ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోడీ తెరలేపిన శారీస్ (చీరల) సాంప్రదాయం నేతల్లో బలంగా నాటుకుపోయినట్టుంది. ఇప్పటికే భారత, పాకిస్తాన్ ప్రధానులు వారివారి తల్లులకు చీరలను పంపించి తమ విధేయతను ముందుగానే చాటుకున్నారు. మరి ఇప్పడు ఆ కోవలోకే మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆమె.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు క్రీమ్ కలర్ శారీని ఇచ్చారు. ఆ సమయంలో స్వరాజ్ ను హత్తుకున్న హసీనా తన సోదరి చీరను కొనితెచ్చిందని ఆనందంతో ఉబ్బితబ్బి అయిపోయింది.
అనంతరం సుష్మాకు బంగ్లాదేశ్ లో అత్యంత ఆదరణ ఉన్న జమ్ దానీ శారీని హసీనా కానుకగా ఇచ్చారు. ఇలా శారీలు ఇచ్చుపుచ్చుకుంటూ కొత్త సంప్రాదాయానికి శ్రీకారం చుట్టడం.. అది దేశాల మధ్య ఐక్యత పెంపొందడానికి ఉపయోగపడాలని ఆశిద్దాం.