సాక్షి, చెన్నై: మదురై కేంద్ర కారాగారంలో రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు న్యాయవాది పుగలేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఖైదీలు సిద్ధం చేసిన వస్తువుల్ని ప్రభుత్వ ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు తరలించినట్టుగా గణాంకాల్లో జైళ్లశాఖపేర్కొని ఉన్నట్టు సమాచార హక్కు చట్టం మేరకు వివరాల్ని పుగలేంది సేకరించారు.
(చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..)
ఈ లెక్కలు తప్పుల తడకగా ఉండడంతో కోర్టు తలుపు తట్టారు. మదురై కారాగారంలో 2016–2020 మార్చి వరకు రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు, జైళ్ల శాఖలోని కొందరి మాయా జాలంతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హోం శాఖ, జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సూచించారు. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న గణాంకాలే అవినీతి జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయని, తక్షణం కేసును ఏసీబీ విచారణకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ సాధ్యమైనంతవరకు త్వరిగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది.
(చదవండి: అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!)
Comments
Please login to add a commentAdd a comment