'ఆయన ప్రధాని పదవికే వన్నె తెచ్చారు' | Kishan reddy praises Narendra Modi | Sakshi
Sakshi News home page

'ఆయన ప్రధాని పదవికే వన్నె తెచ్చారు'

Published Mon, May 25 2015 1:22 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'ఆయన ప్రధాని పదవికే వన్నె తెచ్చారు' - Sakshi

'ఆయన ప్రధాని పదవికే వన్నె తెచ్చారు'

హైదరాబాద్ : ఏడాది పాలనలో భారతదేశం గౌరవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇనుమడింపచేశారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కుంభకోణాల నుంచి విముక్తి కల్పించారని, నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడానికి సిట్ వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులకు మోదీ ప్రయత్నాలు చేశారని, ప్రధాని పదవికే మోదీ వన్నె తెచ్చారని కిషన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.

పేద వ్యక్తి ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. వామపక్షాలు, రాహుల్ మార్కులు తమకు అవసరం లేదని ఆయన అన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి కూడా మోదీ సర్కార్ అ    నేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిందని, తెలంగాణవ్యాప్తంగా మోదీ ఏడాది పాలనపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement