సెయింట్ మారి్టన్ ద్వీపం, బంగాళాఖాతంపై పెత్తనం కోరింది
షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు
హింసాకాండ, మరణాలు చూడలేకే రాజీనామా చేశానని వెల్లడి
త్వరలో బంగ్లాదేశ్‌లో అడుగు పెడతానని ప్రకటన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తనను తప్పించడం వెనుక అమెరికా హస్తముందని చెప్పారు షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. సెయింట్ మారి్టన్ ద్వీపాన్ని, బంగ్లా సరిహద్దుల వెంబడి బంగాళాఖాతంపై పెత్తనాన్ని అప్పగించాలని అమెరికా కోరింది. అలా చేసి ఉంటే నా పదవికి ఢోకా ఉండేది కాదు’’ అన్నారు. బంగ్లా ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటి ఆ డిమాండ్లకు ఒప్పుకోనందుకే తనను దింపేసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు.
విద్యార్థుల శవాల మీదుగా అధికారం దక్కించుకోవాలని ప్రత్యర్థులు కుట్రలు చేశారని ఆరోపించారు. దేశంలో హింసాకాండను, మృతదేహాల ఊరేగింపులను చూడటం ఇష్టం లేకే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. భారత్‌లో తలదాచుకుంటున్న హసీనా తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా బంగ్లాదేశ్ ప్రజలకు సందేశం విడుదల చేశారు. దేశం వీడే ముందు దీన్ని ప్రజలందరికీ చదివి విని్పంచాలని భావించినా వీలు పడలేదన్నారు. కుట్రదారుల వలలో చిక్కుకోవద్దని బంగ్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, వారి ఆస్తుల విధ్వంసంపై ఆవేదన వ్యక్తంచేశారు. భగవంతుడి దయతో త్వరలో బంగ్లాదేశ్ చేరుకుంటానన్నారు.
అమాయక విద్యార్థులను రెచ్చగొట్టారు
విద్యార్థులను రజాకార్లుగా తానెప్పుడూ సంబోధించలేదని హసీనా తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టడానికి తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. అమెరికాపై హసీనా గతంలోనూ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుకు అనుమతిస్తే ఎన్నికల్లో ప్రధాని పదవి నిలబెట్టుకోవడానికి సహకరిస్తామంటూ ఓ దేశం ఆఫర్ ఇచి్చందని గత మేలో ఆమె వెల్లడించారు.
చీఫ్ జస్టిస్‌గా రెఫాత్ అహ్మద్
ఢాకా: బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సయ్యద్ రెఫాత్ అహ్మద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి నేతల డిమాండ్‌తో సీజే, ఐదుగురు న్యాయమూర్తులు శనివారం రాజీనామా చేయడం తెల్సిందే. దేశంలో అశాంతికి ఆజ్యం పోసే వదంతుల వ్యాప్తిపై యూనుస్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. వాటిని ప్రచారం చేసే, ప్రచురించే మీడియా సంస్థలను మూసేస్తామని హెచ్చరించింది.
హసీనా ఎలాంటి ప్రకటనా చేయలేదు: కుమారుడు
హసీనా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా విడుదల చేశారంటున్న ప్రకటన పూర్తిగా అవాస్తమని ఆమె కుమారుడు సాజిబ్ వాహెద్ జాయ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆమె చెప్పినట్టుగా వచి్చన ఆ కథనమంతా పూర్తిగా కట్టుకథ అని ఆరోపించారు. ‘‘దీనిపై నా తల్లితో మాట్లాడాను. బంగ్లాను వీడే ముందు గానీ, వీడాక గానీ ఏ పత్రికకూ తాను అలాంటి ప్రకటన విడుదల చేయలేదని ఆమె స్పష్టం చేశారు’’ అని తెలిపారు.
ఏమిటీ సెయింట్ మారి్టన్ ద్వీపం?
అమెరికాపై హసీనా ఆరోపణలతో సెయింట్ మారి్టన్ ద్వీపం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇది ఈశాన్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌కు చెందిన కాక్స్ బజార్–టెక్నాఫ్ ద్వీపకల్పానికి దక్షిణంది 9 కి.మీ. దూరంలో ఉంది. కేవలం 3 చదరపు కి.మీ. విస్తీర్ణముండే ఈ ద్వీపాన్ని బెంగాలీలో నారీకేళ్ (కొబ్బరి) ద్వీపమంటారు. ఇందులో 3,700 మంది నివసిస్తున్నారు. చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటల పెంపకం వారి వృత్తి. ఈ ద్వీపం వ్యూహాత్మకంగా అతి కీలక ప్రాంతంలో ఉంది. చైనాతో వైరం దృష్ట్యా భావి అవసరాల దృష్ట్యా ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment