న్యూఢిల్లీ: ఉల్లి ఘాటును నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఉల్లి ఎగుమతులు గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సర 86 శాతం తగ్గినట్లు నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. ఉల్లి ధరపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఎగుమతులు భారీగా తగ్గినట్లు తెలిపింది. 2012 అక్టోబర్ కు 1,54,957 ఎగుమతులు జరగగా, ఈ ఏడాది అక్టోబర్ కు 19,218 టన్నుల ఎగుమతులు మాత్రమే జరిగాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధర 100 రూ. తాకడంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. దీంతో మొత్తం మీద ఇప్పటి వరకూ 22,000 టన్నుల ఉల్లి మాత్రమే ఎగుమతైంది.
ఆగస్టు 14 వరకూ టన్ను ఉల్లికి యూఎస్ డీ 650గా ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం యూఎస్ డీ 900 వరకూ వెళ్లి, ఆపై 1,150 యూఎస్ డీని తాకింది. ప్రస్తుతం కిలో ధర 50-60 మధ్య ఉండటంతో వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించింది.