కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విదేశీ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఆమె ప్రధాని కావడానికి తానిప్పటికీ వ్యతిరేకమేనని బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఆమె ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని 2004 మే నెలలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ చింతించేది లేదని చెప్పారు. సోనియా మన దేశానికి ఇందిరకు కోడలుగాను, రాజీవ్ గాంధీకి భార్యగాను వచ్చారని.. అందువల్ల తమ ప్రేమాభిమానాలు ఆమెపట్ల ఉంటాయని సుష్మా అన్నారు. కాంగ్రెస్ అధినేత్రిగా కూడా ఆమెను గౌరవిస్తామని, కానీ దేశానికి ప్రధాని అవుతానంటే మాత్రం తాను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
అప్పట్లో గుండు కొట్టించుకుంటానని సుష్మా ఎందుకు బెదిరించారంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె స్పందించారు. దేశం 150 ఏళ్లు విదేశీ పాలనలో ఉందని, స్వాతంత్ర్యం కోసం చాలామంది ప్రాణాలు త్యాగం చేశారని.. ఇప్పుడు కూడా ఓ విదేశీయురాలికి అగ్రపీఠం కట్టబెడితే దేశంలోని వందకోట్ల మంది అసమర్థులేనని చెప్పినట్లు కాదా అని ప్రశ్నించారు. అందుకోసమే తాను బళ్లారి నుంచి ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు.
సోనియా ప్రధాని కావడానికి నేనిప్పటికీ వ్యతిరేకమే: సుష్మా
Published Thu, Sep 19 2013 9:17 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement