సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు | Rahul Gandhi told Sonia Gandhi not to accept Prime Minister post, Natwar Singh says | Sakshi
Sakshi News home page

సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు

Published Wed, Jul 30 2014 8:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు - Sakshi

సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారని చెప్పారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా  చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని పదవిని చేపట్టరాదని రాహుల్ సోనియాకు ఖరాఖండిగా చెప్పారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ సమావేశంలో మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, సుమన్ దూబే ఉన్నారని నట్వర్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో ఒక కుమారుడిగా రాహుల్ ఆవేదనను అర్థం చేసుకున్నానని, అతని అభిప్రాయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నాని నట్వర్ సింగ్ అన్నారు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో రాయవద్దంటూ ప్రియాంక గాంధీ ఇటీవల తనను కోరారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement