Prime Minister Post
-
Sheikh Hasina: నాపై అమెరికా కుట్ర
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తనను తప్పించడం వెనుక అమెరికా హస్తముందని చెప్పారు షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. సెయింట్ మారి్టన్ ద్వీపాన్ని, బంగ్లా సరిహద్దుల వెంబడి బంగాళాఖాతంపై పెత్తనాన్ని అప్పగించాలని అమెరికా కోరింది. అలా చేసి ఉంటే నా పదవికి ఢోకా ఉండేది కాదు’’ అన్నారు. బంగ్లా ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటి ఆ డిమాండ్లకు ఒప్పుకోనందుకే తనను దింపేసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు. విద్యార్థుల శవాల మీదుగా అధికారం దక్కించుకోవాలని ప్రత్యర్థులు కుట్రలు చేశారని ఆరోపించారు. దేశంలో హింసాకాండను, మృతదేహాల ఊరేగింపులను చూడటం ఇష్టం లేకే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. భారత్‌లో తలదాచుకుంటున్న హసీనా తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా బంగ్లాదేశ్ ప్రజలకు సందేశం విడుదల చేశారు. దేశం వీడే ముందు దీన్ని ప్రజలందరికీ చదివి విని్పంచాలని భావించినా వీలు పడలేదన్నారు. కుట్రదారుల వలలో చిక్కుకోవద్దని బంగ్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, వారి ఆస్తుల విధ్వంసంపై ఆవేదన వ్యక్తంచేశారు. భగవంతుడి దయతో త్వరలో బంగ్లాదేశ్ చేరుకుంటానన్నారు.అమాయక విద్యార్థులను రెచ్చగొట్టారు విద్యార్థులను రజాకార్లుగా తానెప్పుడూ సంబోధించలేదని హసీనా తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టడానికి తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. అమెరికాపై హసీనా గతంలోనూ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుకు అనుమతిస్తే ఎన్నికల్లో ప్రధాని పదవి నిలబెట్టుకోవడానికి సహకరిస్తామంటూ ఓ దేశం ఆఫర్ ఇచి్చందని గత మేలో ఆమె వెల్లడించారు.చీఫ్ జస్టిస్‌గా రెఫాత్ అహ్మద్ ఢాకా: బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సయ్యద్ రెఫాత్ అహ్మద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి నేతల డిమాండ్‌తో సీజే, ఐదుగురు న్యాయమూర్తులు శనివారం రాజీనామా చేయడం తెల్సిందే. దేశంలో అశాంతికి ఆజ్యం పోసే వదంతుల వ్యాప్తిపై యూనుస్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. వాటిని ప్రచారం చేసే, ప్రచురించే మీడియా సంస్థలను మూసేస్తామని హెచ్చరించింది.హసీనా ఎలాంటి ప్రకటనా చేయలేదు: కుమారుడు హసీనా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా విడుదల చేశారంటున్న ప్రకటన పూర్తిగా అవాస్తమని ఆమె కుమారుడు సాజిబ్ వాహెద్ జాయ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆమె చెప్పినట్టుగా వచి్చన ఆ కథనమంతా పూర్తిగా కట్టుకథ అని ఆరోపించారు. ‘‘దీనిపై నా తల్లితో మాట్లాడాను. బంగ్లాను వీడే ముందు గానీ, వీడాక గానీ ఏ పత్రికకూ తాను అలాంటి ప్రకటన విడుదల చేయలేదని ఆమె స్పష్టం చేశారు’’ అని తెలిపారు. ఏమిటీ సెయింట్ మారి్టన్ ద్వీపం? అమెరికాపై హసీనా ఆరోపణలతో సెయింట్ మారి్టన్ ద్వీపం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇది ఈశాన్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌కు చెందిన కాక్స్ బజార్–టెక్నాఫ్ ద్వీపకల్పానికి దక్షిణంది 9 కి.మీ. దూరంలో ఉంది. కేవలం 3 చదరపు కి.మీ. విస్తీర్ణముండే ఈ ద్వీపాన్ని బెంగాలీలో నారీకేళ్ (కొబ్బరి) ద్వీపమంటారు. ఇందులో 3,700 మంది నివసిస్తున్నారు. చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటల పెంపకం వారి వృత్తి. ఈ ద్వీపం వ్యూహాత్మకంగా అతి కీలక ప్రాంతంలో ఉంది. చైనాతో వైరం దృష్ట్యా భావి అవసరాల దృష్ట్యా ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు అమెరికా ప్రయత్నిస్తోంది. -
PM Narendra Modi: ఇటు నేను.. అటు ఎవరు?
మహేంద్రగఢ్/పటియాలా: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని, ఆవు పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం రగడ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు మారితే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. తాను బతికి ఉన్నంతకాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని చెప్పారు. దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని స్పష్టంచేశారు. ఈ పోరాటంలో ఒకవైపు ప్రజల సేవకుడు మోదీ ఉన్నారని, మరోవైపు ఎవరున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని పరోక్షంగా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కరడుగట్టిన కులతత్వం, మతతత్వం, బంధుప్రీతితో కూడిన ఇండియా కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, పంజాబ్‌లోని పటియాలాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి విపక్షాల కుట్రలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘రామ్ రామ్’ అని జపించినవారిని అరెస్టు చేస్తారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మన దేశాన్ని ముక్కలు చేసిందని, ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి రెండు ముస్లిం దేశాలను సృష్టించిందని విమర్శించారు. ఈసారి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని గుర్తచేశారు. మన ఆరాధన, విశ్వాసాన్ని కాంగ్రెస్ కించపరుస్తోందని దుయ్యబట్టారు. విభజించగా మిగిలిపోయిన భారతదేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని విపక్ష నాయకులు అంటున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ఇచి్చన రిజర్వేషన్లను సైతం కాజేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు రాత్రికి రాత్రే ఓబీసీ సరి్టఫికెట్లు ఇచ్చేశారని పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో ఇచి్చన ఆ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిందని తెలిపారు. ఒకవేళ కోర్టు అడ్డుకోకపోతే ఓబీసీ అన్యాయం జరిగే మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ముస్లింలకు రిజర్వేషన్లకు కలి్పంచాలని కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాల నిజస్వరూపం ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి ఓటమి తప్పదన్నారు. ఓటమికి బాధ్యులను చేసేందుకు ఒక బకరా కోసం ఆ కూటమిలో ఇప్పటినుంచే అన్వేషణ మొదలైందని పేర్కొన్నారు.పంజాబ్‌లో అరాచక పాలన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. పరిశ్రమలు పంజాబ్‌ను వదిలి వెళ్లిపోతున్నాయని, ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, డ్రగ్స్ మాఫియా, షూటర్ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయని ధ్వజమెత్తారు. పంజాబ్ మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ దర్బార్‌లో హాజరు వేయించుకోవడంతోనే సమయం గడిపేస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్టలు పంజాబ్‌లో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇది డ్రామా కాదా? అని మోదీ నిలదీశారు. -
మణిపూర్ హింసాకాండ.. మేం 4 రోజుల్లో ఆపేవాళ్లం: రాహుల్
కలియబోర్: ప్రధానమంత్రి పదవిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఉండి ఉంటే మణిపూర్‌లో హింసకు నాలుగు రోజుల్లోనే పుల్‌స్టాప్ పడి ఉండేదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం అస్సామ్‌లోని నగావ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తలుచుకుంటే మణిపూర్ హింసను సైన్యం సాయంతో మూడు రోజుల్లో ఆపగలిగేవారని అన్నారు. కానీ, అలా చేయడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ నాలుగు నెలలుగా మండుతున్నా, మన ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. అదే కాంగ్రెస్ ప్రధానే ఉంటే మూడు రోజుల్లోనే అక్కడికి వెళ్లి ఉండేవారు. నాలుగో రోజుకల్లా అక్కడ హింస ఆగిపోయి ఉండేది’అని ఆయన చెప్పారు. ‘నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ, మనస్సు నిండా విద్వేషాన్ని, అహంకారాన్ని నింపుకున్న వారు త్వరలోనే కనుమరుగవుతారు’అని రాహుల్ పేర్కొన్నారు. జై శ్రీ రాం, మోదీ నినాదాలు, రాహుల్ ఫ్లయింగ్ కిస్‌లు... నగావ్ జిల్లాలో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్‌కు నిరసన సెగ తగిలింది. ఒక చోట బీజేపీ కార్యకర్తలు జై శ్రీ రాం, మోదీ, మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు విసురుతూ వారిని కలుసుకునేందుకు వెళ్లారు. సంబంధిత వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తర్వాత ర్యాలీలో మాట్లాడుతూ.. ‘సుమారు 3 కిలోమీటర్ల దూరంలో 20 నుంచి 25 మంది వరకు బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందుకు వచ్చారు. నేను బస్సు దిగి వచ్చే సరికి వారంతా పారిపోయారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వశర్మ ఎవరొచ్చినా మేం భయపడేది లేదు’అని రాహుల్ తెలిపారు. -
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అనూహ్య రాజీనామా
వెల్లింగ్టన్: పదవీ కాలం ఇంకా పది నెలలుంది. ప్రజా బలమూ ఉంది. అయినా ఆమె పదవి కోసం తాపత్రయపడలేదు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనా, లేదా అనే ఆలోచించారు. ప్రధాని పదవి వీడాల్సిన సమయం వచ్చిందంటూ హుందాగా తప్పుకున్నారు. ఆమె ఎవరో కాదు. ప్రగతి శీల పాలనకు పెట్టింది పేరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్. ఆమె వయసు 42 ఏళ్లు మాత్రమే. రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉంది. సమర్థ పాలకురాలిగా, శక్తిమంతమైన నాయకురాలిగా పేరుంది. కరోనా సంక్షోభం, మైనార్టీ ఊచకోత, ప్రకృతి వైపరీత్యాలు సవాల్ ఏదైనా ఆ సమయంలో ఆమె చూపించిన సంయమనం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ప్రధానమంత్రి పదవికి జకిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ప్రధానమంత్రిగా ఫిబ్రవరి 7 తన ఆఖరి రోజని కన్నీళ్లని అదిమిపెట్టుకుంటూ గురువారం లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్‌కి గురి చేశారు. ‘‘నేనూ మనిషినే. ఎంత కాలం చెయ్యగలమో అంతే చేస్తాం. అప్పుడు సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. ఒక దేశాన్ని నడిపించడం సర్వోన్నతమైన పని. అంతే సవాళ్లతో కూడుకున్నది. అనూహ్యంగా వచ్చే సవాళ్లను, పదవితో సంక్రమించిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహించలేనప్పుడు ఎవరూ ఆ పదవిలో ఉండకూడదు. ఉండలేరు కూడా. ప్రధాని పదవిలో ఉండడానికి మీరు సరైన వ్యక్తా, కాదా అన్నది తెలుసుకోవడం కూడా మీ బాధ్యతే. ఇంక ఈ పదవికి నేను న్యాయం చెయ్యలేనని నాకు అనిపిస్తోంది. అందుకే తప్పుకుంటున్నాను. నేనేదో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని ఈ పదవిని వీడడం లేదు. ఆ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే సత్తా మనకుంది’’ అని పార్టీ సభ్యులతో ఆమె ఉద్విగ్నభరితంగా చెప్పారు. గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన జెసిండా హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎందరో మహిళలకు స్ఫూర్తి జెసిండా 2017లో 37 ఏళ్లకే ప్రధాని అయ్యారు. అత్యంత పిన్న వయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచమంతటా రైట్ వింగ్ ప్రభుత్వాలున్న నేపథ్యంలో వామపక్ష భావజాలం కలిగిన ఆమె కొత్త తరానికి ప్రతినిధిగా నిలిచారు. ప్రధానిగా ఉంటూనే బిడ్డకు జన్మనిచ్చారు! కుటుంబ బాధ్యతలు కూడా ముఖ్యమేనని ఈ తరం అమ్మాయిలకు సందేశమిచ్చారు. పొత్తిళ్లలో పాపతోనే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొన్నారు. బిడ్డను లాలించే తల్లికే ప్రజల్ని పాలించడం బాగా తెలుస్తుందన్న సామెతను నిజం చేస్తూ, సంక్షోభం ఎదురైన ప్రతిసారీ తానేంటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చారు. న్యూజిలాండ్ చరిత్రలోనే చీకటి రోజుల్ని 2019 మార్చిలో ఎదుర్కొన్నారు. క్రిస్టిచర్చ్‌లో రెండు మసీదులపై ఒక దుండగుడు దాడి చేసి ప్రార్థనలు చేసుకుంటున్న 51 మంది ముస్లింల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసినప్పుడు చలించిన హృదయంతో బాధితుల పట్ల ఆమె చూపించిన దయ, సానుభూతి ప్రజలందరి మనసుల్లో చెరగని ముద్ర వేసింది. కాల్పులు జరిగిన కొద్ది వారాల్లోనే సెమీ ఆటోమేటిక్ తుపాకుల్ని నిషేధిస్తూ ఆమె కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 50 వేలకిపైగా తుపాకుల్ని, ఏఆర్–15 స్టైల్ రైఫిల్స్‌ని ధ్వంసం చేశారు. ఇక కరోనా సంక్షోభాన్ని ఆమె ఎదుర్కొన్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కరోనా వైరస్ సరిహద్దుల్లోనే కట్టడి చేయడానికి ఆమె తీసుకున్న చర్యలకు అందరూ భేష్ అన్నారు. వాతావరణ మార్పులే ప్రపంచ దేశాలకు అసలైన సవాల్ అని నమ్మిన ఆమె కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించడానికి 2050ని లక్ష్యంగా నిర్ణయిస్తూ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రధానిగా ఆమె తెగువ, శక్తి సామర్థ్యాలకు ప్రజలు ఫిదా అయ్యారు. 2020 ఎన్నికల్లో రికార్డు విజయం ఆమెకు కట్టబెట్టారు. -
UK PM Race: ఎవరెంత దూరం? బ్రిటన్ తదుపరి ప్రధానిపై ఉత్కంఠ
బ్రిటన్ తదుపరి ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీలో పోటీ మొదలైనప్పుడు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారతీయ మూలాలున్న రిషి సునాక్ రేసులో వెనుకబడిపోతున్నారు. విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ క్రమంగా ప్రధాని పీఠానికి దగ్గరవుతున్నట్టుగా సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజా సర్వేలో 58% మంది ట్రస్‌కు మద్దతుగా ఉంటే, సునాక్‌కు కేవలం 26% మంది సభ్యుల మద్దతు లభించింది. 12% మంది ఎటూ తేల్చుకోలేదని వెల్లడించారు. ఇలాంటి సమయంలో స్కై న్యూస్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషి సునాక్ అనూహ్యంగా విజయం సాధించడం ఆయనకి నైతికంగా బలం చేకూరింది. అయినప్పటికీ ప్రధాని పీఠం అంత సులభంగా దక్కేలా లేదు. ఇరువురు నేతలు వచ్చే నెలరోజుల్లో కనీసం మరో 10 సార్లు చర్చల్లో పాల్గొనాలి. ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఆకట్టుకునేలా చెప్పగలగాలి. దాదాపుగా లక్షా 80 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్ని మెప్పించగలగాలి. కోవిడ్ –19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలతో బ్రిటన్ ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం 9.4శాతానికి చేరుకుంది. ఇంధనం ధరలు ఆకాశాన్నంటడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ప్రజలు తీవ్ర అసహనంలో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నుల తగ్గింపు ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. ఇన్నాళ్లూ బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నెంబర్ టూ స్థానంలో కొనసాగడంతో పాలనాపరంగానూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ రిషికి మంచి పట్టు ఉంది. దీంతో ఎంపీలంతా ఆయన వైపే ఉన్నప్పటికీ, టోరీ సభ్యులు ట్రస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఎన్నికల బ్యాలెట్ పత్రాలను పార్టీ సభ్యులకు పంపిణీ చేస్తారు. 2న ఓటింగ్ జరుగుతుంది. 5న ఫలితాలు వెల్లడిస్తారు. రిషి ఎందుకు వెనుకబడ్డారు ? పన్నుల్లో రాయితీ ఇచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతానని లిజ్ ట్రస్ ఇచ్చిన హామీతో ఒక్కసారిగా ఆమె హవా పెరిగింది. ఆదాయ పన్నులో కూడా రాయితీ ఇస్తానని ప్రకటించడం, రిషి ఆర్థిక విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడంతో వారి మధ్య పోటీ పెరిగింది. రిషితో పోల్చి చూస్తే ఎంపీల మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత చేస్తున్న ప్రచారంలో వివిధ అంశాలపై ఆమె ఇస్తున్న హామీలు సభ్యుల్ని ఆకర్షిస్తున్నాయి. రిషిపై ఆగ్రహంతో ఉన్న బోరిస్ జాన్సన్ తెర వెనుక నుంచి లిజ్ ట్రస్‌కు మద్దతునిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. చర్చా కార్యక్రమాల్లో లిజ్ ట్రస్ మాజీ ప్రధాని థాచర్‌ను తలపించే ఆహార్యంతో ఉండడం, ఆదాయ పన్ను రాయితీ వంటి ఆకర్షణీయ పథకాలు ప్రకటిస్తున్నారు. ట్రస్ స్థానికురాలు కావడం, రిషి తాను హిందూ మతాన్నే ఆచరిస్తానని బహిరంగంగా చెబుతూ ఉండడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది. రిషి జీవన విధానం చాలా లావిష్‌గా ఉంటుంది. దేశం ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతున్న సమయంలో ఆయన 500 పౌండ్ల షూ వేసుకోవడం, కోట్ల ఖర్చుతో ఆధునిక వసతులతో ఇల్లు నిర్మించడం, భార్య అక్షతా మూర్తి విదేశీ కార్డుని అడ్డం పెట్టుకొని పన్నులు ఎగ్గొట్టడం వంటివి రిషిపై వ్యతిరేకతను పెంచాయి. అయితే కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న చర్యల్ని ప్రశంసిస్తున్న వారూ ఉన్నారు. వివిధ అంశాలపై వీరిద్దరి వైఖరి.. – నేషనల్ డెస్క్, సాక్షి -
లిజ్ ట్రస్‌కే 90 శాతం విజయావకాశాలు
లండన్: బ్రిటిష్ ప్రధానమంత్రి పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీ నేతలు రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇరువురు తమ పార్టీ సభ్యుల మద్దతు పొందడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే లిజ్ ట్రస్‌కే పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. సర్వేల్లో ఆమె ముందంజలో ఉన్నట్లు తేలింది. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానంటూ ట్రస్ ఇస్తున్న హామీ వైపు అందరూ ఆకర్శితులవుతున్నట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఉన్నాయని ప్రఖ్యాత బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ ‘స్మార్కెట్స్’ తాజాగ ప్రకటించింది. రిషి సునాక్‌కు కేవలం 10 శాతం అవకాశాలే ఉన్నాయని స్పష్టం చేసింది. ట్రస్‌కు తొలుత 60 శాతం విజయావకాశాలు ఉండగా, అది ఇప్పుడు 90 శాతానికి చేరడం ఆసక్తికరంగా మారింది. ఇక రిషి విజయావకాశాలు 40 శాతం నుంచి 10 శాతానికి పడిపోయాయి. పరిస్థితులు మొత్తం ట్రస్‌కు క్రమంగా సానుకూలంగా మారుతున్నాయని స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్స్ అధినేత మాథ్యూ షాడిక్ చెప్పారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ టీవీ చర్చా కార్యక్రమాల్లో రిషి కంటే లిజ్ ట్రస్ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. తాను వెనుకంజలో ఉన్నా చివరి దాకా పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని రిషి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Rishi Sunak: ఔను.. వెనుకంజలో ఉన్నా
లండన్: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీలో తాను వెనుకంజలో ఉన్నట్లు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి రిషి సునాక్ అంగీకరించారు. ప్రత్యర్థి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నారన్నారు. అయినా పట్టుదల వీడబోనని, ప్రతి ఓటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభానికి తెరపడే దాకా పన్నుల తగ్గింపు సాధ్యం కాదని అంటున్నారు. రిషి, ట్రస్ గురువారం రాత్రి యార్క్‌షైర్‌లోని లీడ్స్ పట్టణంలో ఒకే వేదికపైకి వచ్చి తమ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి పదవి దక్కితే తాము అమలు చేయబోయే ఆర్థిక విధానాల గురించి వివరించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారంటూ ఈ సందర్భంగా రిషిని ఓ సభ్యుడు ప్రశ్నించారు. తద్వారా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు వెన్నుపోటు పొడిచారంటూ ఆక్షేపించారు. ‘10, డౌనింగ్ స్ట్రీట్’ (ప్రధాని నివాసం)లో రిషిని చూడాలని జనం కోరుకోవడం లేదన్నారు. ఆర్థిక విధానాలపై బోరిస్‌తో విభేదాలు తీవ్రతరం కావడం వల్ల రాజీనామా చేయక తప్పలేదని రిషి బదులిచ్చారు. అందుకు దారి తీసిన కారణాలను వివరించి ఆకట్టుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీలోని 1,75,000 మంది సభ్యులు పార్టీని నేత, తద్వారా తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5 విజేతను ప్రకటిస్తారు. -
బ్రిటన్ తదుపరి ప్రధాని మనోడేనా ?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి భారత సంతతికి చెందిన వ్యక్తికి లభిస్తుందా? బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ ప్రధాని రేసులో ముందున్నారా ? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి చరిత్ర సృష్టిస్తారా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బ్రిటన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్‌లో కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు 2020 మేలో ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన మందు పార్టీ వివాదం ముదురుతోంది. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బోరిస్ జాన్సన్ ఇచ్చిన పార్టీ వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో విపక్ష లేబర్ పార్టీలో, సొంత పార్టీ కన్జర్వేటివ్‌లలో వ్యతిరేకత పెరుగుతోంది. బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరిగిన గత ఏడాది ఏప్రిల్ 17 ముందు రోజు రాత్రంతా డౌనింగ్ స్ట్రీట్‌లో 30 మంది మందులు, చిందులతో కాలం గడిపారన్న ఆరోపణలు తాజాగా వస్తున్నాయి. ఫిలిప్ భౌతిక కాయం ఉన్న సమయంలో అలాంటి పార్టీలు జరుపుకోవడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ‘పార్టీ గేట్’ వివాదంపై బోరిస్ జాన్సన్ బ్రిటన్ పార్లమెంటులో క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రధాని పీఠం దిగాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన స్థానంలో భారతీయ మూలాలున్న రిషి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బోరిస్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్షమాపణ చెప్పే సమయంలో రిషి సభలో లేకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. ఆర్థిక మంత్రి అయినప్పట్నుంచే రిషి ప్రధాని పీఠంపై మక్కువ పెంచుకున్నారని, అందుకే ‘పార్టీగేట్’ వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో సభకు హాజరుకాలేదని బోరిస్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టిన రిషి తన శాఖకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం వల్లే సభకు హాజరు కాలేదంటూ ట్వీట్ చేశారు. కోవిడ్ విలయంతో తరచూ లాక్డౌన్లతో కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలెక్కించడానికి రిషి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన రిషి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనుష్క అనే కుమార్తెలు ఉన్నారు. -
‘నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి’
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (79)కు శనివారం పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 1990వ దశకంలో పవార్‌కు ప్రధానమంత్రి పదవి రెండుసార్లు అందినట్టే అంది దక్కకుండా పోయిందని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు. కాంగ్రెస్‌లోని దర్బార్ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేకపోయారని వెల్లడించారు. పవార్ తమ పార్టీకి విధేయుడు కాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. దీనిపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రతిభ లేని కొందరు వ్యక్తులకు పవార్ అంటే భయమని, ఆందుకే ప్రధాని పదవి దక్కకుండా చేశారని విమర్శించారు. -
థాయ్ ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా(65) ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి, కోటీశ్వరుడైన థనాత్రోన్ జువాంగ్రోంగ్ రువాంకిట్‌పై ఆయన విజయం సాధించారు. ధాయ్‌లాండ్‌లో ప్రధానిని ఎన్నుకోవడానికి ప్రతినిధుల సభ, సెనెట్ కలిపి 350 సభ్యుల మద్దతు ఉండాలి. అయితే 250 మంది సభ్యులున్న సెనెట్‌లో జుంటా పార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఉండటంతో కౌంటింగ్ కొనసాగుతుండగానే ప్రయూత్ విజయం ఖరారైపోయింది.. 2014లో ఇంగ్లక్ షీనవ్రత ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌరప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా నిలిచారు. -
ప్రధాని పదవికి కేసీఆర్ అర్హుడు
హైదరాబాద్: ప్రధానమంత్రి పదవికి కేసీఆర్ అర్హుడని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధులలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల సభల్లో ఆయన పాల్గొన్నారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌కు మద్దతుగా అహ్మద్‌నగర్ డివిజన్ లోని ఫస్ట్‌లాన్సర్‌లో, గోల్కొండ రిసాలా బజార్లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల కంటే కేసీఆర్ సమర్థుడైన నాయకుడని అన్నారు. పాలన అనుభవంతో పాటు పేద ప్రజల కష్ట సుఖాలు తెలిసిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని పదవికి పూర్తిగా అర్హుడని అన్నారు. ఏ మాత్రం పాలన అనుభవం లేని రాహుల్ ప్రధాని పదవికి ఏ విధంగా అర్హుడవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మొత్తం 17 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ చక్రం తిప్పే నాయకుడవుతాడని జోస్యం పలికారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ మాత్రం ఉనికి లేని బీజేపీ.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని అన్నారు. కేసీఆర్ పారదర్శక పాలనను చూసి తాము ఆయన నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, మాజీ మేయర్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్, తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
ములాయంకు మతి చలించిందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘అందరిని కలుపుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించిన ప్రధానమంత్రికి నా అభినందనలు. సభలోని సభ్యులందరూ విజయం సాధించి మళ్లీ సభకు వస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరు (మోదీ) మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాను’ అని సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ బుధవారం 16వ లోక్‌సభ ఆఖరి సెషన్లో వ్యాఖ్యానించడం ఇంటా బయట సంచలనం సష్టించింది. లక్నో విమానాశ్రయంలో పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో ఆందోళన నిర్వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలను ములాయం వ్యాఖ్యలు ఇబ్బందికి గురిచేశాయి. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో ప్రయత్నాలను ముమ్మరం చేసిన వివిధ పార్టీల నాయకులకు కూడా ములాయం వ్యాఖ్యలు చికాకును కలిగించాయి. ములాయం ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సమాజ్‌వాది పార్టీ నాయకులు అంటున్నారు. ‘ములాయం సింగ్ యాదవ్ తన చుట్టూ ఉన్న ప్రజలనే కాదు. కుటుంబ సభ్యులను కూడా గుర్తించని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన జ్ఞాపక శక్తి పూర్తిగా మందగించింది. ఆయన మాటల మధ్య పొందిక ఉండడం లేదు. మోదీ గురించి ఆయన అలా మాట్లాడడానికి అదే కారణమై ఉంటుంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ‘గత ఏడాది లక్నోలో ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయన ఇలాగే పొరపాటు వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అనుకొని శివపాల్ యాదవ్ పార్టీకి మద్దతివ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఇది సమాజ్‌వాది పార్టీ సమావేశం కాదంటూ ప్రేక్షకుల నుంచి అనేక మంది అరిచారు. దాంతో సర్దుకున్న ములాయం సింగ్ యాదవ్ ఆ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించినందుకు తన సోదరుడిని అభినందిస్తున్నాను అని చెప్పారు’ అని ఎస్పీ సీనియర్ నాయకుడు వివరించారు. బుధవారం నాడు పార్లమెంట్ భవనం నుంచి బయటకు వస్తున్న ములాయం సింగ్ యాదవ్‌ను సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కలుసుకొని ‘మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎందుకు కోరుకున్నారు ?’ అని ప్రశ్నించగా, ‘నేను అలాంటిదేమీ అనలేదే! మీరే ఏదో ఊహించుకుంటున్నారు!’ అని ములాయం వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
ప్రధాని పదవిపై మహారాష్ట్ర సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
2019లో ప్రధాని పదవి ఖాళీగా లేదు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదని కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్‌విలాశ్ పాశ్వాన్ తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం కావడానికి గల కారణాలపై రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని మోదీ చెప్పలేదు. కోర్టు తీర్పుకోసం వేచి ఉండాలనే చెప్పారు. దేశంలో 18,000 గ్రామాలను నిర్ణీత గడువులోగా విద్యుదీకరణ చేశాం. అలాగే గడువులోపలే మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తిచేశాం. ఇండియన్ జ్యుడీషియల్ సర్వీసెస్‌ను కేంద్రం తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తోంది. ఈ మాట పార్లమెంటులో చెప్పాను కాబట్టి సరిపోయింది కానీ బయట చెప్పిఉంటే కోర్టు ధిక్కారం అయ్యేది. కోలీజియం వ్యవస్థలో సైతం పారదర్శకత లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భర్తీలాగే జడ్జీల నియామకంలోనూ పారదర్శకత రావాలి’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. -
రాహుల్‌వి పగటి కలలే!
సాక్షి, బళ్లారి/కోలారు: తదుపరి లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రధాని పదవి చేపడతానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అసలు అలాంటి పరిణతి లేని వ్యక్తిని దేశం ప్రధానిగా అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవి తమకే రిజర్వు అయిందని గాంధీ కుటుంబం భావిస్తోందని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా రాహుల్ గర్వం ఏమాత్రం తగ్గలేదని చురకలంటించారు. గత యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్ సోనియా చేతిలో ఉంటే, తమ ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలే హై కమాండ్ అని అన్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే వంతు ఇప్పుడు కర్ణాటకకు వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ బుధవారం బంగారుపేట, చిక్మగ్లూర్లో జరిగిన ర్యాలీల్లో ప్రసంగించారు. ధ్యాసంతా ప్రధాని పీఠం పైనే... ‘ప్రధాని పదవి తమ కుటుంబానికే రిజర్వు అయిందని ఆయన (రాహుల్) భావిస్తున్నారు. మరెవరూ ఆ కుర్చీపై కూర్చోవద్దని కోరుకుంటున్నారు. అది వారసత్వ హక్కు అని అనుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేల్కొని ఉన్నా, నిద్రిస్తున్నా ప్రధాని కుర్చీ గురించే కలలు కంటున్నారు. భాగస్వామ్య పక్షాలపై నమ్మకం లేని, గర్వం తలకెక్కిన వ్యక్తి 2019 ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతానని ప్రకటించారు. దేశం అలాంటి అపరిపక్వ వ్యక్తిని ప్రధానిగా ఆమోదిస్తుందా? కొందరు నాయకులు 40 ఏళ్లుగా ప్రధాని పదవి కోసం ఎదురుచూస్తున్నారు. వారందరినీ కాదని హఠాత్తుగా ఒకాయన వచ్చి ప్రధాని అవుతానని అంటున్నారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. ఆ ప్రకటన రాహుల్ పొగరు, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్య పరిస్థితిని సూచించడం లేదా? అని ర్యాలీకి తరలివచ్చిన ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి కొత్త నాయకత్వం తీసుకొస్తాడని రాహుల్‌ను 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తే ఈ 11 ఏళ్లలో సాధించిందేమీ లేదని దెప్పిపొడిచారు. నాలుగేళ్లలో సుమారు 25–30 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనా ఆయన అహంభావం తగ్గలేదని అన్నారు. రాజ్యాంగమంటే లెక్కే లేదు.. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పందిస్తూ..‘నన్ను అధికారం నుంచి తప్పించడానికి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు సమావేశమవుతున్నారు. వాళ్లందరనీ కాదని ప్రధాని అవుతానని రాహుల్ ప్రకటించడం ప్రతిపాదిత కూటమిలోని పార్టీల మధ్య విశ్వాసలేమిని తేటతెల్లం చేస్తోంది. గాంధీ కుటుంబానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే లెక్కే లేదు. అందుకే వాటిని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఆరోపించారు. -
తమది చిన్నపార్టీ అని ఒప్పుకున్న సీఎం
పట్నా: తాను ప్రధానమంత్రి పదవికి పోటీలో లేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. తానో చిన్న పార్టీకి చెందిన నాయకుడినని, తనకు జాతీయస్థాయిలో ఆశలు లేవని చెప్పారు. బిహార్ ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి సారించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మోదీకి సమర్థ నాయకుడని నమ్మి దేశ ప్రజలకు ఆయనకు ఎన్నుకున్నారని, తనకు అంత సామర్థ్యం లేదని అన్నారు. ‘శరద్ యాదవ్ వరుసగా మూడుసార్లు జేడీ(యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఈ పదవిని నాకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు నిర్ణయించారు. దీనికి మీడియా పెడర్థాలు తీస్తోంది. నేను జాతీయస్థాయి పదవులపై కన్నేసినట్టు ప్రచారం చేస్తోంది. జేడీ(యూ) అధ్యక్షుడిగా మా పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాను. దీనర్థం నేను ప్రధాని పదవి కోసం కలలు కంటున్నానని కాద’ని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఆచితూచి స్పందించారు. దీనిపై లాలునే అడగాలని, ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. -
ప్రధాని కావడానికి నేనే అర్హుడిని: ఆజంఖాన్
ప్రధానమంత్రి కావడానికి తానే అర్హుడినని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ రాజీనామా చేసి, ఎంపీలంతా తనను ఎన్నుకుంటే అది దేశానికి మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని, దేశం ప్రతిరోజూ పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని పదవికి తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు ఆయన తన పేరు ప్రతిపాదిస్తారన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆజంఖాన్ ఉండాలంటూ లక్నోలో పోస్టర్లు వెలుస్తున్న అంశాన్ని విలేకరులు ఆయనవద్ద ప్రస్తావించగా, ''మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను. దానికి అన్నివిధాలా అర్హుడిని. అందుకే ఉపముఖ్యమంత్రి కావాలంటూ వెలిసిన పోస్టర్లను తీయించేశాను' అని చెప్పారు. ములాయంను ప్రధానిగా చేసి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉప ప్రధాని చేస్తే రాబయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమంటూ ఇటీవల అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. దాని గురించి ఆజం ఖాన్ వద్ద ప్రస్తావించగా, 'దేశ ప్రధాని కావడానికి అన్నివిధాలా నేనే అర్హుడిని. నేను ప్రధాని కావాలని అనుకుంటున్నా' అని కుండ బద్దలు కొట్టి చెప్పారు. -
'ఆయన ప్రధాని పదవికే వన్నె తెచ్చారు'
-
'ఆయన ప్రధాని పదవికే వన్నె తెచ్చారు'
హైదరాబాద్ : ఏడాది పాలనలో భారతదేశం గౌరవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇనుమడింపచేశారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కుంభకోణాల నుంచి విముక్తి కల్పించారని, నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడానికి సిట్ వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులకు మోదీ ప్రయత్నాలు చేశారని, ప్రధాని పదవికే మోదీ వన్నె తెచ్చారని కిషన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పేద వ్యక్తి ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. వామపక్షాలు, రాహుల్ మార్కులు తమకు అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా మోదీ సర్కార్ అ నేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిందని, తెలంగాణవ్యాప్తంగా మోదీ ఏడాది పాలనపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. -
సోనియా గాంధీపై నట్వర్ సింగ్ వ్యాఖ్యలు వాస్తవమే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పునురుద్ఘాటించారు. సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారన్న నట్వర్ వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. 2004 లో సోనియా గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపినా. ఆ పదవిపై ఆమె వెనక్కు తగ్గడానికి రాహులే ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చని మణిశంకర్ తెలిపారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వాఖ్యలను మణిశంకర్ తాజాగా పునరుద్ఘాటించారు. అయితే తల్లి సంరక్షణపై కొడుకు ఉండే ఆందోళనలో భాగంగానే రాహుల్ అలా చెప్పి ఉండవచ్చన్నారు. ప్రధాని పదవిని ఆమె తిరస్కరించడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నా అవి నట్వర్ కు తెలియకపోవచ్చన్నారు. నట్వర్ సింగ్ గాంధీ కుటుంబానికి ఎంత దగ్గరగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోని వాస్తవాలను ఆత్మకథ రూపంలో బయటకు తేవడం కష్టసాధ్యమన్నారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో నిజాలను వెల్లడిస్తానని నట్వర్ చెప్పినా.. అంతర్లీనంగా ఉన్న పూర్తి వాస్తవాలను ఆవిష్కరించడం మాత్రం సాధ్యపడదని మణిశంకర్ తెలిపారు. -
సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారని చెప్పారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని పదవిని చేపట్టరాదని రాహుల్ సోనియాకు ఖరాఖండిగా చెప్పారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమావేశంలో మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, సుమన్ దూబే ఉన్నారని నట్వర్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో ఒక కుమారుడిగా రాహుల్ ఆవేదనను అర్థం చేసుకున్నానని, అతని అభిప్రాయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నాని నట్వర్ సింగ్ అన్నారు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో రాయవద్దంటూ ప్రియాంక గాంధీ ఇటీవల తనను కోరారని తెలిపారు. -
పీఠం కోసం దేశం విచ్ఛిన్నం
మోడీపై రాహుల్ ఆరోపణలు ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పాలనలో 20 వేల మంది మహిళలు అదృశ్యం రాయ్‌పూర్, ఉదర్‌బాండ్: ప్రధాని పీఠం కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని సైతం ముక్కలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని, కర్హిబాదర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఫులోదేవినేతమ్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. అంతకుముందు అసోంలోని ఉదర్‌బాండ్‌లో జరిగిన సభలోనూ ఆయన పాల్గొని మాట్లాడారు. యథావిధిగా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీప్రధాని కావాలనుకుంటున్నారని, అందుకోసం ఆయన ఏదైనా చేస్తారని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతం పేరుతో దేశాన్ని విభజిస్తోందని మండిపడ్డారు. ‘‘బీజేపీలో ఒక్క వ్యక్తికే(మోడీ) ప్రపంచంలో అన్నింటి గురించి తెలుసు. దేశంలో ఏం జరిగినా ఆయనకే తెలుస్తుంది. ఆయనే ఈ దేశాన్ని మార్చేయగలరని బీజేపీ భావిస్తోంది’’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. బీజేపీలా కాంగ్రెస్ ఒక వ్యక్తి గురించి మాట్లాడదని, ప్రజల పార్టీ అని చెప్పారు. రాజకీయాలంటే ప్రజలేనని, అధికారం వారి చేతుల్లోనే ఉండాలని పేర్కొన్నారు. 1. బీజేపీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతోందని, అదేంటో అందరికీ తెలిసిందేనన్నారు. వారి పాలనలో గిరిజన, మైనారిటీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, గుజరాత్ సీఎం మహిళలపై నిఘాకు పోలీసులను పంపిస్తున్నారని దుయ్యబట్టారు. 2.ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా సామాన్యుడికి శక్తి, హక్కులు కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని చెప్పారు. అదే గుజరాత్లో అయితే ప్రజలు ప్రశ్నించలేరని, అక్కడ సమాచారహక్కు చట్టం లేదన్నారు. వారు అవినీతిని నిర్మూలిస్తామంటారని, కానీ గుజరాత్లో లోకాయుక్త లేదని రాహుల్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ పాలనపై కూడా రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ పాలనలో 20 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. -
సోనియా ప్రధాని కావడానికి నేనిప్పటికీ వ్యతిరేకమే: సుష్మా
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విదేశీ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఆమె ప్రధాని కావడానికి తానిప్పటికీ వ్యతిరేకమేనని బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఆమె ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని 2004 మే నెలలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ చింతించేది లేదని చెప్పారు. సోనియా మన దేశానికి ఇందిరకు కోడలుగాను, రాజీవ్ గాంధీకి భార్యగాను వచ్చారని.. అందువల్ల తమ ప్రేమాభిమానాలు ఆమెపట్ల ఉంటాయని సుష్మా అన్నారు. కాంగ్రెస్ అధినేత్రిగా కూడా ఆమెను గౌరవిస్తామని, కానీ దేశానికి ప్రధాని అవుతానంటే మాత్రం తాను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అప్పట్లో గుండు కొట్టించుకుంటానని సుష్మా ఎందుకు బెదిరించారంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె స్పందించారు. దేశం 150 ఏళ్లు విదేశీ పాలనలో ఉందని, స్వాతంత్ర్యం కోసం చాలామంది ప్రాణాలు త్యాగం చేశారని.. ఇప్పుడు కూడా ఓ విదేశీయురాలికి అగ్రపీఠం కట్టబెడితే దేశంలోని వందకోట్ల మంది అసమర్థులేనని చెప్పినట్లు కాదా అని ప్రశ్నించారు. అందుకోసమే తాను బళ్లారి నుంచి ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు.