, ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లిందన్నారు. జనవరి 20న అసెంబ్లీ జరుగుతున్న వేళ అమరావతి జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని, తన నియోజకవర్గ పరిధిలో ఉన్నందున వారికి మద్దతుగా తాను అందులో పాల్గొన్నానని చెప్పారు. అసెంబ్లీకి వెళ్లేసరికి పోలీసులు తమపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారన్నారు. బాధ్యత పట్టని కంపెనీలపై తీసుకుంటున్న చర్యలేంటి? దేశంలోని వివిధ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్) చేసుకున్న ఒప్పందాల ప్రకారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వినియోగం, ప్రభుత్వ పర్యవేక్షణ, పథకాల కేటాయింపు, వాటి అతిక్రమణలపై తీసుకుంటున్న చర్యల గురించి మాగుంట శ్రీనివాసులురెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. ఈ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేశంలోని కంపెనీలు 2015–16లో రూ.14,517 కోట్లు, 2016–17లో రూ.14,329 కోట్లు, 2017–18లో రూ.13,620 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఏపీలో 2015–16లో రూ.1,294 కోట్లు, 2016–17లో రూ.753 కోట్లు, 2017–18లో రూ.269 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సీఎస్ఆర్ కమిటీ సిఫార్సులను అనుసరించి అన్ని విషయాలనూ బోర్డు చూసుకుంటుందని వివరించారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద ఏపీకి రూ.19 కోట్లు జాతీయ ఆయుష్ మిషన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కి రూ.19.01 కోట్లు ఆర్థిక సహాయంగా అందించినట్లు ఆయుష్ శాఖల మంత్రి శ్ర్రీపాద యశోనాయక్ చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆయుష్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ. 363.73 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పురుగు మందుల వాడకం పరిమిత స్థాయిలోనే ఉంది వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోంది?, ఆంధ్రప్రదేశ్‌లో పరిమితికి మించి పురుగుమందుల వాడకం ఉందా? అంటూ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ బదులిస్తూ.. రసాయనాల వాడకం పరిమిత స్థాయిలోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వ్యవసాయ రంగంలో రసాయన, పురుగు మందుల వాడకంపై పలు ప్రశ్నలు అడిగారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చింది. ఏపీలో నాలుగు నగరాల్లో 266 విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఫేమ్ ఇండియా పథకం రెండో దశ కింద ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు 92, విశాఖపట్నానికి 71, తిరుపతికి 68, కాకినాడకు 35 చొప్పున విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 62 నగరాల్లో 2,636 విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణ్ణంరాజు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, మిథున్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి 106 ప్రతిపాదనలు అందినట్లు చెప్పారు. 893 మెట్రిక్ టన్నుల విదేశీ ఉల్లి కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వివిధ రాష్ట్రాలకు మార్కెట్ రేట్ల ప్రకారం సరఫరా చేస్తోందని వినిమయ వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి దాన్వే రావ్‌సాహెబ్ దాదారావు లోక్‌సభకు తెలిపారు. ఈ ఏడాది జనవరి చివరినాటికి ఆంధ్రప్రదేశ్‌కు 893.18 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు111.68 మెట్రిక్ టన్నుల ఉల్లిని అందజేసినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కోటగిరి శ్రీధర్, రెడ్డప్ప, ఆదాల అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జనవరి చివరినాటికి కేంద్రం 2,600 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాష్ట్రాలకు అందించిందన్నారు. -
కృష్ణపురం ఉల్లి ఎగుమతులకు అనుమతి కల్పించండి
-
‘కేపీ ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలి’
న్యూఢిల్లీ : కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు. జీరో అవర్‌లో రైతు సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉందని తెలిపారు. తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వకపోతే ఉల్లి పాడయ్యే అవకాశం ఉందని.. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఉల్లి ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు పీయూష్ గోయల్‌కు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతిచ్చాలంటూ సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్పలు పీయూష్ గోయల్‌ను కలిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీరో అవర్‌లో రైతు సమస్యలపై ప్రసావిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక చర్యల వల్లే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. చదవండి : కేపీ ఉల్లి ఎగుమతులకు త్వరలోనే అనుమతి -
ఉల్లి ఎగుమతులకు బ్రేక్!
సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్) : వ్యాపార రిజిస్ట్రేషన్, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా ఉల్లి ఎగుమతి చేస్తున్న 20 లారీలను శుక్రవారం ఉదయం రాష్ట్ర సరిహద్దుల వద్ద అధికారులు నిలిపివేశారు. దీంతో ఉల్లి విక్రయాలకు ప్రధాన మార్కెట్లైన కర్నూలు, తాడేపల్లిగూడెంలో వ్యాపారులు శుక్రవారం లావాదేవీలను ఆకస్మికంగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడంతో దాదాపు 1,800 క్వింటాళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చర్చించిన మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఉల్లిలో సగం మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చని, మిగిలింది ఇక్కడే విక్రయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు సానుకూలంగా స్పందించారని, శనివారం నుంచి ఉల్లి కొనుగోళ్లు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. రాజస్ధాన్ నుంచి కూడా ఉల్లి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్వింటాల్ గరిష్టంగా రూ. 12,400 కర్నూలు మార్కెట్లో ఉదయం తొలుత అరగంట పాటు వేలంపాట నిర్వహించి 20 లాట్ల వరకు కొనుగోలు చేయగా క్వింటాల్ గరిష్టంగా రూ.12,400 పలికింది. సరిహద్దుల్లో ఉల్లి లారీలను నిలిపివేశారనే సమాచారంతో తర్వాత వేలంపాటను ఆపేశారు. విజిలెన్స్ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు మార్కెట్ యార్డుకు చేరుకుని ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఉల్లి కొరతను పరిష్కరించి ప్రజల సమస్యలు నివారించేందుకు మార్కెటింగ్‌శాఖ వ్యాపారులతో పోటీపడి మార్కెట్లకు వస్తున్న ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ సీజన్లో కిలో రూ.45 నుంచి రూ.130 (గరిష్ట ధర) వరకు కొనుగోలు చేసి రాయితీపై కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తోంది. సెప్టెంబరు 27 నుంచి డిసెంబరు 5వతేదీ వరకు 25,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వినియోగిస్తోంది. కర్నూలు మార్కెట్లో 8 మంది వ్యాపారులు ఈ సీజన్లో ఇప్పటివరకు 2,02,262 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా 1,75,808 క్వింటాళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. -
ఉల్లి లేకుండా వంట వండు..
న్యూఢిల్లీ: ఉల్లిపాయల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు సెగ తగులుతోంది. వంటలో ఉల్లిపాయ వేయవద్దంటూ తన వంటమనిషికి సూచించానంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్–బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో ఆమె పాల్గొన్నారు. ‘మీరు (భారత్) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి’ అంటూ హసీనా వ్యాఖ్యానించారు. భారత్, చైనా వంటి దేశాల మధ్య ఉండటం వల్ల తమ దేశంలో పెట్టుబ డులు లాభదాయకమని తెలిపారు. అనంతరం వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యా పారం జరిగే పలు ఉమ్మడి అంశాలు ఉన్నాయని తెలిపారు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు. -
అక్రమ నిల్వలపై ఉక్కుపాదం
నిత్యావసరాల ధరల నియంత్రణ కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం రాష్ట్రాలకు అందుబాటులోకి మరో 50 లక్షల టన్నుల బియ్యం న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడంతో (మేలో 6.01 శాతం) నిత్యావసరాల ధరల కట్టడికి కేంద్రం మంగళవారం పలు చర్యలు చేపట్టింది. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే పండ్లు, కూరగాయల ధరలను నియంత్రించేందుకు వీలుగా వాటిని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల జాబితా నుంచి తొలగించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా బహిరంగ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది. మరోవైపు ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు వీలుగా వాటి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను టన్నుకు 300 డాలర్లుగా (సుమారు రూ. 18 వేలు) నిర్ణయించింది. ఆలుగడ్డల ఎగుమతులపైనా ఇదే రకమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు సూచించింది. బియ్యం ధరలను తగ్గించేందుకు మరో 50 లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ఏపీఎల్ ధర ప్రకారం కిలోకు రూ. 8.30 చొప్పున విక్రయించేందుకు రాష్ట్రాలకు విడుదల చేయాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం కట్టడిపై వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్, ఆహార మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీ ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రా తదితరులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అలాగే స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా తృణధాన్యాలు, వంటనూనెలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నేరుగా దిగుమతి చేసుకునేందుకు అనుమతించామన్నారు. 22 నిత్యావసర పదార్థాల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని జైట్లీ చెప్పారు. -
దేశ వ్యాప్తంగా భారీగా తగ్గిన ఉల్లి ఎగుమతులు
న్యూఢిల్లీ: ఉల్లి ఘాటును నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఉల్లి ఎగుమతులు గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సర 86 శాతం తగ్గినట్లు నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. ఉల్లి ధరపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఎగుమతులు భారీగా తగ్గినట్లు తెలిపింది. 2012 అక్టోబర్ కు 1,54,957 ఎగుమతులు జరగగా, ఈ ఏడాది అక్టోబర్ కు 19,218 టన్నుల ఎగుమతులు మాత్రమే జరిగాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధర 100 రూ. తాకడంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. దీంతో మొత్తం మీద ఇప్పటి వరకూ 22,000 టన్నుల ఉల్లి మాత్రమే ఎగుమతైంది. ఆగస్టు 14 వరకూ టన్ను ఉల్లికి యూఎస్ డీ 650గా ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం యూఎస్ డీ 900 వరకూ వెళ్లి, ఆపై 1,150 యూఎస్ డీని తాకింది. ప్రస్తుతం కిలో ధర 50-60 మధ్య ఉండటంతో వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించింది.