Oct 3, 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Naidu Arrest Cases Court Hearings October 3 Live Updates - Sakshi
Sakshi News home page

Oct 3, 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Tue, Oct 3 2023 7:02 AM | Last Updated on Thu, Oct 5 2023 11:05 AM

Chandrababu Naidu Arrest Cases Court Hearings Oct 03 Live updates - Sakshi

LIVE : Chandrababu In Rajamaundry Central Prison, Cases Scams And Court Hearings Ground updates

6:45 PM, అక్టోబర్‌ 03, 2023
మాట్లాడే ప్రతీ మాటకు సాక్షాలుంటాయా? : బండారు ఎదురుదాడి
► స్పెషల్ మొబైల్ కోర్టులో బండారు సత్యనారాయణమూర్తిని హాజరు పరిచిన పోలీసులు
► విచారణలో బండారు సహకరించడం లేదు : న్యాయమూర్తికి తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్
► ఎన్నో మాట్లాడతాం, మాట్లాడే ప్రతీదానికి సాక్ష్యాలు ఉంటాయా ? బండారు ఎదురు ప్రశ్నలు
► పోలీసుల విచారణలో బండారు తీరును న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్
► ఇరువైపుల వాదనలు విన్న తరువాత ఆదేశాలు ఇవ్వనున్న న్యాయమూర్తి

6:35 PM, అక్టోబర్‌ 03, 2023
నోరు జారి.. పరువు తీసుకుని.. ఇప్పుడు కోర్టు మెట్లెక్కి.!
► హైకోర్టును ఆశ్రయించిన బండారు సత్యనారాయణ లాయర్
► బండారు సత్యనారాయణ అరెస్ట్‌ను ప్రశ్నిస్తూ పిటిషన్
► రెండు కేసుల్లో 41A నోటీసులు ఇచ్చారన్న న్యాయవాది
► కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
► పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు ఆదేశం
► విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు

6:15 PM, అక్టోబర్‌ 03, 2023
అది టిడిపి కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ : మంత్రి రోజా
తిరుపతి : మీడియా సమావేశంలో కన్నీళ్ళ పర్యవంతమైన మంత్రి రోజా
► దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారు
► మాజీ మంత్రి బండారు చేసిన వాఖ్యలు వింటే రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారు
► టిడిపి లో ఉన్న మహిళలు మాత్రం బండారు వాఖ్యలు స్వాగతిస్తున్నారు
► మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరయినా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా?
► మాట్లాడితే సినిమా వాళ్ళు అంటారు.. టిడిపి పార్టీ పెట్టిందే ఎన్టీఆర్, ఆయన సినిమా నుంచి రాలేదా?
► మంత్రి బండారు భార్యను అడుగుతున్నా.. ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు
► లోకేష్ ఇలాంటి వాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు, సిగ్గు చేటు
► మహిళ సాధికారతకు పాటుపడుతున్న..రాజకీయాల్లో 20 ఏళ్ళు గా ఉన్నా
► నేను రాజకీయంగా మంత్రి గా ఎదిగితే.. చూసి ఓర్వలేక వాఖ్యలు చేస్తున్నారు
► జయసుధ, జయప్రద, దివ్య వాణి ,శారదా, నేను...
►  సినిమా రంగం నుంచి తెలుగుదేశంలో పనిచేశాం, ఆ పార్టీలో మమ్మల్ని అవమానించారు

6:10 PM, అక్టోబర్‌ 03, 2023
రేపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి మరో పిటిషన్‌
► ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ
► ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
► కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్
► విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్  ధర్మాసనం
► ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో  చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన
► కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ACB విఫలమైంది
► ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో తెలంగాణ ACB విఫలమైంది
► అందుకే ఈ కేసును CBIకి బదిలీ చేయాలని పిటిషన్‌లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినతి

5:40 PM, అక్టోబర్‌ 03, 2023
ACB కోర్టులో రేపే కస్టడీ, బెయిల్‌ పిటిషన్లు
► విజయవాడ : రేపు ACB కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ
► మరో అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ పిటీషన్ వేసిన CID
► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదన్న సిఐడి
► పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా రేపు ఒకేసారి వాదనలు

5:20 PM, అక్టోబర్‌ 03, 2023
జైలు ముందు పవన్‌ పొత్తు ప్రకటిస్తే BJP స్పందించదు
► విజయవాడ : ముగిసిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం
► సమావేశం అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు,దగ్గుబాటి పురంధేశ్వరి
► పవన్ చేసే ప్రతి కామెంట్‌పై స్పందించాల్సిన అవసరం లేదు
► పొత్తులపై పవన్ అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం
► పొత్తులు, పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తాం
► ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు కొనసాగుతుందా..? లేదా..?
► ఈ అంశంపై జాతీయ నాయకత్వమే స్పష్టత ఇస్తుంది
► మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ : పురందేశ్వరీ

5:00 PM, అక్టోబర్‌ 03, 2023
బండారు సత్యనారాయణ @ హైకోర్టు
► బండారు సత్యనారాయణ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
► 41A నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
► కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ప్రభుత్వం
► తదుపరి విచారణ ఈనెల 5కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
► బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన మంత్రి రోజా
► ఇలాంటి నేతల వల్లే భవిష్యత్తు స్వప్నాలు నిర్ణయించుకోవడంలో బాలికలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వస్తుందన్న రోజా

4:50 PM, అక్టోబర్‌ 03, 2023
లోకేష్‌ @ ఫైబర్‌ గ్రిడ్‌ కేసు
► ఫైబర్ గ్రిడ్ కేసుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ
► ఫైబర్ గ్రిడ్ కేసులో ప్రస్తుతానికి లోకేష్ నిందితుడు కాదు : అడ్వకేట్ జనరల్
► లోకేష్‌ను నిందితుడిగా చేరిస్తే 41A నోటీసు ఇస్తాం
► 41A నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతాం
► అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని లోకేష్‌ పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి

4:35 PM, అక్టోబర్‌ 03, 2023
చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
► ఏపీ హైకోర్టు: ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు
► బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడు పిటిషన్
► పూర్తయిన ఇరుపక్షాల వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

(చదవండి : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మలుపుల వెనక కుంభకోణమేంటీ?)

4:15PM, అక్టోబర్‌ 03, 2023
GGHకు టిడిపి నేత బండారు సత్యనారాయణ
► గుంటూరు ప్రభుత్వాసుపత్రికి బండారు సత్యనారాయణ
► వైద్య పరీక్షల నిమిత్తం సత్యనారాయణను తీసుకువచ్చిన పోలీసులు
► ఆసుపత్రి వద్ద లాయర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట
► వైద్య పరీక్షల్లో బండారుకు హైబీపీ, సెలైన్ ఎక్కించిన వైద్యులు
► వైద్య పరీక్షల తర్వాత బండారును మొబైల్ కోర్టులో హాజరు పరిచే అవకాశం
► బండారు తరపున వాదనలు వినిపించనున్న దొడ్డాల కోటేశ్వర రావు, చుక్కపల్లి రమేష్, టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు హరిబాబు
► రోజా పై అనుచిత వ్యాఖ్యల పై బండారుపై కేసు నమోదు
► Cr.No.354/2023 U/s 153 (A), 354(A), 504, 505, 506, 509, 499 IPC,
► సెక్షన్ 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద బండారు పై కేసులు నమోదు

4:15PM, అక్టోబర్‌ 03, 2023
హెరిటేజ్‌ డాక్యుమెంట్లపై కోర్టుకు లోకేష్‌
► CID ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో సవాల్ చేసిన నారా లోకేష్
► లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని చెప్పిన న్యాయవాదులు
► కంపెనీ తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు లోకేష్ ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని చెప్పిన న్యాయవాదులు
► లోకేష్‌ను ఇవి అడగడం సమంజసం కాదు : సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు
► తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమన్న సీఐడీ తరపు న్యాయవాదులు
► రేపు లోకేష్‌ విచారణకు హాజరు కావాలని కోరిన సీఐడీ తరపు న్యాయవాదులు
► ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10న విచారణకు లోకేష్‌ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు

4:05PM, అక్టోబర్‌ 03, 2023
హైకోర్టు : విచారణకు లోకేష్‌ హాజరు కావాల్సిందే
►ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం : ఏపీ హైకోర్టులో లోకేష్‌కు దక్కని ఊరట
►ఫైబర్‌గ్రిడ్‌ స్కామ్‌లో లోకేష్‌ పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు
►అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
►41A సీఆర్పీసీ నిబంధలను పాటిస్తామన్న ఏజీ

4:00PM, అక్టోబర్‌ 03, 2023
హైకోర్టు : రింగ్‌ రోడ్డు కేసులో వాదనలు
►ఇన్నర్‌ రింగ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్ధ్‌ లూద్రా

3:15 PM, అక్టోబర్‌ 03, 2023
రెచ్చగొడుతున్నాడా? రెచ్చిపోవాలంటున్నాడా?
► కృష్ణా జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివాదస్పద ప్రకటనలు
► రేపు పెడన వారాహి యాత్ర సభలో నాపై రాళ్లదాడి చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది
► నాపై దాడికి రెండు నుంచి మూడు వేల మంది వస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది
► ఎవరు ఏం చేసినా జనసైనికులు ఎదురుదాడికి దిగొద్దు
► ఎవరైనా జేబులోంచి ఏమైనా తీస్తే వారిని కట్టేసి పోలీసు స్టేషన్ కు పట్టుకెళ్దాం

3:10 PM, అక్టోబర్‌ 03, 2023
విజయవాడ BJP కార్యాలయంలో కోర్‌ కమిటీ భేటీ
► ఏపీ బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఏపి బీజీపీ కోర్ కమిటీ సమావేశం
► సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు పురంధరేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి,
► ఎంపీ GVL నరసింహారావు, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, సోము వీర్రాజు
► ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
► టీడీపీతో పొత్తులపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ

3:00 PM, అక్టోబర్‌ 03, 2023
చంద్రబాబు శిష్యుడు రేవంత్‌కు సుప్రీంకోర్టులో షాక్‌
► ఓటుకు కోట్లు సరే, కానీ అది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదు : రేవంత్‌ పిటిషన్‌
► రేవంత్ రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం
► రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం
► గతంలో రేవంత్‌ పిటిషన్‌ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు
► హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి
► కచ్చితంగా అది అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

2:50 PM, అక్టోబర్‌ 03, 2023
అక్టోబర్‌ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌ను ఆదేశించిన హైకోర్టు
► ఈనెల 10, మంగళవారం రోజున నారా లోకేష్‌ను విచారించనున్న CID
► ఈ మేరకు సీఐడీకి ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు
► 41ఏ నోటీసులోని నిబంధనలను సవాల్ చేసిన లోకేష్
► ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు
► ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విచారించాలని ఆదేశం
► న్యాయవాదిని కూడా అనుమతించాలన్న ఏపీ హైకోర్టు
► మధ్యాహ్నం గంట పాటు లోకేష్‌కు భోజనం బ్రేక్ ఇవ్వాలన్న హైకోర్టు

2:30 PM, అక్టోబర్‌ 03, 2023
జనసేనతో పొత్తును ఏం చేద్దాం? : BJP
► విజయవాడ : కాసేపట్లో AP BJP కోర్ కమిటీ సమావేశం
► బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు
► జైలుకు వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ అక్కడే పొత్తు ప్రకటన చేశారు
► ఇప్పుడు పవన్‌తో పొత్తును ఏం చేద్దాం?
► కోర్‌ కమిటీలో నిర్ణయం తీసుకోనున్న AP బీజేపీ నేతలు

2:00 PM, అక్టోబర్‌ 03, 2023
2018లోనే GST ఈ కేసు దర్యాప్తు చేపట్టింది : పొన్నవోలు
► సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మీడియాతో CID లాయర్‌, అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
► ఈ కుంభకోణం బయటపెట్టింది GSTనే
► 17(A)వచ్చింది 26-07-2018
► 05-06-2018లోనే స్కిల్ స్కామ్‌ విచారణను GST చేపట్టింది
► తప్పు జరిగింది, అవినీతి జరిగింది, పన్ను ఎగ్గొట్టారని GST అప్పుడే రాష్ట్రప్రభుత్వానికి సూచించింది
► స్వయంగా ముఖ్యమంత్రే తప్పు చేయడం వల్ల GST ఇచ్చిన సూచనలు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు
► రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని దుర్వినియోగం చేశారు చంద్రబాబు
► GST దర్యాప్తు ప్రారంభించింది 2018 కంటే ముందు కాబట్టి... ఇది 17a సవరణ కిందికి రాదు
► 17(A) స్కిల్‌ స్కాం కేసుకు అప్లై కాదు
► నేరం జరిగినప్పుడు, దర్యాప్తు ప్రారంభమైనప్పుడు కూడా 17(A) లేదు
► హైకోర్టు ముందు కూడా దర్యాప్తు డాక్యుమెంట్‌ను సమర్పించాం
► అదే డాక్యుమెంట్‌ను సుప్రీంకోర్టు అడిగింది. హైకోర్టులో ఇచ్చిన డాక్యుమెంట్‌నే సర్వోన్నత న్యాయస్థానంకు సమర్పిస్తాం

1:45 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబువి పసలేని వాదనలు : లాయర్లు
► కేవలం 17A సెక్షన్‌ సవరణపైనే ఆధారపడ్డ చంద్రబాబు లాయర్లు
► బెయిల్‌ కోసం ప్రయత్నించకుండా, మొత్తం కేసునే క్వాష్‌ చేయాలన్న తపనలో బాబు లాయర్లు
► చంద్రబాబు తప్పు చేయలేదని ఎక్కడా చెప్పని చంద్రబాబు లాయర్లు
► కేవలం అరెస్ట్‌ జరిగిన విధానాన్ని తప్పుబట్టిన చంద్రబాబు లాయర్లు
► గవర్నర్‌ అనుమతి తీసుకోలేదన్న వాదనను వినిపించిన బాబు లాయర్లు
► చంద్రబాబు లాయర్లలో రెండు వైఫల్యాలు
► 17A సెక్షన్‌ సవరణ కేవలం అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే వర్తిస్తుందన్న కోర్టు
► చంద్రబాబుపై నమోదయిన FIRలో అవినీతి నిరోధక చట్టంతో పాటు IPC సెక్షన్లు
► నేరం జరిగింది 2014-15 మధ్యకాలంలో అని స్పష్టంగా తెలిసినా 17Aపైనే ఆధారపడ్డ బాబు లాయర్లు
► ఈ కేసులో ఇంతకు మించిన బలమైన వాదన లేదన్నట్టుగా వ్యవహరించిన బాబు లాయర్లు
► బాబు లాయర్ల వాదనలతో అంగీకరించని సర్వోన్నత న్యాయస్థానం

1:24 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట

జస్టిస్‌ బోసు : ఈ కేసులో హైకోర్టు ముందు బెయిల్‌ పిటిషన్‌ వేసుకోండి
జస్టిస్‌ బోసు : ఈ కేసును సోమవారానికి వాయిదా వేస్తున్నాం
చంద్రబాబు తరపు లాయర్‌ లూథ్రా : కానీ చంద్రబాబు జైల్లో ఉన్నారు. అది కదా కష్టం
CID తరపు లాయర్‌ రోహత్గీ  : వీళ్లు కనీసం బెయిల్‌ అడగడం లేదు, ఏకంగా కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేశారు
చంద్రబాబు తరపు లాయర్‌ లూథ్రా : ఇప్పుడు చంద్రబాబును పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారు, రేపు హైకోర్టు ముందు బెయిల్‌ పిటిషన్‌ లిస్టయింది. అరెస్టయిన 15 రోజుల తర్వాత కస్టడీ అడగడం సరికాదు.
జస్టిస్‌ బోసు : ఈ కేసులో ఇంకా పరిశీలించాల్సిందేమీ లేదు. ఈ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నాం. ఇరుపక్షాలు అప్పుడు డాక్యుమెంట్లు అన్నీ సమర్పించండి. కేవియట్‌ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలకు మద్ధతిచ్చే డాక్యుమెంట్లు సమర్పించాలి. దర్యాప్తు ముందే ప్రారంభమయిందని నిరూపించాలి
బెంచ్‌ : ఈ కేసులో ఉత్తర్వులిస్తున్నాం. క్వాష్‌ పిటిషన్‌పై వాదనలను సోమవారం వింటాం. అలాగే హైకోర్టు ముందు CID సమర్పించిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించాలి

1:20 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు

జస్టిస్‌ బోసు : 2018కు ముందే దర్యాప్తు ప్రారంభమైందని ఎలా చెబుతారు?
CID తరపున ముకుల్‌ రోహత్గీ : ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. 2017కంటే ముందే నేరం జరిగింది. 2018 జులైలో చట్టసవరణ వచ్చింది, 2021లో FIR నమోదయింది. ఈ కేసులో ఏ రకంగానూ 17ఏ వర్తించదు
రోహత్గీ : అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు
రోహత్గీ : ఏకంగా 2000 పేజీల పిటిషన్‌ను హైకోర్టు ముందుంచారు
►రోహత్గీ వాదనలను అడ్డుకునేందుకు లూథ్రా ప్రయత్నం
రోహత్గీ : లూథ్రా గారు, మీ వంతు వస్తుంది, ఆగండి

1:14 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు

జస్టిస్‌ బోసు : FIRలో రెండు రకాలు సెక్షన్లు ఉన్నాయి
సింఘ్వీ : కానీ అవినీతి నిరోధక సెక్షన్ల కిందే చర్య తీసుకున్నారు
లూథ్రా : ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు, వరుసగా FIRలు నమోదు చేశారు
జస్టిస్‌ బోసు : మీరు వేసిన పిటిషన్‌పైనే ఉన్నాం. కేవలం 17a వర్తిస్తుందా? లేదా అన్నదాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం
CID తరపున ముకుల్‌ రోహత్గీ : ఒకసారి కేసును చూడండి. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు?


(CID తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు)

1:10 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు

సింఘ్వీ : ఒకసారి కేసును చూడండి. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయి
జస్టిస్‌ త్రివేదీ : మేం కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు
జస్టిస్‌ బోసు : ఇప్పటికిప్పుడు కేసును క్వాష్‌ చేయాలన్న అంశంపై మేం ఆసక్తి చూపించడం లేదు

1:05 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై CID తరపు ముకుల్‌ రోహత్గీ వాదనలు

రోహత్గీ : ఈ అంశాన్ని ఇంతకుముందే సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది
జస్టిస్‌ త్రివేదీ : CrPC కోడ్‌ ప్రకారం 17A సవరణ పాటించాలని ఎక్కడా లేదు
సింఘ్వీ : అవినీతి నిరోధక చట్టం ఒకసారి పరిశీలించండి
జస్టిస్‌ త్రివేదీ : FIRలో రెండు సెక్షన్లు ఉన్నాయి, Prevention of corruption ఉంది, అలాగే IPC ఉంది

1:01 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడి వాదనలు

జస్టిస్‌ త్రివేదీ : 17A అనేది కేవలం అవినీతి నిరోధక చట్టానికే వర్తిస్తుంది, ఇండియన్‌ పెనల్‌ కోడ్‌ కింద నమోదయిన కేసుల సంగతేంటీ?
సాల్వే : ఏ కేసుకయినా 17A సవరణ వర్తించాల్సిందే
లూథ్రా  : అవును, ఏ కేసుకయినా 17A సవరణ వర్తించాలి
జస్టిస్‌ బోస్‌ : కేవలం లా పొజిషన్‌ను బట్టి మాత్రమే ముందుకు వెళ్తాం
జస్టిస్‌ త్రివేదీ : ఈ కేసులో కోర్టు పరిశీలించాల్సింది ఒకే ఒక అంశం. IPC కింద నమోదయిన కేసులకు 17A సవరణ వర్తిస్తుందా? లేదా?


(సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు లాయర్‌ సింఘ్వీ వాదనలు)

12:53 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడి వాదనలు

► చంద్రబాబు తరపున మరో సీనియర్‌ లాయర్‌ AM సింఘ్వీ ఎంట్రీ
► రఫెల్‌ కేసు సమయంలో యశ్వంత్‌ సిన్హా కేసును ఉదహరించిన సింఘ్వీ
జస్టిస్‌ త్రివేదీ : చంద్రబాబు కోసం ఎంత మంది సీనియర్‌ లాయర్లు వాదిస్తున్నారు?
సాల్వే : నలుగురు లాయర్లు ఉన్నారు, అయినా మేం ముకుల్‌ రోహత్గీకి సరిపోం
► యశ్వంత్‌ సిన్హా కేసులో జస్టిస్‌ జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును చదివి వినిపిస్తున్న సీనియర్‌ కౌన్సిల్‌ సాల్వే
జస్టిస్‌ త్రివేదీ : ఈ కేసులో నేరం ఎప్పుడు జరిగింది?
లూథ్రా  : 2015-16 మధ్య జరిగింది

12:43 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు హరీష్‌ సాల్వే వాదనలు

► కానీ చంద్రబాబు అరెస్ట్‌ ఇప్పుడు చేశారు
► కచ్చితంగా సెక్షన్‌ 17A దీనికి వర్తించాలి
► అరెస్ట్‌ చేసిన విధానం తప్పు అని హైకోర్టుకు కూడా తెలిపాం
► కానీ హైకోర్టు మా వాదనతో అంగీకరించలేదు
► 17A సవరణ వల్ల వచ్చే ప్రొటెక్షన్‌ చంద్రబాబుకు వర్తించాల్సిందే
► గవర్నర్‌ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ అరెస్ట్‌ వర్తించదు
► విచారణ ప్రారంభమైన తేదీనే ప్రామాణికంగా తీసుకోవాలి
► మంత్రిమండలి అనుమతి లేకుండానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారన్నారు
► చంద్రబాబు సూచనలతోనే కొందరని ఎక్స్‌ అఫిషియోలుగా తీసుకొచ్చారని అభియోగాలు మోపారు
 


(వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు తరపున సాల్వే వాదనలు)

12:42 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టు : సాల్వే వాదనలపై జస్టిస్‌ త్రివేదీ ప్రశ్నలు

► ఈ నేరం 2015-16 మధ్య జరిగింది
► 17A చట్ట సవరణ 2018లో జరిగింది
► అలాంటప్పుడు 17A ఏ రకంగా వర్తిస్తుంది?

12:40 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు హరీష్‌ సాల్వే వాదనలు

► స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తీరు తప్పు
► ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 7, 2021న ప్రారంభించినట్టు ADGP లెటర్‌ను బట్టి తెలుస్తోంది
17A చట్టం ప్రకారం అరెస్ట్‌ చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందే

12:35 PM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు కేసు

► ఢిల్లీ: సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కేసు విచారణ
► తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
► కేసు విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ బోస్,  జస్టిస్ బేలా త్రివేది
► రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్
► CID దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున  కేసు క్వాష్  చేయలేమని తీర్పునిచ్చిన హైకోర్టు
► తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ 
► గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్‌లో వాదనలు
► తొలుత వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు లాయర్‌ హరీష్‌ సాల్వే

12:32 PM, అక్టోబర్‌ 03, 2023
హైకోర్టులో లోకేష్‌ లంచ్‌ మోషన్‌
► ఏపి హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్
► ఫైబర్ నెట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
► మధ్యాహ్నం లోకేష్ పిటిషన్ పై విచారణ
► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో CID నోటీసులపై లంచ్ మోషన్ పిటిషన్
► CID 41ఏ నోటీసుల్లో ఉన్న నిబంధనలపై లోకేష్ అభ్యంతరం 
► హెరిటేజ్ బ్యాంక్ లావాదేవీలు తీసుకురావలనడంపై పిటిషన్

12:12 PM, అక్టోబర్‌ 03, 2023
జనసేనతో ప్రతీ టిడిపి కార్యకర్త టచ్‌లో ఉండాలి : చినరాజప్ప

► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో చినరాజప్ప ములాఖత్, అనంతరం మీడియాతో మాట్లాడిన రాజప్ప
ఆరోగ్యం గురించి : చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారు, చంద్రబాబుకు అందరూ మద్ధతివ్వాలి
రాజకీయాల గురించి : జనసేనతో త్వరలో ఉమ్మడి కార్యాచరణ  ప్రారంభిస్తాం
పవన్‌ కళ్యాణ్‌ గురించి : క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యవర్గమంతా జనసేనతో టచ్‌లో ఉండాలని సూచించాం
చంద్రబాబు గురించి : జైల్లో ఉన్నా రాష్ట్రం ఏమైపోతుందోనని చంద్రబాబు బాధపడుతున్నారు
కార్యకర్తలకు ఏం చెబుతారు? : ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు జైల్లో చాలా బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు

11:25 AM, అక్టోబర్‌ 03, 2023
హైకోర్టులో నారాయణకు దక్కని ఊరట

► ఏపీ హైకోర్టులో నారాయణ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ 16వ తేదీకి వాయిదా
► అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ వాయిదా
► నారాయణ ముందస్తు బెయిల్, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని వేసిన పిటిషన్లపై విచారణ ఈనెల 16కు వాయిదా
► రేపటి గైర్హాజరుకు అనుమతించాలని నారాయణ విజ్ఞప్తి, అంగీకరించని హైకోర్టు
► ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణకు సంబంధించి మినహాయింపు విజ్ఞప్తి
► 60 ఏళ్ల వయస్సు వచ్చింది కాబట్టి స్టేషన్‌కు రానంటున్న నారాయణ
► పోలీసులే ఇంటికి వచ్చి విచారణ జరపాలంటూ లంచ్‌ మోషన్‌లో విజ్ఞప్తి
► అమరావతి భూదందాలో నారాయణదే కీలక పాత్ర : YSRCP MP విజయసాయి

11:20 AM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంకోర్టులో పుంగనూరు అల్లర్ల కేసు విచారణ

► ఢిల్లీ: సుప్రీంకోర్టులో పుంగనూరులో పోలీసులపై టిడిపి నేతల దాడి కేసు విచారణ
► నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
► దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్
► దాడి కేసులో చల్లా బాబుపై 7 కేసులు నమోదు
► 4 కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
► కేసులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు

11:10 AM, అక్టోబర్‌ 03, 2023
అరెస్ట్‌ అనగానే గుర్తుకొచ్చిన అనారోగ్యం

► హఠాత్తుగా బండారు సత్యనారాయణను పేషేంటును చేసిన తెలుగుదేశం నేతలు
► బండారు సత్యనారాయణ హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్నాడంటూ కలరింగ్‌
► మరి నోరు జారేప్పుడు హైబీపీ, మధుమేహం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన YSRCP
► గుంటూరు నగరంపాలెం స్టేషన్‌కు వచ్చిన సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు

11:06 AM, అక్టోబర్‌ 03, 2023
ముందస్తు బెయిల్‌ కావాలంటూ లోకేష్‌ మరో పిటిషన్‌

► హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
► ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ విజ్ఞప్తి
► లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో విచారణకు రేపు విజయవాడ వస్తోన్న లోకేష్‌
► చంద్రబాబు అరెస్టయిన మూడు రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయిన లోకేష్‌
► దాదాపు మూడు వారాలుగా ఢిల్లీలోనే కాలక్షేపం చేస్తోన్న లోకేష్‌

11:05AM, అక్టోబర్‌ 03, 2023
ఇవ్వాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందా? లేదా?

► సుప్రీంకోర్టులో ఆఖరు నెంబర్‌గా లిస్టయిన చంద్రబాబు పిటిషన్‌
► జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ
► 63వ నెంబర్‌ కేటాయించిన రిజిస్ట్రీ, చివరి కేసుగా బెంచ్‌ ముందుకు
► ఈ కేసు కంటే ముందు ఏ ఒక్క కేసులో సుదీర్ఘ వాదనలు జరిగినా ఈ కేసు వాయిదా పడే అవకాశం
► చంద్రబాబు తరఫున వాదించేందుకు సిద్ధమైన దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా
► జాబితాలో చిట్టచివరన ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత

10:46AM, అక్టోబర్‌ 03, 2023
చంద్రబాబుతో కుటుంబం ములాఖత్‌

►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవనున్న నారా భువనేశ్వరి ,బ్రాహ్మణి
►వారితోపాటు ఇవాళ చంద్రబాబును కలవనున్న టీడీపీ నేత చినరాజప్ప
►ఇప్పటికే చంద్రబాబు కలిసిన యనమల, అచ్చం నాయుడు, నారాయణ
►సత్యమేవ జయతే దీక్ష వివరాలు చంద్రబాబుకు తెలియజేయునన్న భువనేశ్వరి

10:25AM, అక్టోబర్‌ 03, 2023
చట్టాలకు ఆయనేం అతీతుడు కాదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

►విశాఖ: అవినీతి చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు
►చట్టాలకు చంద్రబాబు అతీతుడేం కాదు
►బాబు అవినీతికి ఆధారాలు దొరికాయి కాబట్టే అరెస్ట్‌ చేశారు
►అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు
►పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే చెప్పారు
►భువనేశ్వరి దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
►అవినీతిపరుడు కోసం దీక్ష చేసి గాంధీని అవమానించారు
►లంచాలు తిని కంచాలు కొడటే చేసిన తప్పులు పోతాయా?
►భువనేశ్వరి చేసిన దీక్ష సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే
►కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా..  చంద్రబాబు
► చంద్రబాబు.. ఓ ఆర్థిక ఉగ్రవాది
►చంద్రబాబు కడిగిన ముత్యం కాదు.. అవినీతి ముత్యం
►దీక్ష పేరుతో  నారా భువనేశ్వరి.. ఎస్సీ ఎస్టీ మహిళా నేతలను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు
►చంద్రబాబు పెద్ద అవినీతి పరుడనీ ఎన్టీఆర్ చెప్పారు
►అవినీతి చక్రవర్తికి అబద్దాల భార్య అని భువనేశ్వరికి పేరు పెడితే బాగుంటుంది
►30 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బతుకు చంద్రబాబుది
►చంద్రబాబు అక్రమ ఆస్తులుపై భువనేశ్వరి దీక్షల చేయాలి
►చంద్రబాబు మించిన అవినీతి సైకో మరొకరు లేరు

10:14AM, అక్టోబర్‌ 03, 2023
రేపు ఉదయం విజయవాడకు నారా లోకేష్
► చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్‌
► దాదాపు రెండు వారాల తర్వాత..  రేపు ఉదయం విజయవాడకు రాక
► ఢిల్లీలో ఇంతకాలం లీగల్‌ సంప్రదింపులంటూ టీడీపీ శ్రేణుల ప్రచారం
► అరెస్ట్‌ భయంతోనే పరారైనట్లు రాజకీయ వర్గాల చర్చ
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు నారా లోకేష్‌ సీఐడీ విచారణ
► సెప్టెంబర్ 30న CRPC 41A కింద ఢిల్లిలో లోకేష్‌కు నోటీసులు
► ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్పోస్‌ చేసి.. విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించిన ఏపీ హైకోర్టు

09:40AM, అక్టోబర్‌ 03, 2023
చంద్రబాబు అరెస్ట్‌.. ఎవరూ పట్టించుకోరేం?
► చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో దృష్టి దక్కకపోవడంపై టీడీపీలో చర్చ
► పార్టీకి ఇంతటి దుస్థితి ఎందుకు అని సీనియర్ల ఆవేదన 
► చంద్రబాబు తర్వాత తెలుగుదేశంలో మరో పెద్ద తలకాయ లేదా?
► జాతీయ స్థాయిలో రెండు కూటములు ఎందుకు దూరం పెడుతున్నాయి?
► కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు?
► కనీసం కాంగ్రెస్‌ అధిష్టానం నుంచయినా బాబుకు అనుకూలంగా ఒక్క మాట రావట్లేదు?
 

09:00AM, అక్టోబర్‌ 03, 2023
చంద్రబాబు జైలు నిద్రలతో.. : విజయసాయిరెడ్డి
►చిన్న వాగులా మొదలై కడలిని చేరేలోగా అఖండ జలరాశిలా పోటెత్తుతుంది నది.
►కాలంతో పాటు ఉరకలువేసే మనిషి జీవితమైనా, సమాజపు ప్రస్థానమైనా తరంగిణిలా సాగిపోతుంది.
►ప్రకృతి నియమం అది.
►చంద్రబాబు గారు లాక్కున్న టీడీపీ మాత్రం.. ఆయన జైలు నిద్రలతో ఎండిపోయిన చెలిమెలా తయారైంది.


08:50AM, అక్టోబర్‌ 03, 2023
బండారు అరెస్ట్‌పై పచ్చ బ్యాచ్‌ ఓవరాక్షన్‌
►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత మంత్రి రోజాపై విశాఖ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు
►సోమవారం రాత్రి అరెస్ట్‌
►గుంటూరు పీఎస్‌కు తరలింపు
►బండారును నిర్దాక్షిణ్యంగా అరెస్ట్‌ చేశారంటూ పచ్చ మీడియా గగ్గోలు
►పీఎస్‌ బయట మంగళవారం ఉదయం టీడీపీ నేతల ఓవరాక్షన్‌

08:20AM, అక్టోబర్‌ 03, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డులో బెయిల్‌ కోసం చంద్రబాబు

►ఇన్నర్‌రింగ్‌ రోడ్డు స్కామ్‌ కేసులో ఏపీ హైకోర్టులో బాబు పిటిషన్‌
►ఐఆర్‌ఆర్‌ స్కాంలో ఏ1గా చంద్రబాబు 
►బెయిల్‌ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ
►మరోవైపు ఏ2 నారాయణ ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై కూడా
►రేపు నారాయణ-నారా లోకేష్‌ను విచారించనున్న ఏపీ సీఐడీ
► ఇప్పటికే నోటీసుల అందజేత

07:50AM, అక్టోబర్‌ 03, 2023
టీడీపీ డ్రామాల్ని  పట్టించుకోవట్లేదు

►సత్యమేవ జయతే దీక్ష పేరుతో చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఒకరోజు ఆందోళన చేపట్టిన టీడీపీ
►చంద్రబాబు అరెస్ట్ నుంచి టీడీపీ చేపట్టిన ఏ ఒక్క ఆందోళన విజయవంతం కాని వైనం
►సత్యమేవ జయతే దీక్షను సక్సెస్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు
►పట్టించుకోని రాజమండ్రి వాసులు
►అంతకు ముందు.. మోత మోగిద్దాంకూ అదే పరిస్థితి
►జైల్లో చంద్రబాబు దీక్ష చేపట్టారు.. ఒక్క పూట మాత్రమే ఉపవాసం 

07:39AM, అక్టోబర్‌ 03, 2023
సుప్రీంలో పుంగనూరు దాడి కేసు విచారణ
►నేడు సుప్రీంకోర్టులో పుంగనూరులో పోలీసులపై టిడిపి నేతల దాడి కేసు విచారణ
►నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
►టీడీపీ నేతలు దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్
► దాడి కేసులో చల్లా బాబు పై 7 కేసులు నమోదు
► నాలుగు కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు. 
► పుంగనూరులో సరెండర్ అయిన చల్లా బాబు

07:32AM, అక్టోబర్‌ 03, 2023
మా వాదనలు వినాలి: ఏపీ ప్రభుత్వం

►సుప్రీంలో చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై నేడు విచారణ
►సర్వోన్నత న్యాయస్థానంలోని 6వ నంబర్‌ కోర్టులో లిస్ట్‌
►మరోవైపు పిటిషన్‌పై.. కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైన ఏపీ ప్రభుత్వం
► తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి
► నేటి పిటిషన్‌ల జాబితాలో చిట్టచివరగా లిస్ట్‌(నెంబర్‌ 63) అయిన చంద్రబాబు పిటిషన్‌
► విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత


07:10AM, అక్టోబర్‌ 03, 2023
నేడు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
►నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసు
►రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు
►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం
►ఐటెం నెం.42 గా లిస్ట్ అయిన కేసు
►ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి 
►ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం
►సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ
►ఈ కేసులో చంద్రబాబు సైతం ఇన్‌వాల్వ్‌ అయిన వైనం

07:08AM, అక్టోబర్‌ 03, 2023
చంద్రబాబు పాపి.. చిరాయువు

►భువనేశ్వరి స్పీచ్‌కు ‘అమ్మా..’అంటూనే వైఎస్సార్‌సీపీ కౌంటర్‌
►చంద్రబాబు అమాయకుల ఉసురు పోసుకున్నారు
►బషీర్ బాగ్ కాల్పుల ఘటన నుంచి గోదావరి పుష్కరాల్లో ఎన్నో ప్రాణాలను తన ఖాతాలో వేసుకున్నారు
►చంద్రబాబు పాపి.. కాబట్టి చిరాయువుగా శిక్షలు అనుభవిస్తారు
►చంద్రబాబు ప్రజలకోసం బతకలేదు.. కేవలం నారా ఫ్యామిలీ కోసమే బతుకుతున్నారు 
►రెండు శాతం షేర్ల ధర 400 కోట్లు అవడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది

07:06AM, అక్టోబర్‌ 03, 2023
ఏంటీ పరిస్థితి
►అమరావతిలో  రాత్రి టీడీపీ హడావిడి సమావేశం 
►రాత్రి 11గంటలకు అచ్చెన్న ఆధ్వర్యంలో టిడిపి నేతల సమావేశం 
►బాబు అరెస్ట్ తర్వాత మెరుగుపడని పార్టీ పరిస్థితి
►సర్వేల్లోనూ బోల్తా కొడుతున్న సైకిల్‌ 
►కిమ్ కర్తవ్యం అనే దానిపైనే అచ్చెన్న చర్చ

07:00AM, అక్టోబర్‌ 03, 2023
నారాయణ పిటిషన్లపై విచారణ
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుIRR కుంభకోణంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి నారాయణ
►IRR కేసులో ఏ2గా నారాయణ
►పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే ఛాన్స్‌
►అలాగే.. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో తనపై కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్‌
►రెండు పిటిషన్లపై విచారణ జరిగే అవకాశాలు

06:58AM, అక్టోబర్‌ 03, 2023
కంచాల మోత.. దొంగ దీక్షలు

►చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ రోజుకో డ్రామా
►జనాల అటెన్షన్‌ కోసం తీవ్ర యత్నాలు
►మోత మోగిద్దాంకు దక్కని స్పందన
►గాంధీ జయంతిని దీక్షల పేరిట డ్రామాలు
►బాబు రాజమండ్రి జైల్లో.. భార్య భువనేశ్వరి రాజమండ్రిలో.. కొడుకు లోకేష్‌ ఢిల్లీలో ఏడు గంటల దీక్ష 
►అవినీతి చేసి సత్యాగ్రహ దీక్షలు చేయడంపై ముక్కున వేలేసుకుంటున్న జనం
►టీడీపీ నుంచే దక్కని స్పందన.. లైట్‌ తీసుకున్న నేతలు
►వందల కోట్లు నొక్కేసి సత్యాగ్రహ దీక్ష చేస్తే సరిపోతుందా? అంటున్న జనం

06:50AM, అక్టోబర్‌ 03, 2023
చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్

►నేడు సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌ విచారణ 
►స్కిల్‌ స్కాంలో తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు 
►తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్  
►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్‌లో వాదన
► హైకోర్టులో ఎదురుదెబ్బ తర్వాత.. ఆ తీర్పును ఆశ్రయిస్తూ సుప్రీంకెళ్‌లిన చంద్రబాబు
►ఎస్‌ఎల్‌పీని విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుధ్‌ బోస్,  జస్టిస్ బేలా త్రివేది బెంచ్‌
►చంద్రబాబు తరఫున దేశంలో నే అత్యంత ఖరీదైన లాయర్ లు సిద్ధార్థ్ లూత్రా, హరీశ్ సాల్వే వాదనలు
►నేడు చివరి పిటిషన్‌గా.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు

06:48AM, అక్టోబర్‌ 03, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @24

►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో జ్యూడీషియల్‌ రిమాండ్‌ మీద చంద్రబాబు ఖైదీ నెంబర్‌ 7691
► నేటితో (అక్టోబర్‌ 3)తో 24వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్‌ 
► నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement