భారత్‌-బంగ్లా బోర్డర్‌: BSF హై అలర్ట్‌ | BSF High Alert At India And Bangladesh Border | Sakshi
Sakshi News home page

బంగ్లాలో రెచ్చిపోతున్న నిరసనకారులు.. శ్రీలంక సీన్‌ రిపీట్‌

Published Mon, Aug 5 2024 7:13 PM | Last Updated on Mon, Aug 5 2024 7:43 PM

 BSF High Alert At India And Bangladesh Border

భారత్‌ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయడంతో త్వరలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కానుంది. ఈనేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత్‌- బంగ్లా సరిహద్దులో బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ హైఅలర్ట్‌ ప్రకటించింది.

కాగా, భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య 4, 096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉన్న నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌ అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ ఛౌదరి కోల్‌కత్తాకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను తొలగించి ప్రతిభకు పట్టం కట్టాలని చేస్తున్న ఆందోళనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడారు. ఈ క్రమంలో భారత్‌ చేరుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లా సైన్యం రంగంలోకి దిగింది. బంగ్లాలో సైనిక పాలన కొనసాగుతుండగా.. కర్ఫ్యూ విధించారు. అయితే, కర్ప్యూను దాటుకొని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు.

 

 మరోవైపు.. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభాబన్‌ను ముట్టడించి, అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్‌, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement