bangladesh Prime Minister
-
Muhammad Yunus: రేపే బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది. -
G-20 Summit: బంగ్లా, మారిషస్ ప్రధానులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: జీ20 నేపథ్యంలో ఢిల్లీకి మొదటగా వచ్చిన నేతల్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఒకరు. ప్రధాని మోదీ మొట్టమొదటి సమావేశం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తోనే జరిగింది. గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ‘రెండు దేశాల నడుమ సంబంధాలు ఏర్పాటై 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫిన్‌టెక్, సాంస్కృతిక తదితర రంగాల్లో సహకారంపై చర్చించాం’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘భారత్ దార్శనిక కార్యక్రమం ‘సాగర్’లో మారిషస్ వ్యూహాత్మక కీలక భాగస్వామి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు’అని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాల్లో సహకారం విస్తృతం చేసుకునేందుకు, రెండు దేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. తాజాగా ప్రధాని హసీనాతో చర్చలు ఫలప్రదమయ్యాయని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కనెక్టివిటీ, సాంస్కృతిక రంగాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారని పీఎంవో తెలిపింది. -
దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వివరించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్‌కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: Tamim Iqbal Retirement: స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటన -
భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య గత 55 ఏళ్లుగా నిలిచిపోయిన రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాక్‌పై జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా విజయ్ దివస్ జరుపుకుంటున్న వేళ భారత్, బంగ్లాల మధ్య ఒప్పందాలు కుదరడం గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబీర్ రెహ్మాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రధానులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, ఇంధనం, టెక్స్టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటిపై ఒక అవగాహనకు వచ్చాయి. భారత్‌కు కృతజ్ఞతలు: హసీనా భారత్ తమకు అసలైన మిత్రదేశమని షేక్ హసీనా అన్నారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అండదండలు అందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
సీఏఏ అవసరం లేదు
దుబాయ్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) ఈ రెండూ భారత్ అంతర్గత వ్యవహారాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సీఏఏ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ‘సీఏఏ ఇప్పుడు చేయాల్సిన పని లేదు. మరి భారత ప్రభుత్వం ఎందుకు ఈ చట్టం చేసిందో అర్థం కావడం లేదు’’అని యూఏఈ రాజధాని అబూధాబిలో హసీనా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ నుంచి ఎలాంటి తిరుగు వలసలు లేవని, అయితే దేశంలో ప్రజలే బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సీఏఏకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన తర్వాత ముగ్గురు బంగ్లాదేశ్ మంత్రులు భారత పర్యటన రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్, పాక్, అప్ఘానిస్తాన్‌లో ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని వీలు కల్పించే ఈ చట్టంపై భారత్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
ఉల్లి లేకుండా వంట వండు..
న్యూఢిల్లీ: ఉల్లిపాయల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు సెగ తగులుతోంది. వంటలో ఉల్లిపాయ వేయవద్దంటూ తన వంటమనిషికి సూచించానంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్–బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో ఆమె పాల్గొన్నారు. ‘మీరు (భారత్) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి’ అంటూ హసీనా వ్యాఖ్యానించారు. భారత్, చైనా వంటి దేశాల మధ్య ఉండటం వల్ల తమ దేశంలో పెట్టుబ డులు లాభదాయకమని తెలిపారు. అనంతరం వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యా పారం జరిగే పలు ఉమ్మడి అంశాలు ఉన్నాయని తెలిపారు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు. -
అవామీలీగ్ అఖండ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ సాధించింది. 299 స్థానాలకు పోలింగ్ జరగగా అధికార అవామీలీగ్ 288 స్థానాల్లో విజయఢంఖా మోగించింది. ఈ మేరకు బంగ్లా ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ ఉద్దీన్ ఆహ్మద్ ప్రకటించారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నెషనలిస్ట్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. గోపాల్ గంజ్ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి. బంగ్లా ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయంసాధించిన హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆమెకు పలుదేశాల అధినేతలు అభినందనలు తెలుపుతున్నారు. Spoke to Sheikh Hasina Ji and congratulated her on the resounding victory in the Bangladesh elections. Wished her the very best for the tenure ahead. — Narendra Modi (@narendramodi) December 31, 2018 -
బంగ్లా: భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న అధికార పార్టీ
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ దిశగా సాగుతున్నట్లు తెలిసింది. 299 స్థానాలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కడపటి వార్తలందే సరికి అవామీ లీగ్ అభ్యర్థులు 90 చోట్ల, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అభ్యర్థులు మూడు చోట్ల గెలుపొందారు. మరోవైపు, ఫలితాల సరళిని బీఎన్పీ నాయకత్వంలోని విపక్ష కూటమి తోసిపుచ్చింది. అధికార పార్టీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని, తాత్కాలిక తటస్థ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు, పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. హసీనా రికార్డు విజయం.. అవామీ లీగ్ విజయం దాదాపు ఖాయమైనట్లేనని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. అవామీ లీగ్ మరో 62 చోట్ల, బీఎన్పీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. గోపాల్ గంజ్ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి. ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత హసీనా మాట్లాడుతూ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మంచి జీవితం బంగ్లాదేశ్ ప్రజలు మళ్లీ తమకు పట్టం గడతారని చెప్పారు. బీఎన్పీ అధినేత్రి ఖలేదా జియా జైలుకు వెళ్లడంతో పార్టీని ముందుండి నడిపించిన ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రూల్ ఇస్లాం థాకూర్‌గావ్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. మొత్తం 299 స్థానాల్లో 1,848 మంది పోటీచేశారు. అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదాపడింది. సోమవారం ఉదయానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. అవామీ లీగ్ గెలిస్తే షేక్ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని అవుతారు. మరోవైపు, అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలేదా జియా పాక్షిక పక్షవాతానికి లోనైన సంగతి తెలిసిందే. దీంతో తాజా ఫలితాలతో ఆమె క్రియాశీల రాజకీయ జీవితంపై సందిగ్ధం ఏర్పడింది. పెచ్చరిల్లిన హింస.. పోలింగ్ రోజున దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పోలీసు సహా 17 మంది మరణించారు. అధికార, ప్రతిపక్ష కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 13 మంది మృతిచెందగా, ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. విపక్ష కార్యకర్తల దాడిలో ఓ పోలీసు మృతిచెందాడు. మృతుల్లో ఎక్కువ మంది అవామీ లీగ్ కార్యకర్తలే ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. -
ఇందిరను చంపినట్లే చంపేద్దామని..
-
ఇందిరను చంపినట్లే చంపేద్దామని..
ఢాకా : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పెను ప్రమాదం తప్పింది. ఆమెను దారుణంగా హత్య చేసేందుకు ఆమె సెక్యూరిటీ గార్డ్స్ కుట్రలు చేశారు. ఒకప్పుడు ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీనే ఎలా హతమార్చిందో ఆ తీరుగానే హసీనాను చంపేయాలనుకున్నారు. అయితే, ముందస్తుగా తేరుకున్న నిఘా విభాగం ఆమెను ఈ ప్రమాదం నుంచి బయటపెట్టింది. తాజాగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. అక్కడి పోలీసులు, నిఘా వర్గాల సమాచారం ప్రకారం గత ఆగస్టు 24నే హసీనాను హత్య చేద్దామని అనుకున్నారు. మొత్తం నాలుగు నిఘా వర్గాలు ఈ ఇన్పుట్స్ అందించగా అందులో రెండు సంస్థలు బంగ్లావి కాగా.. మరో రెండు భారత్‌కు చెందిన నిఘా సంస్థలు ఈ వివరాలు అందించాయి. వాటి ప్రకారం హసీనా భద్రతను చూసుకునే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్)కు చెందిన ఆరు నుంచి ఏడుగురు గార్డ్స్ ఇందుకు ప్లాన్ చేశారు. ఆ రోజు సాయంత్రం హసీనా తన కార్యాలయంలో పనులు పూర్తి చేసుకొని బయటకు రాగానే ఆమెపై దాడి చేయాలని భావించారు. ఆ తర్వాత వారు పారిపోయేలా ఆ భవనం చుట్టు బాంబులు పేల్చి వేసి గందరగోళం సృష్టించి ఆ సమయంలో పరారవ్వాలని కూడా కుట్ర చేశారు. ఇదంతా కూడా జమాత్ ఉల్ ముజాహీదీన్(జేఎంబీ) ఉగ్రవాదులు ఎస్ఎస్ఎఫ్ గార్డులు కలసి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అయితే, భారత్, బంగ్లాదేశ్ నిఘా వర్గాల పరస్పర సహకారంతో జేఎంబీ, ఎస్ఎస్ఎఫ్ గార్డుల సంభాషణల గుట్టు తేల్చగలిగామని, కుట్రలు భగ్నం చేశామని తెలిపారు. ఇప్పటికే కొంతమంది గార్డులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మిగితా వారిని కూడా అదుపులోకి తీసుకొని ఈ కుట్రలో ఎవరి భాగస్వామ్యం ఉన్నవారెవ్వరినీ విడిచిపెట్టకుండా శిక్షిస్థామని తెలిపారు. -
ప్రధాని హత్యకు కుట్ర.. పది మందికి ఉరిశిక్ష
ఢాకా(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హత్యకు పథకం రచించారనే ఆరోపణలపై 10 మంది ఉగ్రవాదులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో వ్యక్తికి జీవిత ఖైదు, మరో 9 మందికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్‌గంజ్ జిల్లాలోని ఓ కాలేజీ మైదానంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి సభ ఏర్పాటు చేశారు. అయితే ఆమె ప్రసంగానికి ఒక రోజు ముందు ఉగ్రవాదులు సభ ప్రాంగణ సమీపంలో 76 కేజీల బాంబును అమర్చారు. పోలీసుల తనిఖీల్లో బాంబు బయటపడింది. దీంతో హసీనా హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హర్కత్ ఉల్ జీహాద్ అల్ ఇస్లామీ అధ్యక్షుడు ముప్తీ హన్నన్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించగా.. ఒకరు బెయిల్‌పై విడుదల అయ్యారు. మరో 15 మంది పరారీలో ఉన్నారు. ముఫ్తీ హన్నన్‌ను 2005లో అరెస్ట్ చేసి, 2017 ఏప్రిల్‌లో ఉరి తీశారు. బ్రిటీష్ హైకమిషనర్‌పై గ్రెనేడ్ దాడిలో ప్రధాన నిందితుడు హన్నన్. అంతేకాదు.. దేశవ్యాప్తంగా బాంబు దాడులకు పథక రచన చేసిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.