ఢాకా: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు.
రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment